S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలల కలలు

మా కలలన్నీ అలల్లోనే
మా వలలన్నీ తలల్లోనే
మా బ్రతుకంతా తీరంలోనే
దేశం దశాబ్దాల స్వాతంత్య్ర సంబరాల్లో
మున్గి తేలుతుంటే
మేం కర్రాకుల్లో చేపలెండేస్తుంటాం.

లోకం దీపావళి మతాబుల్లో వెలిగిపోతుంటే
ఎండిన చేపలు తడిశాయని మేం
గుడిసెల్లో నత్తలౌతాం.

చేపలు పడితే సంబరం
వానొచ్చి తడిస్తే విషాదం
ఆనంద విషాదాలు మా బతుకుల్లో
పడుగు పేకలైనాయి.
నాటి చేపల రాశులు ముత్తాతల అనుభవాలై
జేజెమ్మల జ్ఞాపకాల పొరల్నిండా
అనుభవాల స్మృతులైనాయి

-ఆవుల వెంకటరమణ 9494088110

కొసమెరుపు (కథ)

నల్లని మబ్బు ఆకాశాన్ని కమ్మేయ్యాలని చూస్తోంది. ఇద్దరు అమ్మాయిలు దానినే తదేకంగా చూస్తున్నారు. ఒకటే దృశ్యమైనా వారిద్దరి భావాలు మాత్రం విభిన్నంగా ఉండటమే విచిత్రం.
అత్యాచారానికి ప్రయత్నిస్తున్న అబ్బాయిలా మబ్బు, అందమైన, అమ్మాయిలా ఆకాశం మాధవికి కనిపిస్తే, అరాచికాలను అధిగమించే ధీరవనితలా మబ్బు, అందుకు కారకులైన అబ్బాయిలా ఆకాశం కనిపిస్తోంది ధైర్యకు.
‘మధూ! ఏమాలోచిస్తున్నావ్?’
‘ఏముంది ఆలోచించటానికి? ఈ సమాజమనే అడవిలో ఏ పులి ఎప్పుడు మీద పడుతుందో, ఎలా బలి అయిపోతామో అని అనుకుంటున్నాను.
‘అలా ఎందుకనుకుంటావ్? స్వారీ చేసే దుర్గలము మనమని ఎందుకు అనుకోవు?’

కొసమెరుపు (కథ)

నల్లని మబ్బు ఆకాశాన్ని కమ్మేయ్యాలని చూస్తోంది. ఇద్దరు అమ్మాయిలు దానినే తదేకంగా చూస్తున్నారు. ఒకటే దృశ్యమైనా వారిద్దరి భావాలు మాత్రం విభిన్నంగా ఉండటమే విచిత్రం.
అత్యాచారానికి ప్రయత్నిస్తున్న అబ్బాయిలా మబ్బు, అందమైన, అమ్మాయిలా ఆకాశం మాధవికి కనిపిస్తే, అరాచికాలను అధిగమించే ధీరవనితలా మబ్బు, అందుకు కారకులైన అబ్బాయిలా ఆకాశం కనిపిస్తోంది ధైర్యకు.
‘మధూ! ఏమాలోచిస్తున్నావ్?’
‘ఏముంది ఆలోచించటానికి? ఈ సమాజమనే అడవిలో ఏ పులి ఎప్పుడు మీద పడుతుందో, ఎలా బలి అయిపోతామో అని అనుకుంటున్నాను.
‘అలా ఎందుకనుకుంటావ్? స్వారీ చేసే దుర్గలము మనమని ఎందుకు అనుకోవు?’

ఆట (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

రష్యా నించి ఓ స్పోర్ట్స్ బృందం మా ఓడలో అమెరికాకి వస్తోంది. నేను మాత్రం ఆ ఓడలోని కొందరు హంగేరియన్స్‌లోని ఒకర్ని. డెక్‌లో ఎక్సర్‌సైజ్ చేసే రష్యన్ బృందంలోని నాడియాని చూశాను. బాలే డేన్సర్ అయిన ఆమె అందరికంటే అందగత్తె.
‘నువ్వు చూసేది నాడియానేనా? ఆమె రష్యన్’ రష్యన్ అన్న పదాన్ని వత్తి పలుకుతూ మరిస్కా చెప్పింది.
నేను జవాబు చెప్పలేదు. మరిస్కా వంద మీటర్ల పరుగు పందెంలో పోలెండ్, వెస్ట్ జర్మనీ, ఫ్రాన్స్‌లలో సెకండ్ వచ్చింది.
‘మనం జర్మనీలోనో, ఫ్రాన్స్‌లోనో లేదా ఇటలీలోనో రాజకీ పునరావాసాన్ని కోరాల్సింది’ చెప్పింది.
నేను తల అడ్డంగా ఊపి చెప్పాను.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

నిర్మల హృదయుడు (కథానిక)

‘‘డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా?’’ అడిగాడు రఘురాం.
‘‘వచ్చాయి. అదీ...’’ నసిగాడు.
‘‘్ఫర్వాలేదు చెప్పండి! విని తట్టుకోగల శక్తి నాకుంది’’ అన్నాడు రఘురాం.
‘‘మీ వెన్నుముక దెబ్బతింది. మీరు వైవాహిక జీవితానికి పనికిరారు’’ చెప్పాడు డాక్టర్.
రఘురాంకి మిన్ను విరిగి మీద పడినట్లు అయింది. అయినా తమాయించుకుని ‘‘బై డాక్టర్’’ అంటూ బయటికి వచ్చేసేడు.
‘అమ్మకు ఈ విషయం ఎలా చెప్పడం? ఇప్పటికే తనని పెళ్లి చేసుకోమని పదేపదే పోరుతోంది. ఆమె మాటను తను జవదాటుతూ వచ్చాడు. ఇప్పుడీ పరిస్థితిలో ఇక వివాహం ఎలా చేసుకోను? ఏ ఆడపిల్ల గొంతు కోయను’ అనుకున్నాడు.
అన్యమనస్కంగానే ఇంటికి చేరుకున్నాడు.

మానవత్వం ప్రదర్శించే రైలు కంపెనీ

ఇండియా, పాకిస్తాన్, చైనా లాంటి అభివృద్ధి చెందే దేశాల్లో రైలు పెట్టెలు కిక్కిరిసి ఉండటమే కాక, ఒకోసారి రైలు డబ్బాల మీద కూడా ప్రయాణీకులు ఎక్కి ప్రయాణించే దృశ్యాలు కనపడుతూంటాయి. బీద దేశాల్లో ప్రయాణీకులు ఎక్కువ. రైళ్లు తక్కువ. చైనాలో కొత్త సంవత్సరం సందర్భంగా కోట్ల మంది తమ స్వగ్రామాలకి ప్రయాణిస్తారు. ఆ వారమంతా రైళ్ల డబ్బాల మీద కూడా వారు ప్రయాణిస్తూంటారు. కాని కేవలం ఒకే విద్యార్థిని కోసం ప్రత్యేకంగా రైలు నడిపే దేశం ఒకటి ఉందని మీకు తెలుసా?

పద్మజ

భావిభారత పౌరులారా..( కథ)

అది మేము రోజూ కాలేజీకి వెళ్లేదారి. కాలేజీ బస్సు సరిగ్గా ఉదయం 8 గంటలకే బయలుదేరుతుంది. ఒక పెద్ద ఫ్లైవోవరు మీదుగా వెళ్లాలి. దాని కింది నుంచి రైళ్లు పరుగెడుతూ వుంటాయి. ఆ రైలు కట్ట పక్కనే ఒక గుడి వుంది. ఉదయం వేళ కాబట్టి గుడిగంటలు మైకులో బాగా వినిపిస్తూ వుంటాయి. ఈ ఫ్లైఓవరు మీద ట్రాఫిక్ రద్దీగా వుండటం వల్ల అన్ని మోటారు వాహనాలు మెల్లగానే వెళ్లాలి. అందువల్ల అన్ని శబ్దాలు బాగానే వినిపిస్తాయి. ఆ బ్రిడ్జి పక్కనే ఒక ఐదు అంతస్తుల అపార్టుమెంట్ వుంది. దానికి కొద్ది దూరంలో అంటే సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో ఆ బ్రిడ్జి దాటగానే డౌన్‌లో బస్సు ఆగుతుంది.

ప్రముఖ శాస్తవ్రేత్తలు జోసెఫ్ లిస్టర్

జోసెఫ్ లిస్టర్ 1827లో ఇంగ్లండ్‌లోని ఎసిక్స్‌లో జన్మించాడు. తండ్రి రాబర్ట్ లిస్టర్ ఒక నాటువైద్యుడు. తరతరాలుగా వస్తున్న నాటు వైద్యం చేస్తూ కాలం గడిపేశాడు. తండ్రి చేసే చికిత్సలను గమనిస్తూ లిస్టర్ ఎంతో ఆలోచించేవాడు. అపరిశుభ్రమైన వైద్యం చాలా బాధాకరంగా ఉండేది.
పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి లండన్ వెళ్లి లండన్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకుని 1852లో మెడిసిన్ పూర్తి చేశాడు.

-పి.వి.రమణకుమార్

లీలావతి (శాస్ర్తియ ఆవిష్కరణలు)

క్రీ.శ.1150లో ప్రఖ్యాత గణిత శాస్తవ్రేత్త మరియు వేద సంప్రదాయ ఖగోళశాస్తజ్ఞ్రుడు అయిన భాస్కరాచార్య తన పెద్ద గ్రంథం ‘సిద్ధాంత శిరోమణి’లో ప్రథమ భాగమైన లీలావతిని పూర్తి చేశాడు. ఈ గ్రంథం సంఖ్యాగణితము, బీజ గణితము, రేఖా గణితము, క్షేత్ర గణితములకు సంబంధించిన సమగ్ర విస్తృత వివరణతో కూడి వున్నది. ఇంకా సంఖ్యా సిద్ధాంతము మరియు ఇతర సంబంధిత విషయాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ‘లీలావతి’ ఒకే ప్రామాణికమైన పాఠ్య పుస్తకంగా 800 సంవత్సరాలు ఉపయోగించబడింది. సరళమైన, విద్యాపరమైన మరియు సాహితీపరమైన ఈ గొప్ప పుస్తకం అనేక భాషలలోనికి అనువాదం చేయబడింది.

-బి.మాన్‌సింగ్ నాయక్

ప్రశంస (స్ఫూర్తి)

స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చిన సారస్వత్ తల్లితో చెప్పాడు.
‘నాకు ఇది అర్థం కావడం లేదు. నీతా ఈ ఊరు వచ్చి నాలుగైదు వారాలే అయింది. అకస్మాత్తుగా మా క్లాస్‌లో అంతా నీతాని ఇష్టపడుతున్నారు’
‘ఎందుకని?’ తల్లి ప్రశ్నించింది.
‘నాకు అర్థం కావడం లేదని చెప్పాగా. మామూలు బట్టలే వేసుకుంటుంది. అందరికన్నా అందంగా ఉంటుందా అంటే అదీ కాదు’
వారి సంభాషణ విన్న పక్కింటావిడ చెప్పింది.
‘నాకు తెలుసు’
‘మీకెలా తెలుసు? నీతాలోని విశేషం ఏమిటి?’ సారస్వత్ తల్లి అడిగింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

Pages