S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ ప్రతిష్ఠ మసకబారుతోందా..?

పాలకుల ఆలోచనలు, వారి అంచనాలు ఎప్పుడూ అతిగానే ఉంటాయి. తమకు నచ్చింది అందరికీ నచ్చితీరుతుందన్నది వారి భావన. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వారి నిర్ణయాలు జనాలకు అప్రియంగా కనిపిస్తుంటాయి. అయినా తమ ధోరణి మార్చుకోవడానికి సిద్ధపడని పాలకులు- ‘సర్వత్రా తమకు సానుకూలత వ్యక్తమవుతోందం’టూ చేతిలో ఉన్న మీడియా భజంత్రీలతో డప్పులు కొట్టిస్తుంటారు. ఆ డప్పుల మోత మర్మమేమిటో సామాన్యుడికి ఎరుకే. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో కూడా చాలామంది ఆమె నిర్ణయాన్ని సమర్ధించారు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144

ప్రధానిని సత్కరించిన టి.సిఎం కెసిఆర్

హైదరాబాద్, నవంబర్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు, బిజెపి నాయకులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రధానమంత్రిని శాలువాతో సత్కరించి, వెండి వీణ, ఒక పుస్తకాన్ని బహూకరించారు. ఈ సత్కారానికి ముందు విమానాశ్రయంలో ప్రధాని, ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడుకున్నారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై ఇద్దరు చర్చించారు. నోట్ల చలామణి తగ్గించడానికి కృషి చేయాలని అన్నారు.

అకాడమీలో మార్నింగ్ వాక్ అధికారులతో కలిసి యోగా

హైదరాబాద్, నవంబర్ 26: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్నింగ్ వాక్ చేశారు. అరగంట సేపు మార్నింగ్ వాక్ చేసిన తర్వాత మోదీ అకాడమీలోని పరేడ్ మైదానంలో యోగా చేశారు. యోగా కార్యక్రమంలో పోలీసు డిజిపి, ఐజిపిలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి యోగాలో పాల్గొనడం జీవితంలో అద్భుతమైన రోజని, ఎప్పటికీ మర్చిపోలేమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి అన్నారు. మోదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై డిజిపిలు ఇచ్చిన ప్రజెంటేషన్‌లోని కీలకమైన సమాచారాన్ని శ్రద్ధగా వినడమే కాకుండా తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

పాతబస్తీలో ప్రహ్లాద్ మోదీ

హైదరాబాద్, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శనివారం హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ప్రధాని శనివారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పర్యటించగా, ఆయన సోదరుడు మాత్రం సామాన్య సందర్శకుడిలా పాతబస్తీలో ప్రత్యక్షమయ్యారు. ప్రహ్లాద్ మోదీ శనివారం ఉదయం పాతబస్తీ చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ, నిర్వాహక సభ్యులు ప్రహ్లాద్ మోదీకి ఘనస్వాగతం పలికారు.

సుప్రీం చెప్తే మందిర నిర్మాణానికి ఓకే

న్యూఢిల్లీ, నవంబర్ 26: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు చెప్పినా శిరసావహిస్తామని అఖిలభారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి అంగీకరించారు. టీవి జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్వహించిన టైమ్స్ లిట్‌ఫెస్ట్ కార్యక్రమంలో ఇద్దరు నేతలూ ఒకే వేదికపై కలిశారు. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ వివాదాస్పద స్థలం కేసులో సుప్రీం కోర్టు తీర్పును తాము ఆమోదిస్తామని ఇద్దరూ స్పష్టం చేశారు. మందిరాన్ని నిర్మించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్తే దానికి తాము అంగీకరిస్తామని ఒవైసీ అన్నారు.

అరకోటి విలువైన వెయ్యి నోట్లు స్వాధీనం

రాజమహేంద్రవరం, నవంబర్ 26: చెన్నైనుంచి రూ.అర కోటి విలువైన వెయ్యి రూపాయల నోట్లను మార్చేందుకు రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డిఎస్పీ (జిఆర్‌పి) లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పెద్దనోట్ల శనివారం కస్టమ్స్ అధికారి పి పాండురంగారావుతో కలిసి డిఎస్పీ సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరం నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో తాడేపల్లిగూడెం వరకు వెళ్లి తిరిగి బొకారో ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేస్తూ గోదావరి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

జగన్‌కు వణుకు

కడప, నవంబర్ 26: పెద్దనోట్ల రద్దుతో ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి వణుకుపుట్టిందని, దాచుకున్న డబ్బంతా ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం కడప నగరం, రాజంపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ అధికారంలోకి రావడం కలేనన్నారు. ప్రజల్లో తమకు మంచి పేరు వస్తుంటే విపక్ష నేత ఓర్వలేక ప్రాంతాలవారీగా పర్యటిస్తూ తన తండ్రి హయాంలో స్థాపించిన, మొదలుపెట్టిన పనులపై రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య

హైదరాబాద్/ రాజేంద్రనగర్, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ బందోబస్తుకు వచ్చిన ఎస్‌ఐ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. హన్మకొండ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీ్ధర్ (30) కొమరం భీమ్ జిల్లా ఆసీఫాబాద్ మండలం పెంచికల్‌పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. 2012లో ఎస్సైగా విధుల్లో చేరిన శ్రీ్ధర్, మొదట ఏపి బెటాలియన్ కానిస్టేబుల్‌గా పనిచేసి అనంతరం ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ రెండురోజుల పర్యటన నేపథ్యంలో భద్రత నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు.

పరిధి దాటొద్దు!

ప్రభుత్వ విభాగాలు ‘లక్ష్మణ రేఖ’కు లోబడే ఉండాలి
వాటిని కనిపెట్టాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది
చట్టాలు, ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండొద్దు
ఉంటే.. న్యాయ వ్యవస్థ సహించదు: సిజెఐ ఠాకూర్

నకిలీ 2 వేల నోట్ల ముద్రణ

హైదరాబాద్/ గచ్చిబౌలి, నవంబర్ 26: పెద్ద నోట్లను రద్దు చేయడంలో భాగంగా కేంద్రం కొత్తగా 2వేల నోటు తీసుకొస్తే, అది ప్రజల చేతికి పూర్తిగా అందకముందే నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. కొంత కాలంగా వంద, యాభై, ఇరవై, పది రూపాయల నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. కేసులో 8మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారైనట్టు రాచకొండ కమిషనర్ మహేష్ ఎం భగత్ తెలిపారు. శనివారం ఆయన మీడియాకు ముఠా వివరాలు వెల్లడించారు.

Pages