S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకం

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకమని జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సపై ఫస్ట్ మెడికల్ రెస్పాండర్‌ల నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో గురువారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విపత్తులు-కమ్యూనికేషన్ పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్‌లో ప్రధానంగా ప్రసార మాధ్యమాలు అత్యంత ఉపయోగకరమన్నారు. ప్రసార మాధ్యమాల సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయడం సులభతరమన్నారు.

వీరజవాన్లపై దాడి హేయమైన చర్య

కర్నూలు, సెప్టెంబర్ 22: కాశ్మీరులోని యూరి ఆర్మీ బేస్ క్యాంపులో నిద్రిస్తున్న వీర జవాన్లను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చడం హేయమైన చర్య అని, దీన్ని ప్రపంచ మంత ముక్తకంఠంతో ఖండిస్తోందని ఎస్పీ ఆకే.రవికృష్ణ అన్నారు. గురువారం రాత్రి ఎపిజెఎఫ్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో పాత్రికేయులు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎస్పీ దంపతులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో 17 మంది వీర జవాన్లు వీర మణం పొందారని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మార్చి నాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పూర్తి

నందికొట్కూరు, సెప్టెంబర్ 22: మార్చి చివరినాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి 12 పంపుల ద్వారా రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ సిహెచ్ విజయ మోహన్ తెలిపారు. గురువారం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎతిపోతల పథకం నుంచి నవంబర్ నెలలో మూడు పంపుల ద్వారా కెసి కాలువకు, డిసెంబర్ నెలలో మూడు పంపుల ద్వారా హంద్రినీవా సుజల స్రవంతికి క్రిష్ణా జలాలను విడుదల చేస్తామన్నారు.

పాలేరువాగు ఉగ్రరూపం

మహానంది, సెప్టెంబర్ 22: మండలంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు, కాల్వలు, పొంగి పొర్లాయి. మండలంలోని గాజులపల్లె ఆర్‌ఎస్ గిరిజన కాలనీ వర్షపునీటితో నిండిపోయింది. మండలంలో ఎటుచూసినా పంట పొలాలు చెరువులను తలపిస్తూ నీటి మునిగాయి. 46.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లమల అడవిలో వర్షం భారీ స్థాయిలో కురువడంతో ఒక్కసారిగా పాలేరువాగు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో మండలంలోని రాళ్లవాగు పొంగి పొర్లడంతో మహానంది క్షేత్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎటువైపు దారి లేకపోవడంతో క్షేత్రానికి వచ్చిన భక్తులు బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.

రైతుల గోడు పట్టని ప్రభుత్వాలు

గోనెగండ్ల, సెప్టెంబర్ 22: రైతుల గోడును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోలేదని మాజీ కేంద్ర మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం గోనెగండ్లలో జరిగన చింతలముణి, నల్లారెడ్డి స్వాముల దశిమి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట్ల ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం కోట్ల విలేఖర్లతో మాట్లాడుతూ ఉల్లి, మిరప, టమోటా పంటలకు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో దిగువ కాలువ నీరు విడుదల అయ్యేది అనుమానమే అన్నారు.

ఆత్మకూరులో భారీ వర్షం

ఆత్మకూరు, సెప్టెంబర్ 22 : రెండు రోజలుగా కురుస్తున్న వర్షాలకు ఆత్మకూరు అతలాకుతలమైంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంకలు, వాగులు ఉప్పొంగాయి. 80.5 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాల వల్ల చిన్నపాటి వర్షానికే గుండ్లకమ్మ వాగు పొంగి ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ సారి ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షం కురువడంతో గుండ్లకమ్మ వాగు చుట్టూ ఉన్న సాయిబాబా కాలనీ, ఏకల్వనగర్, అర్బన్ కాలనీలు నీట మునిగాయి. అర్ధరాత్రి గుండ్లకమ్మ వాగు వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోని చేరింది. దీంతో కాలనీ వాసులు భయందోళనతో రాత్రింతా జాగారం చేశారు.

పాలేరువాగును పరిశీలించిన అధికారులు

నంద్యాల రూరల్, సెప్టెంబర్ 22: మండలంలోని పెద్దకొట్టాల, అబాండతాండ మధ్యలో ఉన్న పాలేరు వాగు ఉద్ధృతిని డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఆర్‌ఐ శివ ప్రసాద్‌రెడ్డిలు విఆర్‌ఓలతో కలసి పరిశీలించారు. ఈ ఉద్ధృతి వల్ల ఈ గ్రామాల ప్రజలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కుందూ గ్రామాలు భీమవరం, పులిమద్ది, రాయమాల్పురం, ఊడుమాల్పురం, చాపిరేవుల, మిట్నాల, గుంతనాల, గోస్పాడు మండలంలోని కుందూ పరివాహక ప్రాంతాలు అయిన రాయపాడు, కూలూరు, తేళ్లపురి గ్రామాల ప్రజలు కుందూ ఉద్ధృతి గంట గంటకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌లు గ్రామ ప్రజలకు తెలిపారు.

రోడ్ల కండీషన్ సర్వే వాహనం

కర్నూలు, సెప్టెంబర్ 22: జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ ఆధ్వరంలోని రహదారులపై అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేసే వాహనాన్ని కలెక్టర్ విజయమోహన్ గురువారం కలెక్టరేట్ ఎదుట జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల కండీషన్ సర్వే చేయడానికి ఇవాహనం ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో 3770 కిలో మీటర్ల పొడవున రోడ్లు సర్వే చేసి రెండు సంతవ్సరాల్లో మొత్తం రోడ్లన్నీ బాగు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

నగర పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 22: ఆళ్లగడ్డ నగరక పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ వుంచి మురికిని శుభ్రం చేసి స్వచ్చ ఆళ్లగడ్డ చేయడమే లక్ష్యం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నగడర పంచాయతీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 20 వార్డుల్లో పారిశద్ధ్యంపై దృష్టి సారించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీధుల్లో, కాల్వల్లో వుండే మురికిపై దోమలు వాలి ఆహార పదార్థాలపై వాలడంతో ప్రజలు రోగాలకు గురవుతారన్నారు. వెంటనే దోమల నివారణకు కృషి చేయాలని కమిషనర్‌తో అన్నారు. నగరంలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.

గ్రామాల అభివృధ్ధే టిడిపి ధ్యేయం

ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 22: గ్రామాల అభివృద్ధే టిడిపి ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెంకటగిరి గ్రామంలో రూ.70 లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని, కొన్ని సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక్క టిడిపికే దక్కుతుందన్నారు. నా తండ్రి మాజీ మంత్రి బివి.మోహన్ రెడ్డి ఆశయ సాధనతో ముందుకు పోతున్నారన్నారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ జరిగిందని, రైతులకు రెయిన్‌గన్ల ద్వార పొలాలకు నీరు అందుస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానన్నారు.

Pages