S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం జిల్లాపై జలగం ముద్ర

దమ్మపేట, సెప్టెంబర్ 19: జిల్లాల పునర్విభజన, రాజకీయ పునరేకీకరణ, అధికార వికేంద్రీకరణలో జలగం కుటుంబం పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. నాడు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాగా అవతరించినప్పుడు జలగం వెంగళరావు కీలకపాత్ర పోషించగా నేడు ఖమ్మం జిల్లా నుంచి నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు కీలకపాత్ర పోషించనున్నారు. 1953లో వరంగల్ జిల్లా నుంచి వేరు చేసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతం, సాగునీరు లేక అల్లాడుతున్న బీడు భూములతో అప్పుడు ఈ ప్రాంతం ఉంది.

తుమ్మల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే 17న ఎన్నిక

ఖమ్మం, సెప్టెంబర్ 19: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిపేందుకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించగా 6వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అవసరమైతే ఎన్నికను వచ్చే నెల 17వ తేదీన నిర్వహించాలని, అదే రోజు కౌంటింగ్ జరపాలని కూడా షెడ్యూల్‌లో ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నికకు టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తిరిగి ఖమ్మం జిల్లా నేతలకు అవకాశం ఇస్తారని భావించినా ఆ పార్టీ అధిష్టానం మాత్రం మొగ్గు చూపలేదు.

జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలి

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 19: జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు మండల జెఏసి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల జెఏసి నేతలు లకావత్ గిరిబాబు, గుగులోతు ధర్మా, రాందాస్‌లు మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నుంచ కొత్తగూడెంకు 22కిలోమీటర్ల దూరం ఉండగా, ఖమ్మం నగరానికి 63కిలోమీటర్ల దూరం ఉందన్నారు. మండల ప్రజలు అనాదిగా కొత్తగూడెం సంతకు వెళ్ళేందుకు, ధాన్యం, ఇతర పంటల విక్రయానికి కొత్తగూడెం అనువుగా ఉంటుందన్నారు.

ఫిలిం క్విజ్ 101

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

వర్తకసంఘం ఎన్నికల్లో కొప్పు ప్యానల్‌కే ప్రధాన పదవులు

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 19: వర్తకసంఘం ఎన్నికల్లో కొప్పు నరేష్ ప్యానల్ పూర్తి స్థాయిలో మెజార్టీని కనబరిచింది. వర్తక సంఘం అధ్యక్షుడిగా కొప్పు నరేష్ విజయం సాధించగా, కార్యదర్శిగా గుడవర్తి శ్రీనివాసరావు గెలుపొందారు. ప్రధాన శాఖలతో పాటు వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను కొప్పు ప్యానల్ గెలుచుకోవడంతో వారి మద్దతుదారుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. ఆదివారం జరిగిన వర్తక సంఘం ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఎన్నికల అధికారులు పూర్తి ఫలితాలను అర్ధరాత్రి 2 గంటల వరకు వెలువరించారు.

కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలిన గిరిజనులు

జూలూరుపాడు, సెప్టెంబర్ 19: జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలనే జెఎసి డిమాండ్‌లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మండలం నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కొమ్ముగూడెం, కరివారిగూడెం, పాపకొల్లు, మాచినేనిపేట, మాచినేనిపేటతండా, గుండెపుడి, పడమట నర్సాపురం, వినోభానగర్, జూలూరుపాడు, కాకర్ల, అనంతారం, బేతాళపాడు గ్రామ పంచాయతీ శివారు గ్రామాల నుంచి సైతం గిరిజనులు స్వచ్చందంగా వాహనాలతో బయలుదేరారు. దాదాపు 40కిపైగా వాహనాల్లో సుమారు వెయ్యిమందికి పైగా మహిళలతోసహా నిరసన తెలిపేందుకు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు.

ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలి

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 19: విద్యుత్ ఉద్యోగులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించటంతో పాటు రెవెన్యూను పెంచాలని విద్యుత్‌శాఖ వరంగల్ రేంజ్ సిఎండి వెంకటనారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ విశ్రాంతి భవనంలో ఉద్యోగులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్స్ ఫెయిల్యూర్ అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలా అయిన వాటి స్థానంలో క్వాలిటీ ఉన్న నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. పాత ట్రాన్స్‌ఫార్మర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని అదేశించారు.

పేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యం

ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 19: కార్పొరేటు స్థాయి విద్య, వైద్యం పేద వర్గాలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎన్‌ఎస్‌పి కాలనీలోని జిల్లా పరిషత్ స్కూల్, గాంధీనగర్, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వౌలిక సదుపాయాలు, మెరుగైన విద్యకు సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.

సమాధానాలు- 99

1. ఓకే బంగారం 2. ప్రియమైన నీకు
3. ఎస్ గోపాలరెడ్డి 4. ఎస్‌ఎస్ థమన్
5. జమున 6. ఆత్మగౌరవం
7. ఘంటసాల 8. చంద్రబోస్
9. కెకె సింథిల్‌కుమార్
10. సోనాలీ బింద్రే

సరైన సమాధానాలు రాసిన వారు

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

ఉగ్ర పాకిస్తాన్‌కు బద్ధి చెప్పాలి

కారేపల్లి, సెప్టెంబర్ 19: కాశ్మీర్‌లో పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యలకు తగిన బుద్ధి చెప్పాలని బిజెపి జిల్లా నాయకులు ఆదెర్ల ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు, కాశ్మీర్ ఘటనలో అమరవీరులైన వీర జవాన్లకు సోమవారం స్థానిక బిజెపి శాఖ శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ భారత్ ఎంత ఓపిక ప్రదర్శించినా పాక్ కవ్వింపు చర్యలు విడనాడటం లేదని, కాశ్మీర్ సైనిక శిబిరంపై దాడి ఘటనతో అది మరింత బహిర్గతమయిందని అన్నారు. ప్రజలంతా ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు తురక నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో
వీర జవాన్లకు
ఘన నివాళులు

Pages