S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్‌లో నకిలీ ఎడ్యుకేషనల్ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. జెఎన్‌టియు, ఆంధ్రా యూనివర్శిటీ, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ యూనివర్శిటీల పేరుతో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, డిప్లొమాకు సంబంధించి, ఇంటర్, ఎస్‌ఎస్‌సి మెమోలను తయారు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న వేణు దినకర్‌రెడ్డి, ఏ రామారావు, జియాఉల్ హసన్‌లతోపాటు బ్రోకర్లు సి సునీల్ రెడ్డి, దా సరి మనోజ్, రబ్బర్ స్టాంపులు తయారు చేసే మోహన్‌లాల్, రాఘవలను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవెగౌడ

భద్రాచలం, ఆగస్టు 28: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భారత మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ ఆదివారం దర్శించుకున్నా రు. హెలీకాప్టర్‌లో భద్రాచలం వచ్చిన వారు నేరుగా రామాలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆల య సంప్రదాయం ప్రకారం పరివట్టం కట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి గర్భగుడిలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామాలయం నిర్మించిన భక్తరామదాసు చరిత్రను దేవెగౌడ ఆసక్తిగా అర్చకులను అడిగి తెలుసుకున్నారు. సుదర్శనచక్రం విశిష్టతను తెలుసుకున్నారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి శేష వస్త్రాలతో సత్కరించారు.

కొత్త తరహాలో నిమజ్జనం

హైదరాబాద్, ఆగస్టు 28: మహానగరంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ సారి వినాయక నిమజ్జనం సరికొత్త తరహాలో జరగనుంది.

పాతబస్తీ విముఖత

హైదరాబాద్, ఆగస్టు 28: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరాను సక్రమంగా నిర్వహిస్తున్న జలమండలి నీటి బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన నీటి కనెక్షన్లను క్రమబద్దీకరించేందుకు జలమండలి విడిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 8.79 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఉన్న నీటి కనెక్షన్లలో అక్రమ నీటి కనెక్షన్లను క్రమబద్దీకరిచేందుకు జలమండలి గడువును సెప్టెంబర్ 30వరకు బిగించారు.

జెఎన్‌టియులో ఏబివిపి భిక్షాటన

కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 28: పాత మెస్ బకాయిలను రద్దు చేసి ప్రభుత్వం విడుదల చేసే మెస్ చార్జీలను రూ.650 నుండి రూ.3వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో జెఎన్‌టియులో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతకుంట సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రభుత్వం విడుదల చేసే రూ.650 మెస్ చార్జీలు చాలీచాలక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా కోర్సు పూర్తయిన సందర్భంగా హాస్టల్ బిల్లుమొత్తం చెల్లించక, ఇంట్లో ఉన్న బీదరికాన్ని ప్రశ్నించలేక తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారన్నారు.

పట్టి పీకుతున్నాయి..!

నల్లకుంట, ఆగస్టు 28:ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వీధి కుక్కలు నడిరోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు..వృద్ధులు తేడా లేకుండా వీధికుక్కల కాటుకు గురవుతున్నారు. జిహెచ్‌ఎంసి వెటర్నరీ శాఖ నిర్లక్ష్యం..వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వెరసి వీధి కుక్కల సమస్య ప్రజల పాలిట శాపంగా మారింది. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు..కాలనీలలో వీధి కుక్కుల ఆగడాలతో ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. మనుషలపై ఎగబడి మరీ కుక్కలు శరీరభాగాలను పట్టిపీకుతున్నాయి. చిన్నారులను సైతం వదలకుండా కాటు వేస్తున్నాయ. ఇటీవలే కొన్నిరోజుల క్రితం చిన్నారిని ఎత్తుకుని నడుస్తున్న ఓ వృద్ధురాలిపై ఎగబడి కాటేశాయ. చిన్నారి ముక్కు.

ప్రజారోగ్యానికి దేవుడే దిక్కు!

హైదరాబాద్, ఆగస్టు 28: నగరం పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బగా తయారైంది. రోడ్డెక్కితే ఎక్కడ ఏ గుంతలో పడుతామో తెలియదు. ఎక్కడి నుంచి కుక్క వచ్చి పిక్క పట్టుకుందో తెలీదు. దోమలు దడ పుట్టిస్తుంటాయి. ఇదీ మహానగరంలో ప్రజలెదురొకంటున్న నిత్యం సమస్యలు. గతంలో ఏడు సర్కిళ్ల నుంచి 24కు పెంచారు. 172 చదరపు కిలోమీటర్ల నుంచి 625 చ.గ. విస్తీర్ణానికి గ్రేటర్ రూపాంతరం చెందినా, ప్రజారోగ్య పరిరక్షణ ప్రశ్నార్థకంగానే తయారైంది. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ ప్రభావం కారణంగా ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు.

నిలిచిపోయిన బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సేవలు

మేడ్చల్, ఆగస్టు 28: మేడ్చల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా సేవలు నిలిచిపోయిన సంబంధిత అధికారులు నీమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. పట్టణంలోని గోదావరి జలాల సరఫరా నిమిత్తం పైపులైన్ ఏర్పాటు కోసం తవ్వకాలు చేపడుతుండటంతో తరచూ కేబుల్ తెగిపోయి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం పరిపాటిగా మారిందని ఇది సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు.

పండుగలను సామరస్యంగా జరుపుకోవాలి

చేవెళ్ల, ఆగస్టు 28: వినాయక నవరాత్రి ఉత్సవాలను, బక్రీద్ పండుగలను సామరస్యంగా జరుకోవాలని చేవెళ్ల డిఎస్పీ శృతకీర్తి అన్నారు. చేవెళ్ల పోలీసు స్టేషన్‌లో ఆదివారం చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో, ముస్లింలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. పండుగలను కలిసి మెలిసి ప్రశాంతంగా జర్పుకోవాలని తెలిపారు. వినాయక మండపాలకు, నిమజ్జనానికి ముందుగానే పోలీసు స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్‌ను ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు ఇవ్వాలని తెలిపారు.

ప్రజల ఆహ్లాదం కోసమే మినీట్యాంక్ బండ్

రాజేంద్రనగర్, ఆగస్టు 28: ప్రజల ఆహ్లాదం కోసమే చెరువులను సుందరీకరణ చేసి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పల్లెచెరువులో పేరుకుపోయిన గుఱ్రపుడెక్కను తొలగించడానికి పనులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణ చేస్తూ ప్రజల ఆహ్లాదానికి తోడ్పాటయ్యేలా కృషి చేస్తుందని వెల్లడించారు. పల్లె చెరువును సుందరీకరణ చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని, పార్కు, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Pages