S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రన్న చేయూత ద్వారా లక్ష మంది ఎస్సీలకు శిక్షణ

విజయవాడ, మే 14: రాష్ట్రంలో లక్ష మంది యస్‌సి యువతకు చంద్రన్న చేయూత పథకంలో భాగంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆలోచన సరళి విధానాలను మెరుగుపరిచేలా అందరం సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర సాంఘిక సంయేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. చంద్రన్న చేయూత కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాల అదనపు జాయింట్ కలెక్టర్లు, సోషల్ వెల్ఫేర్ జిల్లా స్థాయి అధికారులకు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు, వెండర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై శనివారం నాడిక్కడ నిర్వహించిన కార్యశాలకు మంత్రి హాజరయ్యారు.

మహిళతో అనుచితంగా ప్రవర్తించిన కార్పొరేటర్‌ను బహిష్కరించాలి

విజయవాడ (కార్పొరేషన్), మే 13: ఉత్తర భారత దేశంలో ని 7కార్పొరేషన్ల అ ధ్యయన యాత్రకు వెళ్లిన విజయవాడ కా ర్పొరేటర్ల తిరుగు విమానయాన ప్రయాణంలో చోటుచేసుకొన్న ఘటనపై నగరంలోని పలు మహిళా సంఘాలు కనె్నర్ర చేశాయి. ఈఘటనలో విమర్శలను ఎదుర్కొంటున్న అధికార టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుపై తోటి ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు విచారణ చేసిన ఉదంతం విజయవాడ నగర రాజకీయాలను ఒక్కసారిగా కుదుపేశాయి.

మందిరాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం

వికారాబాద్, మే 14: బ్రాహ్మణలు ఎదుర్కొంటున్న సమస్యలు, మందిరాల్లో ధూప, దీప, నైవేద్యం గురించి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య కార్యదర్శి శ్రీహన్మంతాచారి అన్నారు. శనివారం స్థానిక శ్రీరామమందిరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వికారాబాద్ తాలూకా సమావేశం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమనిధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే సమాఖ్య సంఘటితంగా ఉన్నపుడే సాధ్యమవుతుందని చెప్పారు.

కొత్త భవనాల్లో ఇంకుడు గుంతలు ... 100 చ.మీ.లలో నిర్మించే భవనాల్లో తప్పనిసరి

హైదరాబాద్, మే 14: వృథాగా పోయే వాననీటిని ఒడిసిపట్టుకునేందుకు నడుం బిగించింది మహానగర పాలక సంస్థ. ఇకపై ప్రతి వర్షాకాలానికి కాస్త ముందుగానే ఈ వాన నీటిని సంరక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు గాను కనిష్ఠంగా వంద చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమయ్యే భవనాల్లో ఈ ఇంకుడు గుంతలను తప్పనిసరి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలని జిహెచ్‌ఎంసి యోచిస్తోంది. అంతేగాక, వాననీటి పరిరక్షణ పకడ్బందీగా జరిగేందుకు గాను ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు.

సర్వే పూర్తయిందా..! నివేదిక ఎక్కడ? పారదర్శకత ఎంత?

హైదరాబాద్, మే 14: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) పనులపై జిహెచ్‌ఎంసి సీక్రెట్‌గా అధ్యయనం చేస్తోన్నట్లు సమాచారం. కెబిఆర్ పార్కు చుట్టూ, మైండ్ స్పేస్ వంటి ప్రాంతాల్లో మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు, స్కైవేలు వంటివి నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించిన ప్రభుత్వం త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కెబిఆర్ పార్కు చుట్టు చేపట్టే పనుల కారణంగా సుమారు మూడు వేల చెట్లను తొలగించాల్సి ఉంది.

మెట్రో పనులు నిరంతర పరిశీలన

హైదరాబాద్, మే 14: మెట్రోరైలు పనులను క్షేత్ర స్థాయిలో నిరంతరంగా ఎప్పటికపుడు పరిశీలిస్తూ, పనులతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. సికిందరాబాద్ జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ -2లోని పలు ప్రాంతాల్లో ఆయన ఎల్ అండ్ టి హెచ్‌ఎంఆర్‌ఎల్ కొత్త ఎండి శివానంద్ నింబర్గితో కలిసి పనులను శనివారం తనిఖీ చేశారు.

16 నుంచి ఆటో బంద్‌కు సమ్మె నోటీసు

చార్మినార్,మే 14: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓలా, ఊబర్ సంస్ధల యాజమాన్యాలను వెంటనే అరెస్టు చేయాలని ఆటోడ్రైవర్స్ జేఏసి పిలుపునిచ్చింది. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఎర్పటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆటోడ్రైవర్స్ జేఏసి కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ ఈ నెల 13న రవాణా ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆటోడ్రైవర్ల జేఏసి మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో రేపు అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్ పాటించాలని ఆటోడ్రైవర్స్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు.

2019 నాటికి పైపులైన్ ద్వారా జంట నగరాలకు గ్యాస్: దత్తాత్రేయ

హైదరాబాద్, మే 14: జంట నగరాలకు 2019 సంవత్సరంలోగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందజేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన పెట్రోలియం ఉన్నతాధికారులతో సమావేశమై ఉజ్వల పథకం విస్తరణపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో కొత్తగా 4.73 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 3.5 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు.

గ్రేటర్‌లో గాలివాన బీభత్సం

హైదరాబాద్, మే 14: వారం రోజుల కిందటి వర్షబీభత్సం నుంచి నగరం ఇంకా తేరుకోకముందే శనివారం రాత్రి నగరమంతటా గాలివాన చిన్నపాటి విలయాన్ని సృష్టించింది. ఉదయం నుంచి ఎండ నిప్పులు కురిపించగా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వర్షానికి బలమైన ఈదురుగాలులు కూడా తోడవ్వటంతో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. అనేకచోట్ల విద్యుత్ శాఖ అధికారులే ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో వీధులన్నీ అంధకారంగా మారాయి.

రెండో పెళ్ళి! ( కథ)

...................................................................
-బులుసు సరోజినీదేవి

ప్రత్యేక బహుమతి రూ.2,000
పొందిన కథ

-బులుసు సరోజినీదేవి

Pages