S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో 30 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12 వరకు దసరా సెలవులుగా తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే నెల 13న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. వీటితోపాటు ఈ విద్యా సంవత్సరంలో ఇతర సెలవులు, విద్యా కార్యక్రమాలకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవోలకు ఇటీవల జారీ చేసింది. అన్ని తరగతుల వారికి వచ్చే నెల 27వ తేదీ నుంచి నవంబర్ 3లోగా సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 (ఎస్‌ఏ-1) పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. వార్షిక పరీక్షల స్థానంలో ఎస్‌ఏ-2 పరీక్షను వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించాలని సూచించింది.

యురిలో ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ

ఢిల్లీ: యురిలో ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరించడానికి త్వరలో యురికి వెళ్లనుంది. జమ్ము కశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, 20 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్కు సంబంధముందని ఆధారాలు లభించాయి. భద్రత దళాల కాల్పుల్లో హతమైన జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదుల నుంచి డీఎన్ఏ నమూనాలను ఎన్ఐఏ సేకరించనుంది.

ఢిల్లీలో పట్టపగలు మహిళ హత్య

ఢిల్లీ : దేశ రాజధానిలో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ మహిళను 34 ఏళ్ల సురేందర్ 22 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో ఉదయం చోటుచేసుకుంది. కరుణ (21) టీచర్‌గా పనిచేసేది. సురేందర్ ఆమెను వేధిస్తుండేవాడు. సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా కేసు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అతడు వేధిస్తున్న విషయమై కరుణ కుటుంబ సభ్యులు ఐదు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు.

శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం టూరిస్టు వీసాలు తీసుకున్న 56 మంది ప్రయాణికులను అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. వీరంతా కలర్ఫుల్ ట్రావెల్స్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు టూరిస్టు వీసాలు తీసుకున్నారు. అధికారులు ప్రయాణికులను ఎందుకు అడ్డుకున్నారో తెలియ రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణీకులు విమానాశ్రయంలో నిరసనకు దిగారు. విమానాశ్రయ అధికారులు ప్రయాణికులతో చర్చలు జరుపుతున్నారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్

ఢిల్లీ : అక్రమంగా నియామకాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కూడా ఈ కేసులో నోటీసులు ఇస్తామని ఏసీబీ చీఫ్ ఎంకే మీనాచెప్పారు. స్వాతిని ఏసీబీ అధికారులు 27 ప్రశ్నలు చేతికిచ్చి, వాటికి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన నవీన్ జైహింద్‌ భార్యే స్వాతి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో మహిళా కమిషన్‌ను నింపేస్తున్నారని ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ చేసిన ఫిర్యాదుతో ఏసీబీ స్పందించింది.

కోల్‌కత ఎయిర్‌పోర్టులో బాంబు బూచి

కోల్‌కత: కోల్‌కత నుంచి గౌహతికి వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకురాలి నుంచి ఫోన్ రావడంతో పోలీసు అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం 8 గంటలు దాటాక ఓ మహిళ నుంచి ఆ ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసి బాంబు స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు ప్రారంభించారు.

సిరిసిల్ల జిల్లా కోసం 48 గంటల బంద్

కరీంనగర్: సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి నేతృత్వంలో మంగళవారం ఉదయం నుంచి 48 గంటల బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జామునుంచే ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను అడ్డుకున్నారు. రోడ్లపై పాతటైర్లను దగ్ధం చేసి రాస్తారోకోలు ప్రారంభించారు. ఒక ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఓ పెట్రోలు బంకుపై దాడి చేసి అక్కడ అద్దాలను పగులగొట్టారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. నేత కార్మికులు విధులకు స్వస్తి పలికారు. జిల్లాను సాధించేవరకూ ఆందోళన విరమించేది లేదని సాధన సమితి నేతలు తెలిపారు.

అర‌స‌వ‌ల్లి ఆల‌య అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి

శ్రీకాకుళం : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రులు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్ చార్జ్ మంత్రి పరిటాల సునీత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తో పాటు కలెక్టర్ లక్ష్మీనృంహం స్వామి వారిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.

సీఐడీ విచారణకు హాజరైన భూమన

గుంటూరు: తుని విధ్వంసం కేసులో వైకాపా నేత భూమన కరుణాకర్‌ రెడ్డిని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అదనపు ఎస్పీ హరికృష్ణ విచారిస్తున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో తనను విచారించిన సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి పిలవటంతో మంగళవారం విచారణకు వచ్చినట్లు భూమన చెప్పారు. తనను అరెస్టు చేస్తే బయటకు వచ్చి కాపు రిజర్వేషన్ల కోసం పోరాడతానని మీడియాకు వెల్లడించారు. తుని విధ్వంసం కేసులో తనకు సంబంధం లేకపోయినా ముఖ్యమంత్రి కుట్రపన్ని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూమన ఆరోపించారు.

ఏపీలో రెండు ఆరోగ్య పథకాలను ప్రారంభించిన చంద్రబాబు

విజయవాడ: ఏపీలో ఆరోగ్యశాఖకు చెందిన రెండు పథకాలను ప్రారంభించారు. 35 ఏళ్లు నిండిన మహిళలకు హెల్త్‌ చెకప్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు బేబి కిట్స్‌ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. పలువురు బాలింతలకు చంద్రబాబు బేబి కిట్స్‌ అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌, డీజీపీ సాంబశివరావు, మంత్రులు చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, కామినేని శ్రీనివాస్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య పాల్గొన్నారు.

Pages