S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డేటా సర్వే కాదు... డైనమిక్ సర్వే

విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా సాధికారత సర్వే.. కుటుంబాలకు సంబంధించిన డేటా సర్వే మాత్రమే కాదని ఇదొక డైనమిక్ సర్వే అని సిఎం సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. ప్రజాసాధికారత సర్వే 2016ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో జరుగుతున్న పల్స్ సర్వే తీరుతెన్నులను తెలుసుకోవడానికి హర్యానా రాష్ట్రం నుంచి ఒక బృందం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపారు.

సమీర్ సంచలనం

కౌలూన్, నవంబర్ 26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో భారత యువ ఆటగాడు సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి, ఒక్కో అడ్డంకిని సమర్థంగా అధిమిస్తూ ముందుకు సాగుతున్న అతనికి సెమీ ఫైనల్‌లో మూడోసీడ్ ఆటగాడు జాన్ ఒ జొర్గెనె్సన్ ఎదురయ్యాడు. ర్యాంకింగ్స్‌లోనేగాక, అంతర్జాతీయ వేదికలపై తనకంటే ఎంతో అనుభవం ఉన్న జొర్గెనె్సన్‌తో సెమీస్ మ్యాచ్‌ని సమీర్ 43 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. 21-19, 24-22 తేడాతో వరుస సెట్లలో అతనిని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

మహిళల ఆసియా కప్‌లో భారత్ శుభారంభం

బ్యాంకాక్, నవంబర్ 26: మహిళల ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఈ జట్టు 64 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. వనే్డ ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీ రాజ్ 49 పరుగులతో నాటౌట్‌గా నలవగా, స్మృతి మందానా 41 పరుగులు చేసి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 54 పరుగులకు ఆలౌట్ చేసింది.

సంకుల సమరం

మొహాలీ, నవంబర్ 26: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సంకుల సమరం కొనసాగింది. భారత బౌలింగ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 57, జొస్ బట్లర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాలను అందించాడు. అతని ప్రతిభతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లకు 268 పరుగులు చేసింది. ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

పెవిలియన్ అటు..

మొహాలీ: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్‌తో శుక్రవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో బెన్ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించాడని బ్రిటన్ నుంచి వచ్చిన పాత్రికేయులు ఆరోపించడంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్రీజ్ నుంచి బయటకు వచ్చి భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే, బ్యాట్‌కు కనెక్ట్ కాకుండా బంతి నేరుగా వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ గ్లోవ్స్‌లోకి వెళ్లింది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టంప్ చేశాడు.

కివీస్ చేతిలో భారత్ ఓటమి నాలుగు దేశాల హాకీ టోర్నీ

మెల్బోర్న్, నవంబర్ 26: నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్ టైటిల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో శనివారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో టైటిల్ కోసం పోటీపడే అవకాశాన్ని చేజార్చుకొని, ఆదివారం మూడో స్థానం కోసం మలేసియాతో పోరును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన మొదటి 15 నిమిషాల్లో భారత క్రీడాకారులు దూకుడును ప్రదర్శించారు. కానీ, గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. మ్యాచ్ 18వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ ద్వారా ఈ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదైంది.

రాహుల్‌కు గాయం.. రేసులో ధావన్!

మొహాలీ, నవంబర్ 26: భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ చేతి గాయం పూర్తిగా నయం కాకపోవడంతో ఇంగ్లాండ్‌తో శనివారం ప్రారంభమైన మూడో టెస్టుకు దూరమయ్యాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ చేతికి గాయమైంది. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్‌కు నొప్పి మరింత పెరిగిందని, అందుకే మూడో టెస్టుకు అతను దూరమయ్యాడని జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు న్యూజిలాండ్‌తో నాగపూర్‌లో టెస్టు ఆడుతూ కాలి కండరాలు బెణకడంతో రాహుల్ చివరి రెండు టెస్టులతోపాటు, అదే జట్టుతో జరిగిన వనే్డ సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు.

‘గాలి’ కబుర్లు!

సాధారణంగా ఊహాజనిత, అసాధ్యమైన విషయాలను ఎవరైనా ప్రస్తావిస్తుంటే ‘గాలి కబుర్లు’ చెబుతున్నారంటూ ఎ ద్దేవా చేస్తుంటాం. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఎదుటివారిని విస్తుపోయేలా చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు కారకుణ్ని తానేనని చెప్పారాయన. ‘అసెంబ్లీ ఎన్నికలకు రెండు మాసాల ముందుగా వెదురుకుప్పం జెడ్పీటిసి స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని 7 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిపించి చంద్రబాబు దిమ్మతిరిగేలా చేశాను. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉప ఎన్నికల్లో గెలవటం అసాధ్యం.

సీమకు జలకళ కలేనా?

ఒక్క పంట తడి కోసం డెబ్బయి ఏళ్లుగా పడిగాపులు..
కన్నీళ్లతో నిరంతరం రైతుల ఎదురుచూపులు..

- యక్కలూరి శ్రీరాములు 99856 88922

ఆర్థిక సంక్షోభం తప్పదా?

ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టిన- చందాన దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దు చేసి సరికొత్త ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. పెద్దనోట్ల రద్దుతో సంపన్న వర్గాల సంగతేమో గానీ, నిరుపేదలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నిత్యావసర సరకులు, అత్యవసర మందులు, ఆస్పత్రి ఖర్చులకు చేతిలో నగదు లేక పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. 500, 1000 రూపాయలను మార్చుకునే గడువు ముగిసిందని కేంద్రం ప్రకటించి చివరికి చేతులెత్తేసింది.

- షేక్ కరిముల్లా

Pages