S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఓకె శరణార్థులకు ప్యాకేజీ?

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె) నుంచి తరలివచ్చి జమ్మూ-కాశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పిఓకెకి చెందిన వారితోపాటు పాకిస్తాన్‌లోని గిల్గిత్ ప్రాంత ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించబోతోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను హోం శాఖ త్వరలో కేంద్ర మంత్రివర్గానికి నివేదించి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతుందని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మోదీ వ్యాఖ్యలను ఖండించిన బలూచిస్తాన్ అసెంబ్లీ

ఇస్లామాబాద్, ఆగస్టు 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బలూచిస్తాన్ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతేకుండా ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వాన్ని కోరింది. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఎమ్మెల్యే ముహమ్మద్ ఖాన్ లెహ్రీ శనివారం ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అసెంబ్లీలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానంపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీతో పాటు పలువురు ఇతర శాసనసభ్యులు కూడా సంతకాలు చేశారు.

ఒబిసిల ‘క్రీమీ లేయర్’ను సడలించనున్న సర్కార్

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)కు క్రీమిలేయర్ ప్రాతిపదికకు సంవత్సరాదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. ఆరు లక్షల నుంచి రూ. ఎనిమిది లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒబిసిలకు కేటాయించిన అనేక ప్రభుత్వ ఉద్యోగాలు అభ్యర్థులు దొరకక ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయడానికి క్రీమీలేయర్ పరిధిని సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సాలీనా రూ. ఆరు లక్షల వరకు ఆదాయమున్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రూ.

పనిచేస్తే పురస్కారాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్టప్ ఇండియా/ స్టాండప్ ఇండియాలాంటి పథకాలను అమలు చేయడంలో అద్భుతంగా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. ఇందుకోసం సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయిదు ప్రాధాన్యతా పథకాలు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, స్టార్టప్ ఇండియా/స్టాండప్ ఇండియా, ఇ-నేషన్ వ్యవసాయ మార్కెట్ (జాతీయ ఇ-మండి)లను ఎంపిక చేసింది.

తెరపైకి జనగామ, గద్వాల

హైదరాబాద్, ఆగస్టు 28: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాపై వ్యక్తమవుతోన్న ప్రజాభిప్రాయం మేరకు జనగామ, గద్వాల జిల్లాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా విభజించడం పట్ల ప్రజలు ముఖ్యంగా సొంతపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచే వ్యక్తమవుతోన్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు సమాచారం. హన్మకొండ స్థానంలో జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై పెద్దఎత్తున వత్తిడి పెరగడంతో, జనగామ జిల్లా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

అభ్యంతరాల వెల్లువ

హైదరాబాద్, ఆగస్టు 28: కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రతిపాదిత జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో చేర్పులు, మార్పులను సూచిస్తూ పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో వినతులు అందుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తూ సెప్టెంబర్ 22లోగా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు, సూచనలు ఇవ్వొచ్చంటూ భూపరిపాలన శాఖ కోరింది. మరుసటి రోజు నుంచే అభ్యంతరాలు, సూచనలు మొదలయ్యాయి. గత ఆరు రోజుల్లోనే 7 వేల 608 అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వానికి అందాయి.

తెలంగాణకు సిఎన్‌బిసి అవార్డు

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ తాజాగా సిఎన్‌బిసి నుంచి మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు దక్కించుకుంది. ప్రతి ఏడాది సిఎన్‌బిసి టీవి నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్‌లో భాగంగా రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. జాతీయస్థాయిలో ప్రభుత్వాలకు, పరిశ్రమ, క్రీడా, సామాజిక, కళ, వినోద రంగాల్లో విజేతలకు అవార్డులను ఏటా సియన్‌బిసి ప్రదానం చేస్తోంది. తెలంగాణ చేపట్టిన వినూత్నమైన, పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకున్న సియన్‌బిసి అవార్డు ప్రకటించింది. ఈనెల 30న ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటి మంత్రి కె తారక రామారావు అవార్డును స్వీకరిస్తారు.

నాది జనపక్షం

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన పోరాటంలో ప్రజలతో కలిసి ఉద్యమం నడిపినట్టే, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిలో ప్రజల పక్షానే పనిచేస్తానని తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలోని తాజా పరిస్థితులపై ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఆందోళనలు చేస్తున్నారు?
నేను జీవితాంతం ప్రజలపక్షానే ఉంటాను. ప్రజావసరాలు గుర్తించి, సాధించేందుకు పాటుపడుతాను. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా, మంచి చేస్తే సమర్థిస్తాను. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తాం.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. నైరుతీ రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చురుకుగా ఉన్నాయని, వీటికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సహకరిస్తోందన్నారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.

సూపర్ పవర్!

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవిస్తే విద్యుత్ తిప్పలు తప్పవన్న ఉద్యమకాలంనాటి ప్రచారానికి భిన్నమైన వాతావరణం ఆవిష్కృతమవుతోంది. విద్యుత్తే ఇప్పుడు తెలంగాణకు అదనపు బలం కాబోతోంది. సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేసిన తెలంగాణలో విద్యుత్‌కు బెంగపడాల్సిన అవసరం లేదన్న ధీమా అటు సర్కారులోను, ఇటు అధికార యంత్రాంగంలోనూ కనిపిస్తోంది. నిజానికి ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతలకే 3300 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇక రాష్ట్రంలో సిద్ధమవుతోన్న అన్ని ఎత్తిపోతల పథకాలకు దాదాపు 7వేల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నది అంచనా.

Pages