S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకోవాలి

విజయవాడ (కల్చరల్), ఆగస్టు 27: దళితుల అభ్యున్నతికోసం అవిరళ కృషి చేసిన దార్శినికుడు అయిన అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకుని దళితులు ముందుకు సాగాలని కేంద్ర మాజీ మంత్రి ఎంపి జెడి శీలం అన్నారు. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్, ఎపి ఆధ్వర్యంలో మాదిగలు నేడు రేపు పుస్తకావిష్కరణ శనివారం సాయం త్రం గాంధీనగరంలోని ఒక హోటల్‌లో జరిగింది. ఈ పుస్తకంపై విశే్లషణ, చర్చ, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాదిగ మహిళలు, యువకులు, బాలల సాధికారత అంశంపై, దేశాభివృద్ధిలో మాదిగల స్థానం అంశంపై విశే్లషణ- చర్చ జరిగింది.

‘ఆస్క్‌మీ’ని ఆదుకోండి

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మీ మూసివేతపై స్పందించాలని బిజెపి ఎంపి సుబ్రమణ్యం స్వామి.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ (ఎమ్‌సిఎ)శాఖను కోరారు. దీనివల్ల 4,000 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని అందుకే జోక్యం చేసుకోవాలంటూ ఎమ్‌సిఎ కార్యదర్శి తపన్ రాయ్‌కి స్వామి ఓ లేఖ రాశారు. మలేషియాకు చెందిన ఆస్ట్రో సంస్థ తమకున్న 98.5 శాతం వాటాను ఆస్క్‌మీ నుంచి ఉపసంహరించుకుంటుండగా, దీనికి సంబంధించి ఆస్క్‌మీకి సాయం చేసి, వేలాది మందికి ఉపాధిని దూరం కాకుండా చూడాలని స్వామి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మి..

ఆనందం ‘డబుల్’

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాలం మారుతున్నకొద్దీ మనుషుల అవసరాలూ పెరుగుతున్నాయి. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో సమయమన్నది ఎంతో విలువైనదిమరి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తవ్వాలని ఇప్పుడు చాలామంది కోరుకుంటున్నారు. దీంతో తమ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగానే వివిధ పరిశ్రమలూ ముందుకెళ్తున్నాయి. టెక్నాలజీ సాయంతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ విషయంలో బహుళజాతి సంస్థల మధ్య నెలకొంటున్న పోటీ నూతన ఆవిష్కరణలకు ఊపిరిలూదుతుండగా, కస్టమర్లు సైతం డ్యూయల్ కమాడిటీలను ఇష్టపడుతున్నారు.

ఆర్థిక గణాంకాలు, ఆటో అమ్మకాలు కీలకం

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం యెల్లెన్ ద్రవ్యసమీక్ష సందర్భంగా మాట్లాడగా, అప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీంతో సోమవారం దీనిపై సూచీలు స్పందించే వీలుందని పేర్కొంటున్నారు. అలాగే ఆటోరంగ సంస్థల దేశీయ అమ్మకాలు కూడా మదుపరుల పెట్టుబడుల సరళిని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 1న (గురువారం) ఆగస్టు నెలకుగాను అమ్మకాల వివరాలు వెల్లడి కానున్నాయి.

కెసిపిలో రెండో ప్లాంట్

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 28: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల సమీపంలోని కెసిపి సిమెంట్స్ కర్మాగారంలో రెండో ప్లాంట్ నిర్మాణానికి ఆ సంస్థ జెఎండి వెలగపూడి ఇందిరాదత్తు ఆదివారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 1.86 మిలియన్ టన్నులని, దాన్ని రూ. 400 కోట్ల వ్యయంతో రెట్టింపు చేస్తున్నామన్నారు. 2017 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్‌ను పూర్తిచేస్తామని, మరో రూ. 50 కోట్ల ఖర్చుతో రైల్వే లైన్‌నూ పూర్తిచేసి దూరప్రాంతాలకు సిమెంట్ రవాణా చేస్తామని చెప్పారు. కాగా, ముక్త్యాల రాజావారి వర్ధంతిని ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

చిత్రం.. భూమిపూజ చేస్తున్న సంస్థ జెఎండి

సైయెంట్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్, ఆగస్టు 28: ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఎనలిటిక్స్, నెట్‌వర్క్స్‌లో సైయెంట్ సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ వ్యవస్ధాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991లో సైయెంట్ ప్రారంభమైందన్నారు. 3 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించామని, 13 వేల మంది అసోసియేట్స్ పనిచేస్తున్నారని తెలిపారు.

కొనుగోళ్ల ఉత్సాహంలో విదేశీ మదుపరులు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ మదుపరులు ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 8,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. దేశ, విదేశీ అనుకూల సంకేతాలు, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం వంటివి భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను భారీగా రప్పిస్తున్నాయ. 2009 నుంచి గమనిస్తే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తొలిసారిగా కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడం కూడా కలిసొచ్చింది.

బ్యాంకర్లపై ఎస్‌ఎఫ్‌ఐఒ దృష్టి

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో విచారణను మరింత విస్తృతం చేస్తోంది వైట్-కాలర్ నేరాల దర్యాప్తు సంస్థ ఎస్‌ఎఫ్‌ఐఒ. ఇందులో భాగంగానే పలు బ్యాంకుల మాజీ అధిపతులను విచారిస్తోంది. ఇందులో ప్రైవేట్‌రంగ బ్యాంకులతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లున్నారు. విజయ్ మాల్యా నేతృత్వంలోని ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రుణాల మంజూరుపై బ్యాంకర్ల పాత్రపై ఎస్‌ఎఫ్‌ఐఒ ఆరా తీస్తోంది.

సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం

వాషింగ్టన్/ముంబయి, ఆగస్టు 28: సంస్కరణలతో వాణిజ్యం బలోపేతమవుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. భారత్‌తో విదేశాలకున్న ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయంది. అమెరికా వాణిజ్య మంత్రి పెన్ని రిట్జ్‌కర్ సోమవారం నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యిటించనున్న క్రమంలో ఆదివారం అమెరికా పైవిధంగా స్పందించింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)సహా ఇతర సంస్కరణలను ప్రశంసించింది. కాగా, 2015లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 109 బిలియన్ డాలర్లకు చేరువైందని తెలిపింది.

తెలంగాణ పారిశ్రామిక కార్మికుల సమ్మె నోటీసు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతున్నందుకు నిరసనగా వచ్చే నెల 2న సమ్మె నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు బి మారుతీ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలు అమ్మరాదని, కార్మిక చట్టాల సవరణలను నిలిపివేయాలని, కనీస వేతనం నెలకు రూ. 18 వేలు చెల్లించాలన్న తదితర డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Pages