S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు అవినీతిపై విచారణ జరపండి

జగ్గయ్యపేట, ఏప్రిల్ 30: చంద్రబాబు పాలన అవినీతిమయమని, ప్రలోభాలకు గురిచేసి అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని వైకాపా రాష్ట్ర నేత సామినేని ఉదయభాను ఆరోపించారు. ఎపి ప్రభుత్వంపై సమగ్ర నివేదికను ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సవివరంగా అందించి వచ్చారని, కేంద్రానికి నిజాయితీ ఉంటే పార్టీ ఫిరాయింపుల నుండి ప్రభుత్వ అవినీతి వరకూ సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన టిడిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండేళ్ల పాలన అవినీతిమయమని, ఆ సొమ్ముతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.

నగరంలో స్వచ్చ మిషన్!

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: నగరంలో స్వచ్చ మిషన్‌ను పూర్తిస్థాయిలో అమలుకు 167కోట్లతో అంచనాలను సిద్ధం చేసినట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి రాజీవ్‌గౌబా శనివారం విశాఖపట్నం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ బాబు.ఎ తో కలిసి పాల్గొన్న విఎంసి కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో 96శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశామని, మిగిలిన వాటిని జూలై 15కల్లా పూర్తిచేస్తామని తెలిపారు.

పాఠశాలల పనితీరుపై ప్రత్యేక దృష్టి:డిఇఒ

నూజివీడు, ఏప్రిల్ 30: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాలల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉపాధ్యాయుల బోధన తీరుపై కూడా దృష్టి సారిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు ముందస్తుగా పరీక్షలు కూడా నిర్వహిస్తామని, లోపాలుంటే ఆయా పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులకు సూచనలు చేస్తామని చెప్పారు.

అధికారుల తీరుపై చైర్‌పర్సన్ ఆగ్రహం

నందిగామ, ఏప్రిల్ 30: అధికారుల తీరుపై నగర పంచాయతీ చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం 2.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు వచ్చినప్పటికీ ఇన్‌చార్జి కమిషనర్, ఎఇ రామకృష్ణ సమయానికి రాకపోవడంతో అరగంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. ఎజెండాలోని అంశాలను ఆర్‌ఐ రమణ చదువుతుండగా వేసవి తాపం అధికంగా ఉండటంతో సభ్యులకు తక్షణం మంచినీరు అందించాలని చైర్‌పర్సన్ సిబ్బందికి సూచించారు. 25 నిమిషాలు దాటినా మంచినీరు అందించకపోవడంతో ఒక్కసారిగా చైర్‌పర్సన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘కౌన్సిల్ అంటే అధికారులకు లెక్కలేకుండా ఉంది..

రైతుల సంక్షేమమే లక్ష్యం

జి.కొండూరు, ఏప్రిల్ 30: రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని కెడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు అన్నారు. జి.కొండూరు పిఎసిఎస్‌లో పినపాక గ్రామానికి చెందిన దొప్పల మంగయ్య అనే రైతుకు రుణం కింద మంజూరు చేసిన ట్రాక్టర్‌ను శనివారం ఆయన అందజేశారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో రూ.99లక్షలు మాత్రమే పంట రుణాలు ఇవ్వగా ఇప్పుడు రూ.3కోట్ల వరకూ ఇచ్చినట్లు వెల్లడించారు. ఎల్‌టి రుణాలు మరో కోటి రూపాయల వరకూ మంజూరు చేశామన్నారు. పశువుల కొనుగోలుకు కూడా రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు.

చిత్తశుద్ధితో పనిచేయండి

మచిలీపట్నం, ఏప్రిల్ 30: చిత్తశుద్ధితో పనిచేసి జిల్లాకు పేరుప్రతిష్ఠలు తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులకు విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధిపై జరిగిన సమావేశంలో చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంటలు, నీటికుంటల తవ్వకాన్ని ప్రతిఒక్కరూ ఉద్యమంలా చేపట్టాలని కోరారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రతి ఇంటా ఇంకుడు గుంటలు తవ్వే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అగ్ని ప్రమాదంలో.. ఇళ్లు, బడ్డీకొట్లు దగ్ధం

కలిదిండి, ఏప్రిల్ 30: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, గ్యాస్ సిలెండర్ పేలిన కారణంగా నాలుగు పూరిళ్లు, మూడు బడ్డీకొట్లు దగ్ధమైన సంఘటన శనివారం మండల పరిధిలోని ఆరుతెగలపాడులో జరిగింది. గ్రామానికి చెందిన కందుల పాపారావు, చిలుకూరి కోటేశ్వరమ్మ, పేకేటి నాగమణి, లంకా చిన్నయ్య పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాలిపర్తి శోభనాద్రి, దేవదాసి నక్కబాపనయ్య, నీలపాల మహంకాళి బడ్డీకొట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.4లక్షల ఆస్తినష్టం జరిగింది. తొలుత పేకేటి నాగమణి ఇంట్లో నుంచి మంటలు వ్యాపించి గ్యాస్ సిలెండర్ పేలటంతో చుట్టుపక్కల ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.

రాష్ట్రంలో పట్టణీకరణతో తలసరి ఆదాయం పెంపునకు కృషి

మచిలీపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో పట్టణీకరణ, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి నారాయణ అన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించనున్న పురపాలక సంఘ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ అండ్ బి శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు కూడా హాజరై భూమిపూజ చేశారు.

పోలీసులమని బెదిరించి ..

మైలవరం, ఏప్రిల్ 30: సినీఫక్కీలో ఐదున్నర లక్షల రూపాయలు దోచుకొని పరారైన నిందితుల ఉదంతమిది. ప్రకాశం జిల్లా వెల్దుర్తి మండలం సింగిరిపాడు గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వరరావు అనే రైతు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన హనుమంతరావు అనే రైతు వద్ద పనిచేస్తూ సీజన్‌లో అతని మిరపకాయలను గుంటూరు తీసుకెళ్లి అమ్ముకొస్తుంటాడు. ఎప్పటిమాదిరిగానే హనుమంతరావుకు చెందిన మిర్చిని శనివారం గుంటూరు తీసుకెళ్లి విక్రయించాడు. ఒకచోట ఐదున్నర లక్షల రూపాయలు, మరోచోట లక్ష రూపాయల నగదు తీసుకుని ఒక సంచిలో పెట్టుకున్నాడు. గుంటూరు నుండి మణుగూరు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు.

లారీ, ట్రావెల్స్ బస్సు ఢీ

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 30: మండలంలోని వేగవరం సమీపంలో హైదరాబాద్ నుండి పెద్దాపురం వెడుతున్న గోల్డెన్ ట్రావెల్ బస్సు, కాకినాడ నుండి జగ్గయ్యపేట సిరామిక్ లోడుతో వెడుతున్న లారీ శనివారం తెల్లవారుజాము ఎరురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కు పోవడంతో స్థానికులు చాకచక్యంగా అతన్ని బయటకు తీయగలిగారు. గాయపడిన వారందరినీ స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Pages