S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోమటిబండనుంచి హైదరాబాద్ చేరుకున్న మోదీ

హైదరాబాద్:మెదక్ జిల్లా కోమటిబండలో మిషన్ భగీరథ తొలిదశ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయనకు బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు. ఎల్‌బిస్టేడియంలో జరిగే బిజెపి సభకు ఆయన రోడ్డుమార్గంలో బయలుదేరారు.

తెలంగాణకు మోదీ ప్రేమకావాలి : కేసిఆర్

గజ్వేల్:తెలంగాణ లక్ష్యం సాధించడానికి కేంద్రం సహకరించాలని, ముఖ్యంగా మోదీ ప్రేమ కావాలని కేసిఆర్ అన్నారు. కోమటిబండలో నిర్వహించిన సభలో మాట్లాడిన కేసిఆర్ తన వాక్చాతుర్యంతో మోదీని అబ్బురపరిచారు. నీరు, ఉద్యోగాలు, నిధుల విషయంలో తెలంగాణకు సహకరించాలని కోరారు. కాగా తెలంగాణ లక్ష్యం సాధిస్తుందని మోదీ జోస్యం చెప్పారు. కేసిఆర్ మొదటినుంచి నీటి విషయంలో పట్టుదలగా ఉన్నారని, గుజరాత్ నీటి పథకాలపై ఆసక్తి చూపారని మోదీ గుర్తు చేశారు.

అభివృథ్ధి పథంలో తెలంగాణ : మోదీ

గజ్వేల్:దేశంలో అతి చిన్నవయస్సున్న రాష్ట్రం తెలంగాణ అని, ఇక్కడకు రావడం తనకు ఎంతో సంతోషకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథ పథకం తొలి దశను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఇక్కడకు రావడం సంతోషకరమని అన్నారు. ఆ తరువాత ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. తెలంగాణలో మంచి పథకాలు ప్రారంభించారని అభినందించారు. రాష్ట్ర, కేంద్రం సమాఖ్య ప్రాతిపదికన కలసి పనిచేస్తాయని, సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అవినీతి లేని మోదీ ప్రభుత్వం :కేసీఆర్

గజ్వేల్:ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని లిఖించిందని, గత రెండేళ్ల ఎన్‌డిఎ పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అవినీతి కన్పించలేదని ఆయన అన్నారు. తెలంగాణ పోరాటానికి గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు మోదీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కొత్తరాష్ట్రానికి కేంద్రం అన్నివిధాలా సహకరించాలని కోరారు. అడిగిన వెంటనే తెలంగాణకు మోదీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.

తెలంగాణకు 17వేల కోట్ల పథకాలు: దత్తాత్రేయ

గజ్వేల్:తెలంగాణలో 17వేల కోట్ల రూపాయలతో పలు పథకాలు ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఏఏ పథకాలు చేపట్టారో వివరించారు. తెలంగాణను కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీఇచ్చారు.

మిషన్ భగీరథకు మోదీ శ్రీకారం

మెదక్:ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ తొలి దశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గజ్వేల్ మండలం కోమటిబండలో దీనికి సంబంధించిన నీటిట్యాంకును ఆయన ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఈ పథకంలో తొలిదశగా 234 గ్రామాలకు నీరందుతుంది. రామగుండం ఎన్‌టిపిసి ధర్మల్ విద్యుత్‌కేంద్రం, ఎరువులకర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్ రైల్వేలైన్, మిషన్ కాకతీయ పైలాన్, వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, జైపూర్‌లోని ధర్మల్ విద్యుత్‌కేంద్రాలకు ఈ సందర్భంగా మోదీ శిలాఫలకాలు ఆవిష్కరించారు.

హైదరాబాద్ చేరుకున్న మోదీ

హైదరాబాద్:ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నవెంటనే గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసిఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోదీ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంవద్ద బిజెపి శ్రేణులతో కోలాహలంగా ఉంది. కాగా బేగంపేటనుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ, కేసిఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కోమటిబండ చేరుకుని మిషన్ భగీరథకు శ్రీకారం చుడతారు.

పంజాబ్ ఆర్‌ఎస్‌ఎస్ నేతపై కాల్పులు

జలంధర్:పంజాబ్‌లోని ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, సహ్‌సంఘ్‌చాలక్ రిటైర్డ్ బ్రిగేడియర్ జగదీష్ గగ్నాజీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. జలంధర్‌లోని రద్దీగా ఉండే ఓ చౌక్ వద్ద ఆయన వెడుతూండగా మోటార్‌బైక్‌వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.

ఎంపీలకు టిడిపి విప్

న్యూఢిల్లి:లోక్‌సభలో జిఎస్‌టి బిల్లు ప్రవేశపెట్టనున్నందున ముందు జాగ్రత్త చర్యగా తెలుగుదేశం పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. 9,10,11 తేదీల్లో తప్పనిసరిగా లోక్‌సభ సమావేశాలకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో జిఎస్‌టి బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ ఇటీవల రాజ్యసభలో ఆ బిల్లుకు కొన్ని సవరణలతో ఆమోదం లభించినందున మరోసారి లోక్‌సభకు బిల్లు వచ్చింది. దీనిపై చర్చించి,అవసరమైతే ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా సభ్యులకు టిడిపి ఈ విప్ జారీ చేసింది.

గుజరాత్ సిఎంగా రూపానీ ప్రమాణస్వీకారం

గాంధీనగర్:గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాధస్వీకారం చేశారు. గవర్నర్ ఓపీకోహ్లి ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా ఉపముఖ్యమంత్రిగా నితిన్‌పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి, బిజెపి సీనియర్ నేత ఎల్.కె.అద్వాని తదితరులు పాల్గొన్నారు.

Pages