S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విస్‌ చాలెంజ్‌ కేసు విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్: అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా విద్య, ఉపాధి రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అడ్వకేట్‌ జనరల్ శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టులో స్విస్‌ చాలెంజ్‌ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా అమరావతిలో పనులకు కాంట్రాక్టు సంస్థ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు తీసుకున్న సంస్థ మాదిరిగా మరేదైనా సంస్థ వస్తే ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు.

కర్నాటకకు మరోసారి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఢిల్లీ : మంగళవారం నుంచి 27వ తేదీ వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్నాటకకు ఆదేశించింది. గతంలో ఒకసారి 15 వేలు, 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే న్యాయస్థానం తన తీర్పును కొనసాగిస్తూ నీటి పరిమాణాన్ని కాస్త తగ్గించింది.

కాశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

ఢిల్లీ: కాశ్మీర్‌లో 74 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూకు తెరపడింది. శ్రీనగర్‌లోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మినహా కాశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూను మంగళవారం ఎత్తివేశారు. హిజ్‌బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భారత సైన్యం మట్టుబెట్టిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ప్ర‌స్తుతం కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దీంతో క‌ర్ఫ్యూ ఆంక్షలను సడలించిన‌ట్లు అధికారులు తెలిపారు. రెండు నెలలకు పైగా కొన‌సాగుతున్న‌ కర్ఫ్యూను ఎత్తివేయ‌డంతో సామాన్య ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకున్నారు.

రేపే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ : హాజరు కానున్న ఇద్దరు చంద్రులు

ఢిల్లీ : తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు ఢిల్లీలో బుధవారం జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతున్నారు. జలవివాదాల పరిష్కారం దిశగా కేంద్రం చొరవ తీసుకునే వీలుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది.

కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయండి

దిల్లీ: కావేరి పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రేపటి నుంచి ఈనెల 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది.

ఆసియా బీచ్‌ గేమ్స్‌కు 208మంది ఎంపిక

దిల్లీ: 5వ ఆసియా బీచ్‌ గేమ్స్‌కు వెళ్లే భారత బృందాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) ప్రకటించింది. 2014లో 117మంది అథ్లెట్లను పంపిన ఐఓఏ ఈసారి అత్యధికంగా 208మంది క్రీడాకారులను పంపనున్నట్లు తెలిపింది. స్విమ్మింగ్‌, కబడ్డీ, హ్యాండ్‌ బాల్‌తో పాటు మొత్తం 13 విభాగాల్లో మన క్రీడాకారులు పాల్గొననున్నారు. సెప్టెంబరు 24న వియత్నాంలోని డనాగ్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీకి అఫ్గాన్‌ అధ్యక్షుడి ఫోన్‌

దిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని ఉరీలో సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు అఫ్గానిస్థాన్‌ సహాయ సహాకారాలను అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఫోన్‌లో తెలియజేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ఆయన నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: వరుసగా నాలుగు రోజులు లాభాల్లో కొనసాగిన సూచీలు మంగళవారం నష్టాల బాటపట్టాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 111 పాయింట్లు నష్టపోయి 28523 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 32.50 పాయింట్లు నష్టపోయి 8776 పాయింట్లవద్ద ముగిసింది.

టెండర్లను తెరాస నేతలు పంచుకుంటున్నారు.. : నాగం

హైదరాబాద్‌: ప్రాజెక్టుల టెండర్లను తెరాస నేతలు పంచుకుంటున్నారని, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాల్లో దోపిడీ జరుగుతోందని భాజపా నేత నాగం జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని, తెరాస పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని అన్నారు. ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో మంత్రి ప్రమేయం ఉందని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని లేదంటే తాము హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.

ఉరీ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులు

శ్రీనగర్‌: పాక్‌ సైన్యం జమ్ము కాశ్మీర్‌లో ఉరీ సెక్టార్‌లోని లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద మంగళవారం సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపింది. ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగిన రెండు రోజుల్లోనే పాక్‌ సైన్యం సరిహద్దులో కాల్పులకు తెగబడింది. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టింది. పాక్‌ నుంచి వచ్చిన జైష్‌-ఏ-మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారే ఈ ఘోరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పాక్‌కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్‌ భావిస్తున్న సమయంలో సరిహద్దులో పాక్‌ కాల్పులకు దిగింది.

Pages