S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగునీరిచ్చి ఎండిన పంటల్ని కాపాడండి

మైలవరం, ఆగస్టు 28: తక్షణమే సాగునీటిని అందించి ఎండిన పంటలను కాపాడాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతలు ఎండిన వరి పొలాలను పరిశీలించారు. వర్షాలు పడక, సాగునీరు రాక వరి, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, పసుపు వంటి పంటలన్నీ ఎండిపోతున్నాయని ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఎండిన పంటలు చూసుకుని కన్నీరుమున్నీరవుతున్నారని ఇటువంటి దశలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి సాగునీటిని ఇప్పించి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.

యువతకు స్ఫూర్తి వేములకొండ సేవలు

జి.కొండూరు, ఆగస్టు 28: జి.కొండూరుకు చెందిన క్వారీ కాంట్రాక్టర్ వేములకొండ సాంబశివరావు సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు అన్నారు. జి.కొండూరులో ఆదివారం జరిగిన సంతాప కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాంబశివరావు మద్దతున్న నాయకులు విజయం సాధించేవారన్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకున్నా, తెరవెనుక ఉండి రాజకీయంగా మండలాన్ని శాసించేవారన్నారు. అలానే చాలాచోట్ల స్థలాలు వితరణగా ఇచ్చారని, ప్రజాప్రయోజనాలకు ఆర్థిక సాయం చేశారన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

బ్రాహ్మణ సంఘటన జిల్లా కన్వీనర్‌గా సుబ్రహ్మణ్యం

మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 28: రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా కన్వీనర్‌గా మెపర్తి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. స్థానిక 9వ వార్డులో ఆదివారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్‌గా నియమితులైన సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా తనవంతుగా కృషి చేస్తానన్నారు. త్వరలో బ్రాహ్మణుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

శ్యాంకిషోర్‌కు విద్యాభూషణ్ అవార్డు ప్రదానం

అవనిగడ్డ, ఆగస్టు 28: శ్రీరామా వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తోట శ్యాంకిషోర్ నాయుడుకు విశాఖపట్నంలోని ఎపిజె అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. విశాఖపట్నంలోని మదర్ థెరిస్సా ఫౌండేషన్ వారు కూడా శ్యాంకిషోర్‌కు ‘ఆణిముత్యం’ పేరిట జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఈమేరకు విజయవాడ అలంకార్ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు కె కృష్ణమూర్తి, రామకృష్ణ అవార్డులను శ్యాంకిషోర్ నాయుడుకు అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

జి.కొండూరు, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జి.కొండూరుకు చెందిన మహిళా వ్యవసాయ కూలీలు ఆటోలో పనులకు బయలుదేరారు. విద్యానగరం శివార్లలోని పొలంలో వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్తున్నారు. వీరు ఎక్కిన ఆటో జి.కొండూరు శివార్లలోని మల్లేశ్వరరావు హోటల్ సమీపంలో విజయవాడ - చత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై ఎదురుగా ఆపి ఉన్న ఆటోను తప్పించబోయి దాన్ని ఢీకొని బోల్తాపడింది. ఆటో వేగంగా ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్రగాయలయ్యాయి. వీరిలో జి.కొండూరుకు చెందిన బంధం భారతి(55), జి వెంకటనర్సమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగ్గానే అప్రమత్తమైన

రోడ్లు జలమయం

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 27: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారటంతో శనివారం మధ్యాహ్నం నుండే నగరంలో కురిసిన భారీవర్షానికి పాతబస్తీలోని వివిధ ప్రాంతాలు జలమయంగా మారాయి. శనివారం ఉదయం తీవ్రమైన ఎండ ఉండి మధ్యాహ్నం మూడున్నర సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో నగరంలో వివిధ ప్రాంతాలు చిత్తడి చిత్తడి మారిపోయాయి. దీనికితోడు ఎవరూ ఊహించిన విధంగా వర్షం పడటంతో స్కూల్స్, కళాశాలలు, కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు ఈవర్షంలో తడిసి ముద్దాయ్యారు. దీనికితోడు నగరంలోని వివిధ ప్రధాన రోడ్లు అన్నీ చెరువులను తలపించే విధంగా మారాయి.

బిజెపి ప్రభుత్వ అండతోనే దళితులపై దాడులు

విజయవాడ, ఆగస్టు 27: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశవ్యాపితంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని వివిధ సంఘాల దళిత నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అండతో మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులు పెట్రేగిపోతున్నాయని, దళితులంతా సంఘటితమై వాటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపెడా ఛైర్మన్ జయతిలక్ భేటీ

విజయవాడ, ఆగస్టు 27: సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు విశాఖపట్నంలో జరిగే 20వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో-2016కు హాజరు కావాలంటూ ఎంపెడా ఛైర్మన్ ఎ.జయతిలక్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కల్సి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ఎంపెడా తోడ్పాటు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తున్నాం. అందులో అతి ముఖ్యమైన ఫిషరీస్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో 20 శాతం వృద్థిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోందన్నారు. అతి పెద్ద తీరప్రాంతం కలిగి జలవనరులు పుష్కలంగా ఉన్న ఏపిలో మత్స్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

బైపాస్ ఆపరేషన్‌లో పెర్ఫ్యూజినిస్టుల పాత్ర ముఖమైనది

పటమట, ఆగస్టు 27: గుండె, ఊపిరితిత్తుల ఆపరేషన్‌లో పెర్ఫ్యూజిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, అంతేకాక గుండె ఊపరితిత్తుల పనిని నిలుపుదల చేసి మనిషికి కృత్రిమ పరికరాల ద్వారా రక్తప్రసరణ, శ్వాస క్రియ కల్పించి ఆపరేషన్ అనంతరం గుండె, ఊపిరితిత్తుల పని చేసేలా చేయడంలో ఫెర్ఫ్యూజినిస్టులు కీలకమని రాష్ట్ర పారా మెడికల్ బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.వేణుగోపాల్ అన్నారు. శనివారం ఇక్కడ ఒక హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ పెర్ఫ్యూజినిస్టుల సంఘం ఆధ్వర్యంలో నూతన విధానాలు, ఆధునిక పరికరాలు, నూతన పద్ధతులపై ఏర్పాటు చేసిన శాస్ర్తియ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బిజెపి పటిష్టతకు కార్యకర్తలు పాటుపడాలి

పెనమలూరు, ఆగస్టు 27: భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు దేశభక్తిని నింపుకొని పార్టీ పటిష్టతకు పాటుపడాలని అందుకు శిక్షణ తరగతులు వేదిక కావాలని బిజెపి యువమోర్ఛా జాతీయ కార్యవర్గ సభ్యుడు పివిఎన్ మాధవ్ సూచించారు. పోరంకి పద్మావతి కల్యాణ మండపంలో శనివారం దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు సిద్ధాంతం, జాతీయవాదం, దేశభక్తి, ఆర్థిక విధానం గురించి పూర్తిస్థాయి అవగాహన కలిగించేందుకు, నాయకత్వ లక్షణాలను పెంపొందించటానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని మాధవ్ పేర్కొన్నారు.

Pages