S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై ఉక్కుపాదం

ఏలూరు, నవంబర్ 26: దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తూ, అన్నివర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదిని ప్రజలు దేవుని దూతగా చూస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎక్కడా అవినీతి మచ్చ లేని పాలన అందిస్తున్నారని ప్రస్తుతించారు. ఇలాంటి పరిస్ధితి చూసే జనం అంతా సంతృప్తిగా ఉన్నారని, అయితే ఇది భరించలేక విపక్షాలు అర్ధం లేని విమర్శలకు దిగుతూ యాగీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

అలీనోద్యమంలో కీలక పాత్ర

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో భారత్‌కు అత్యంత ఆప్తమిత్రుడు. ఆలీన ఉద్యమంలో ఆయన కీలకభూమిక పోషించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఫిడెల్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 1959లో క్యూబా విప్లవం తరువాత అధికారం చేపట్టిన క్యాస్ట్రో అలీన దేశాలకు స్నేహపాత్రుడిగానే ఉండేవారు. కమ్యూనిస్టు క్యూబాకు అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలున్నప్పటికీ భారత్ అన్ని రకాల సహాయ, సహకారాలు అందించింది. ఇరుదేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి.

జడ్జీల నియామకంపై మళ్లీ పేచీ

న్యాయ వ్యవస్థ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
న్యాయమూర్తుల కొరతతో కోర్టులు పనిచేయట్లేదని సిజెఐ జస్టిస్ ఠాకూర్ ఆవేదన
సంక్షోభ ముగింపునకు సర్కారు చొరవ చూపాలని సూచన
విభేదించిన న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఈ ఏడాది 120 మంది జడ్జీలను నియమించామని వెల్లడి

భారత్‌కు మంచి మిత్రుడు

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. క్యాస్ట్రో భారత్‌కు ఓ మంచి స్నేహితుడని రాష్టప్రతి, ప్రధాని తమ సందేశంలో స్పష్టం చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. క్యూబా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 20వ శతాబ్దం ప్రపంచ నాయకుల్లో ఫిడెల్ క్యాస్ట్రో ఒకరని రాష్టప్రతి పేర్కొన్నారు. ప్రియతమ నేతను కోల్పోయి విషాదంలో ఉన్న క్యూబా ప్రజలకు భారత్ మద్దతుగా ఉంటుందని ప్రధాని ప్రకటనలో వెల్లడించారు. 90 ఏళ్ల ఫిడెల్ క్యాస్ట్రో శనివారం కన్నుమూశారు.

అగ్రరాజ్యానికే సింహస్వప్నం

హవానా, నవంబర్ 26: విప్లవ సైన్యానికి సారథ్యం వహించి క్యూబాకు అద్భుతమైన విజయాన్ని సాధించిన మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఇకలేరు. క్యూబాలో సోవియట్ తరహా కమ్యూనిస్టు వ్యవస్థను బలంగా పాదుకొల్పడంతోపాటు అధ్యక్షుడిగా అర్ధ శతాబ్దంపాటు దేశాన్ని ముందుకు నడిపి తన హయాంలో అగ్రరాజ్యమైన అమెరికాకు, ఆ దేశానికి చెందిన పదిమంది అధ్యక్షులకు సింహస్వప్నంగా నిలిచిన ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఫిడెల్ క్యాస్ట్రో తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు (తమ్ముడు), ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ప్రభుత్వ టెలివిజన్ చానల్ ద్వారా ప్రకటించారు.

3 నెలలకోసారి నష్టపరిహారం

న్యూఢిల్లీ, నవంబర్ 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికిగాను కేంద్రం మూడు నెలలకోసారి నష్టపరిహారం ఇవ్వనుంది. జిఎస్‌టి అమలైన తొలి ఐదేళ్లలో లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు తదితర ఉత్పత్తులపై ‘జిఎస్‌టి నష్టపరిహార సెస్సు’ పేరిట లెవీని రాష్ట్రాలకు ప్రతి త్రైమాసికానికి కేంద్రం ఇస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జిఎస్‌టి నష్టపరిహార నిధి’ నుంచి ఈ చెల్లింపులను కేంద్రం చేస్తుంది.

ఎయిర్‌టెల్ చేతికి ఎకోనెట్ వాటా

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. నైజీరియాలోని తమ అనుబంధ సంస్థలో ఎకోనెట్ వైర్‌లెస్‌కున్న వాటాను కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ నైజీరియాలో ఎకోనెట్ వైర్‌లెస్ లిమిటెడ్‌కు 4.2 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను భారతీ ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ (నెదర్లాండ్స్) బివి ద్వారా కొనుగోలు చేసినట్లు శనివారం భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ కొనుగోలుతో ఎయిర్‌టెల్ నైజీరియాలో తమ వాటా 83.25 శాతానికి పెరిగినట్లు ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలియజేసింది.

పాత నోట్లను అనుమతించండి

న్యూఢిల్లీ, నవంబర్ 26: పాత 500, 1,000 రూపాయల నోట్లను మొబైల్ ఫోన్ల కొనుగోలుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) విజ్ఞప్తి చేసింది. ఈ నోట్ల రద్దు నిర్ణయంతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 50 శాతం పడిపోయాయని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మేరకు ఐసిఎ ఓ లేఖను రాసింది. పాత పెద్ద నోట్ల రద్దుతో మొబైల్ పరిశ్రమ అమ్మకాలు దాదాపు 350-400 కోట్ల రూపాయలు తగ్గాయని చెప్పింది. నోట్ల రద్దుతో నగదు కొరత ఏర్పడిందని, పంట కాలం కావడంతో కూలీలు, విత్తనాలు, ఎరువులకే ఉన్న నగదును ఎక్కువగా వాడటం జరుగుతోందని ఐసిఎ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహింద్రు అన్నారు.

సామాన్యులు స్వాగతిస్తున్నారు

తిరుపతి, నవంబర్ 26: నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేద ప్రజలకు మేలు చేయాలన్న సత్సంకల్పంతో పెద్ద నోట్లు రద్దుచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారని, అయితే విపక్షాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన కుమార్తెకు వివాహం జరగడంతో నూతన వధూవరులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల, తిరుపతిలో విలేఖరులతో ముచ్చటించారు.

నోట్ల రద్దు.. కీలక ఆర్థిక సంస్కరణ

న్యూఢిల్లీ, నవంబర్ 26: అత్యంత కీలక ఆర్థిక సంస్కరణల్లో పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటి అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా అన్నారు. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డ రతన్ టాటా.. నల్లధనంపై పోరుకు నోట్ల రద్దు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడు ప్రధాన ఆర్థిక సంస్కరణల్లో నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటంటూ పేర్కొన్నారు. డీలైసెన్సింగ్, జిఎస్‌టితోపాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు దేశ చరిత్రలో చెప్పుకోదగ్గవని గుర్తుచేశారు.

Pages