S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురాక్రమణలే పాక్ నైజం అందుకే మూడు యుద్ధాలు

జెనీవా, సెప్టెంబర్ 19: యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నైజాన్ని విశ్వ వేదికపై భారత్ ఎండగట్టింది. ఆక్రమిత కాశ్మీర్‌ను తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని కట్టిపెట్టాలని తెగేసి చెప్పింది. బలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి, అక్కడ ఉంటున్న హిందువులపై సాగిస్తున్న దౌష్ట్యాల గురించీ ఐరాస మానవ హక్కుల 33వ సమావేశంలో భారత్ గట్టిగా ప్రస్తావించింది. భారత్‌లో ఏ ప్రాంతంలోనూ ఉగ్రవాదాన్ని, హింసాకాండను ప్రేరేపించకూడదని విస్పష్టంగా తెలియజేసింది. అలాగే తమ ఆంతరంగిక వ్యవహారాల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకూడదని ఉద్ఘాటించింది.

రేషన్ కార్డుకూ గతిలేదు!

విజయవాడ, సెప్టెంబర్ 19: కొద్దిరోజులుగా దేశంలో ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్ ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. అరకొర పతకాలు సాధించిన వారికి, తృటిలో పతకం కోల్పోయిన వారికీ క్రీడా సంఘాలు, ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను పారితోషికాలుగా అందజేశాయి. ఈనేపథ్యంలోనే పేదరికంతో తల్లడిల్లుతూ కనీసం రేషన్‌కార్డుకు కూడా నోచుకోని తొలి ఒలింపియన్ స్విమ్మర్ గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన షంషేర్ ఖాన్ దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. ‘యూత్ వెల్ఫేర్’ సంస్థ ఆధ్వర్యంలో షంషేర్ ఖాన్‌ను సోమవారం నగరానికి తీసుకొచ్చి ఆయన దుస్థితిని మీడియాకు వివరించారు.

రేణిగుంటలో విమాన రాకపోకలు పునరుద్ధరణ

రేణిగుంట, సెప్టెంబర్ 19: రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించారు. సోమవారం యథాతథంగా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు కొనసాగాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించి స్పైస్ జెట్ విమానాన్ని రన్‌వే పైకి తీసుకొచ్చి పాత విమానాశ్రయానికి తరలించిన తరువాత ఆదివారం రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండియర్ ఎయిర్‌లైన్స్ విమానం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. సోమవారం నుంచి విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతాయని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. స్పైస్ జెట్ విమానం ప్రమాద ఘటనపై చెన్నై, ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది.

మిషన్ భగీరథకు యూకో బ్యాంక్ 2వేల కోట్ల రుణం

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మిషన్ భగీరథ పథకం అమలుకు రెండువేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు యూకో బ్యాంక్ అంగీకరించింది. హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యుయస్ ప్రధాన కార్యాలయంలో ఇఎన్‌సి సురేందర్‌రెడ్డిని యూకో బ్యాంకు హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ వెంకటేశ్ కలిసి రెండువేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి అంగీకరించారు. మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లోలో మిషన్ భగీరథ పూర్తి చేయటానికి రెండువేల కోట్ల రూపాయల రుణం యూకో బ్యాంక్ ఇస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిసెంబర్ 2017 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీటిని అందిస్తామని చెప్పారు.

నూతన పెన్షన్ విధానంపై పార్టీలన్నీ స్పందించాలి

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: నూతన పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునర్ధురించాలని డిమాండ్ చేస్తూ ఏపి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ నేతలు ఇంద్రశేఖర్ మిశ్రా, అమర్‌జిత్ కౌర్,రజాక్, తెలంగాణ ఎస్‌టియు నేతలు సదానంద గౌడ్, పర్వతరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

పార్టీ ఫిరాయింపుల కేసు వచ్చేనెల 19కి వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనేలా స్పీకర్‌కి అదేశాలు ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టులో ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం నాడు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్ కురియన్,జస్టిస్ పాలీ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు పార్టీ ఫిరాయింపులపై వేరువేరుగా దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 19కి వాయిదా వేసింది.

లోతట్టు ప్రాంతాల ఎత్తు పెంచుతారా?

న్యూఢిల్లీ సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని లోతట్టు ప్రాంతాలను ఎత్తును పెంచుతున్నారా అని మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది అటువంటిది లేదని సమాధానం ఇస్తూ, తమ వాదనల సమయంలో వివరిస్తామని ట్రిబ్యునల్‌కు తెలిపారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి ఎన్జీటి వాయిదా వేసింది. నూతన రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులపై దాఖలైన పలు పిటిషన్లుపై ఎన్జీటి చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తోకూడిన త్రిసభ్య ట్రిబ్యునల్ సోమవారం నాడు విచారణ జరిపింది.

టిఎన్జీఓ భవనం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్ నాంపల్లిలోని టిఎన్జీవో భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం గేటు తాళాలు పగులగొట్టి పెట్రోల్ బాటిళ్లతో ఆంధ్రాకు కేటాయించిన నాలుగవ తరగతి ఉద్యోగులు భవనం పైకి ఎక్కి హల్‌చల్ సృష్టించారు. ఆంధ్రాకు కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు రప్పించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో నాంపల్లి టిఎన్జీవో భవనం వద్ద ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఉద్యోగులను భవనం పైనుంచి కిందకు రావాలని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

విద్యారంగ సమస్యలపై మహాధర్నా

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో హాస్టళ్లలో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ సోమవారం నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, హాస్టళ్లలో వౌలిక సదుపాయాలు కల్పించాలని , పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ , ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై ఇందిరాపార్కు నుండి సెక్రటేరియట్ వరకూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

తెలంగాణ విద్యా పాలనపై 23 నుండి జాతీయ సదస్సు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ విద్యా పరిపాలన ప్రణాళిక అనే అంశంపై నీపా ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి రెండు రోజుల పాటు జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభిస్తారు. సదస్సు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్‌డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిఇఆర్‌టి అధికారులు, డిఇఓలు, ఎంఇఓలు, టిఇఐ ప్రిన్సిపాల్స్ హాజరవుతారని అన్నారు.
ఎమ్సెట్ -3 సర్ట్ఫికేట్ల
పరిశీలనకు 7002 మంది
ఆంధ్రభూమి బ్యూరో

Pages