S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు మార్గానికి తొలగిన ఆటంకాలు

కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 28: కొన్ని సంవత్సరాలుగా హైదర్‌నగర్ డివిజన్ సమతానగర్ నుండి మోర్ సూపర్‌మార్కెట్ సమీపంలోని జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సిన 60 అడుగుల రోడ్డు మార్గానికి ఆటంకాలు తొలగిపోయాయి. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ జానకిరామరాజు, అధికారులతో కలిసి రోడ్డు మార్గాన్ని పర్యవేక్షించారు. ప్రస్తుతం ప్రగతినగర్ మార్గం నుండి కొనసాగుతున్న వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే చొరవతో పలు మార్లు అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. గాంధీ మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సాహితీ జ్ఞానాన్ని వెలికి తీసేందుకే పోటీలు

వికారాబాద్, ఆగస్టు 28: విద్యార్థుల్లో దాగి ఉన్న సాహితీ జ్ఞానాన్ని వెలికి తీసేందుకు పోటీలు ఉపయోగపడతాయని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్యాట మల్లేశం అన్నారు. ఆదివారం పాఠశాలలో సాహితీ సమితి గంగవరం శాఖ ఆధ్వర్యంలో ఐదు నుండి పదో తరగతి విద్యార్థులకు రెండు స్థాయిలలో పద్య కంఠస్థం, దేశభక్తి గేయాలు, కళాశాల స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించారు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లేశం మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుండే దేశభక్తి భావాలు కలిగి ఉండాలని చెప్పారు.

జ్ఞాన యోగమే వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి

వికారాబాద్, ఆగస్టు 28: ఆధ్యాత్మిక చింతనలో జానయోగం, భక్తియోగం, కర్మయోగం, రాజయోగం వ్యక్తిత్వ వికాసంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాయని ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు, అఖిల భారత జాతీయ సత్యసాయి సేవా సంస్థల సమన్వయకర్త డాక్టర్ ఎన్.అంజనయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీసత్యసాయి జ్ఞాన కేంద్రం 14వ వార్షికోత్సవ సమావేశానిక ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీవాత్మ, పరమాత్మల సామరస్య ఫలితమే మోక్షప్రాప్తికి నిజమైన మార్గదర్శకాలని చెప్పారు. వేదములతో విజానం పుట్టిందని, వేదం లేనిదే ప్రపంచం లేదని పేర్కొన్నారు. ఖగోళ, నక్షత్ర, శాస్త్రాల అభ్యున్నతికి వేదమే మూలాధారమని స్పష్టం చేశారు.

తాండూరులో భయంకరం.. వాయు కాలుష్యం

తాండూరు, ఆగస్టు 28: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో దినదినాభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తాండూరు పట్టణ, పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం అంతే స్థాయిలో ఉద్ధృతమవుతూ భయంకర ముప్పుగా మారింది. ఆదివారం విలేఖరుల సమావేశంలో తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, పర్యవరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త రాజ్‌గోపాల్ పార్డా మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత దెబ్బతినటంతో తాండూరులో వాయు కాలుష్యం తీవ్రతరంగా మారుతుందని అన్నారు.

ఇంటి తాళాలు పగలగొట్టి సొత్తు అపహరణ

కెపిహెచ్‌బికాలనీ, ఆగస్టు 28: సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌ల పరిధిలలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో నాలుగు ఇళ్లల్లో దోపిడీ దొంగలు స్వైర విహారం చేసిన మరుసటి రోజు కెపిహెచ్‌బి స్టేషన్ పరిధిలోని నిజాంపేట బాలాజీనగర్‌లోని మెడోస్ విల్లాలో సుమారు రూ.15 లక్షల సొత్తు అపహరణకు గురైన సంఘటన మరవకముందే శనివారం అర్ధరాత్రి అదే ప్రాంతంలో మరోసారి రెండు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి సుమారు రూ.7 లక్షల రూపాయల సొత్తును అహరించుకొని పరారయ్యారు.

పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి

ఘట్‌కేసర్, ఆగష్టు 28: పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.రవిచంద్రన్, కల్లూరి జయచంద్ర డిమాండ్ చేశారు.

రెండు దశాబ్దాల తరువాత సొంత గూటికి నెహ్రూ?

పటమట, ఆగస్టు 28: రెండు దశాబ్దాల క్రితం టిడిపిని వీడిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ స్వంత గూటికి చేరుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో 5సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత నెహ్రూకే దక్కింది. 1995 టిడిపి నుండి బైటకొచ్చిన నెహ్రూ తదనంతరం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణాల నేపథ్యంలో ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలుర మృతి

పాతబస్తీ, ఆగస్టు 28: సూర్యరావుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చెందిన గూడపాటి నోయల్‌కుమార్ (17) బాలుడు రైతుబజారుకు సైకిల్‌పై బయలుదేరుతూ కృష్ణలంకకే చెందిన గోర్ల జగదీష్‌చంద్ర (13)ను తోడుగా తీసుకెళ్లాడు. దారిలో తమ సైకిల్ స్నేహితుని వద్ద ఉంచి అతని వద్ద ఉన్న మోటార్ బైక్‌ను తీసుకెళ్లారు. బందరురోడ్డు రంగా విగ్రహం దాటాకా భారత్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించి రాంగ్‌రూట్‌లో రైతుబజారు వైపు వస్తున్నారు.

టిడిపికి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీయే నుండి బయటకు రావాలి

విజయవాడ, ఆగస్టు 28: ఏపికి ప్రత్యేక హోదా రప్పించే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి, ఎన్టీయే కూటమి నుండి బయటకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. విభజన హామీల కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని చంద్రబాబుకు సూచించారు. తిరుపతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర పార్టీ తరపున స్వాగతించారు.

అమ్మకానికి వినాయక విగ్రహాలు సిద్ధం

పాతబస్తీ, ఆగస్టు 28: వినాయక చవితి ఉత్సవాలకు నగరవాసులు సిద్ధం అవుతున్నారు. దానికి తగినట్లుగా విగ్రహాలు రకరకాలుగా రంగు రంగుల్లో ఆకర్షణీయంగా తయారు చేసి అమ్మకానికి వ్యాపారులు సిద్ధం చేశారు. 2 అడుగుల నుండి 12 అడుగుల వరకు విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. పుష్కరాల వల్ల అంతరాయం కల్గకుండా సితార సెంటరు, బైపాస్ రోడ్డులోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో సమీపంలో విగ్రహాల తయారీ గుడారాలకు ఏర్పాటు చేశారు. రాజస్తాన్ నుండి వలస వచ్చిన ఆరు కుటుంబాలు ఈ విగ్రహాల తయారీతో జీవనం సాగిస్తుంటాయి. ఈ విగ్రహాలు రూ.2 వేల నుండి రూ.20 వేల వరకు ఉంటాయని, కొన్ని విగ్రహాలను హైదారబాద్ నుంచి తెప్పించినట్లుగా వారు తెలిపారు.

Pages