S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమతోనే శాంతి

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాశ్మీర్ సమస్యకు ప్రేమ, ఐక్యతలే అసలు సిసలైన మంత్రాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాశ్మీర్‌లో అశాంతిని రెచ్చగొట్టడానికి అమాయకులైన చిన్నారులను ఎగదోస్తున్న వారు ఏదో ఒక రోజు వారికి జవాబు చెప్పక తప్పదని కూడా ఆయన అన్నారు. కాశ్మీర్‌లో యువత, జవానుల్లో ఎవరు మరణించినా అది మనకు, దేశానికి తీవ్రమైన నష్టమని నెలవారీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆకాశవాణి ద్వారా చేసిన ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు.

జయహో ఇస్రో

సూళ్లూరుపేట, ఆగస్టు 28: వినూత్న ప్రయోగాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ దేశాలకు మరోసారి మన శాస్తవ్రేత్తలు చాటి చూపించారు. రోదసి ప్రయోగాల పరీక్షల్లో మరోసారి ఇస్రో శాస్తవ్రేత్తలు తమ శక్తిసంపద ఏమిటో మరోసారి విశ్వానికి చూపించారు. వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. తక్కువ ఖర్చుతో అధిక బరువుగల భారీ ఉపగ్రహాలను రోదసి లోకి పంపేందుకు ఇస్రో చేపట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంచింగ్ వెహికల్ (ఎటీవి) ద్వారా స్క్రాంజెట్ రాకెట్ ఇంజన్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించారు.

నాకెందుకు భయం?

కదిరి/చిత్తూరు, ఆగస్టు 28: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఎవరికీ భయపడను. నాకు ప్రజలే హై కమాండ్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సిఎం పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రత్యేక హోదాపై పవన్ మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తాను హోదాపై మాట్లాడటానికి భయపడుతున్నానని పవన్ పేర్కొనడం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్, వైకాపా నాయకుల మాదిరిగా తాను ఎవరికీ భయపడనన్నారు.

సీమ రైతుకు ఉచిత కరెంటు

అనంతపురం/వి.కోట/రామకుప్పం, ఆగస్టు 28: రాయలసీమలో ఎండిపోతున్న పంటలను ఆదుకునేందుకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి రక్షక తడులు పూర్తయ్యేంతవరకూ రెయిన్‌గన్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు అవసరమయ్యే విద్యుత్‌ను నిరంతరం ఉచితంగా సరఫరా చేయాలని ఆయన అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదివారంనాడు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. అనంతపురం జిల్లా గుండువారిపల్లి, కోటపల్లి గ్రామాల్లోనూ, చిత్తూరు జిల్లా కంపసముద్రంలోనూ ఆయన ఎండిపోతున్న వేరుసెనగ పైర్లను చూసి ఆందోళన వ్యక్తం చేశారు.

సచివాలయానికి మరో 2 శాఖలు

గుంటూరు, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో రెండు ప్రభుత్వ శాఖలు తరలివచ్చాయి. జల వనరుల శాఖ, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఆదివారంనాడు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. జల వనరుల శాఖ కార్యాలయాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఆయన ఉదయం 8.52 గంటలకు నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జల వనరుల శాఖ అధికారులు, రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు మంత్రిని సత్కరించి అభినందనలు తెలిపారు.

ఖరీఫ్ ఎండుతోంది!

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్ర రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. జూలైలో కురిసి మురిపించిన వర్షాలు ఆగస్టులో మొహం చాటేయడంతో అనావృష్టి పరిస్ధితులు అలముకున్నాయి. దరిమిలా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, గుంటూరు మెట్ట ప్రాంతాల్లో వరుసగా రెండో ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. రుణమాఫీ మూడవ విడత నిధులు విడుదల చేయకపోవడంతో, రైతులకు బ్యాంకు రుణాలు లభించట్లేదు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అన్నదాతలు రుణాలు తెచ్చుకుని ఆర్ధిక కష్టాల్లో ఇరుక్కుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కేవలం 270 టిఎంసి నీరు లభ్యతగా ఉంది.

కుల సమస్యను రాజేసింది చంద్రబాబే

ఖమ్మం, ఆగస్టు 28: కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నెలాఖరువరకే గడువు ఇచ్చామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు సిఎం కుర్చీలో కూర్చోవటం కోసం కాపుజాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కుల సమస్యను తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు. ఈ నెలాఖరులోగా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే సెప్టెంబర్ 11న 13 జిల్లాల కాపు సంఘం నాయకులతో రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.

‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌కు ఇదేనా నివాళి?

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌ను ఎప్పుడో మరచిపోయన ప్రభుత్వాలకు ఆయన గురించి ఆలోచించే ఓపికగానీ, ఆయన చూపిన మార్గంలో నడవాలన్న ఆలోచనగానీ కనిపించడం లేదు. రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన బృందం వెళితే, కేవలం రెండంటే రెండు పతకాలు దక్కాయంటే మన దేశంలో క్రీడల పతనాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితిని ధ్యాన్ చంద్ ఎన్నడూ ఊహించలేదు. భవిష్యత్ తరాలు ఇలా విఫలమవుతాయని అనుకోలేదు. ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి, హాకీలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశనం చేసిన ఆ అసహాయ యోధుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

భారత రత్న ఎందుకివ్వరు?

* ధ్యాన్ చంద్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నా, ఇప్పటికీ ఆ దిశగా సర్కారు అడుగు వేయడం లేదు. ఈ అవార్డుకు క్రీడాకారులు అర్హులు కాదన్న వాదన చాలాకాలం కొనసాగింది. పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా భారత రత్న అవార్డుకు క్రీడాకారులు కూడా అర్హులేనని అప్పటి యుపిఎ సర్కారు ప్రకటించింది. తొలి అవకాశం ధ్యాన్ చంద్‌కు లభించాలని, అతనే ఈ అవార్డుకు అన్ని విధాల అర్హుడని ప్రతిపాదనలు వచ్చాయి. చాలా మంది పార్లమెంటు సభ్యులు కూడా ధ్యాన్ చంద్‌కు అనుకూలంగా గళం విప్పారు. కానీ, ప్రభుత్వం మాత్రం క్రికెటర్ సచిన్ తెండూల్కర్ వైపే మొగ్గు చూపింది.

దేశమంతా నాకు అండ!

* రియో ఒలింపిక్స్‌కు తాను ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంటే అండగా ఉందని రెజ్లర్ సాక్షి మాలిక్ వ్యాఖ్యానించింది. ఇంతటి ఆదరణను తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పింది. కోట్లాది మంది ప్రమానురాగాలు తనతో ఉన్నాయని, అవే ఆలంబనగా భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించేందుకు కృషి చేస్తానని చెప్పింది.
ఈ ఏడాదే పెళ్లి!

Pages