S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్మికుల హక్కులను హరిస్తున్న చంద్రబాబు

విజయనగరం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, కార్మికుల సమస్యలపై ఆందోళన చేపడుతున్న నాయకులను ముఖ్యమంత్రి అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు.శనివారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.

అసంపూర్తి గృహాల పూర్తికిరూ.వెయ్యి కోట్లు

రామభద్రపురం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పక్కా గృహాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చొరవతో వెయ్యి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్లు గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. అలాగే కొత్తగా ఈ ఏడాది 4 లక్షల పక్కా ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రామభద్రపురం మండల పరిధిలోని నాయుడువలస గ్రామంలో శనివారం ఆమె ఇంకుడు గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో అసంపూర్తిగా నిలిచిన పక్కా గృహాలకు వెయ్యి కోట్లు మంజూరు చేయనున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో 17 కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాల జరిపామని ఆమె తెలిపారు.

విశాఖలో కాపు సంక్షేమభవన్ ప్రారంభం

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ కేంద్రంగా కాపు సంక్షేమ భవన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాపరిషత్ కార్యాలయం సమీపంలోనున్న అంకోసా భవన్‌లో శనివారం నిర్వహించిన కాపు మేధోమధన సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లోను కాపు సంక్షేమ భవన్‌లు ఉంటాయని, అయితే విశాఖలోనే తొలుత దీనిని నిర్మించేందుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయి నగరంగా విశాఖను తీర్చిదిద్దుతా

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ నగరానికి మరిన్ని సొబగులు అద్దడం ద్వారా అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భాగస్వామ్య ప్రాతిపదికన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)తో కలిసి పాండురంగాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని మెరుగులు విశాఖకు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. స్మార్ట్ సిటీగా పరుగులు తీస్తున్న విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రజల సహకారంతోనే స్వచ్ఛసిటీ

జగదాంబ, ఏప్రిల్ 30: స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని స్వచ్ఛ సిటీగా రూపొందడానికి ప్రజల సహకారం అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవ్ అన్నారు. శనివారం జివిఎంసి పాత కౌన్సిల్ సమవేశ మందిరంలో విశాఖ-కాకినాడ స్మార్ట్‌సిటీ అభివృద్ధి అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని ఇతర దేశాలకు మార్గదర్శకంగా తీసుకుంటూ మరింత అభివృద్ధిపరచాలన్నారు. మరో 15 ఏళ్లలో విశాఖకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోండి

విశాఖపట్నం(క్రైం), ఏప్రిల్ 30: ఆధునిక టెక్నాలజీతో నగరంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరు బాగుందని, రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం నగరానికి విచ్చేసిన ఆయన పోలీసు కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత సిపి ఛాంబర్ ఎదురుగా గల కమాండ్ కంట్రోల్ విభాగాన్ని ఆయన ప్రారంభిస్తూ స్వయంగా సిసి కెమెరాల పని తీరును పరిశీలించారు. పనె్నండు ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లను, నగరంలోని ప్రధాన జంక్షన్లలో ఏర్పాటు చేసిన ఆధునిక సిసి కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరిగే దృశ్యాలను చూసి ముఖ్యమంత్రి ముగ్ధుడయ్యారు.

కృత నిశ్చయం

విశాఖపట్నం, ఏప్రిల్ 30: భూగర్భ జలాలను వృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో కరవును శాశ్వతంగా తరిమేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎయు కాన్వొకేషన్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ 100 పంట కుంటలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతను తవ్వే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంకుడు గుంతలు, ఫాం పాండ్స్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

జనం మెచ్చిన రాణి

రాచరికం అంటే విశాలమైన భవంతుల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపడం కాదు.. సాదాసీదా ప్రజలకు సైతం అండగా నిలవడమే రాజకుటుంబం పరమావధి.. సొంత జాతికే కాదు, యావత్ మానవ జాతికి సేవలందించడంలోనే జన్మకు సార్థకత.. ఇలాంటి ఆలోచనలతో విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా ఉన్నందునే ఆ మహారాణి కొత్త చరిత్ర సృష్టించారు.

-SRM

ముంచుకొస్తున్న ముహూర్తం!

విజయవాడ, ఏప్రిల్ 30: పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు జూలై 15నాటికి పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం కృష్ణా పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆగస్టు 13 నుండి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు కేవలం 100 రోజులు మాత్రమే సమయం ఉన్నందున రాత్రి పగలు 24 గంటలు పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు నిధులు మంజూరైనప్పటికీ నేటివరకు టెండరు ప్రక్రియ, పనులు ప్రారంభించకపోవటం పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

నగరంలో స్వచ్చ మిషన్!

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: నగరంలో స్వచ్చ మిషన్‌ను పూర్తిస్థాయిలో అమలుకు 167కోట్లతో అంచనాలను సిద్ధం చేసినట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి రాజీవ్‌గౌబా శనివారం విశాఖపట్నం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ బాబు.ఎ తో కలిసి పాల్గొన్న విఎంసి కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో 96శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశామని, మిగిలిన వాటిని జూలై 15కల్లా పూర్తిచేస్తామని తెలిపారు.

Pages