S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డివిజన్ రైల్వే సలహా సంఘ సభ్యునిగా వరప్రసాద్

మొగల్తూరు, ఏప్రిల్ 30: విజయవాడ రైల్వే డివిజన్ సలహా సంఘ సభ్యునిగా మొగల్తూరు గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు చెల్లుబోయిన వెంకట శ్రీనివాస్‌వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రసాద్‌కు విజయవాడ రైల్వే డివిజన్ డిసిఎం ఎన్ సత్యనారాయణ శనివారం నియామక పత్రం అందజేశారు. వరప్రసాద్ నియామకం పట్ల నరసాపురం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ గున్నిశెట్టి శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి మునుకోటి వెంకటేశ్వరరావు, మండల బిజెపి అధ్యక్షుడు దాసరి ప్రసాదరావు, కార్యదర్శులు పులపర్తి రమేష్, మామిడిశెట్టి నరసింహమూర్తి తదితరులు అభినందించారు

డిప్యూటీ మేయర్‌కు సత్కారం

ఏలూరు, ఏప్రిల్ 30 : ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుడివాడ రామచంద్రకిషోర్‌ను మేయర్ షేక్ నూర్జహాన్ ఘనంగా సత్కరించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కిషోర్‌ను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి మేయరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వ్యక్తిగత పనుల వలన శుక్రవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనలేకపోయామని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదని చెప్పారు.

ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలి

భీమవరం, ఏప్రిల్ 30: దేశంలో ఆధ్యాత్మికత, హింస సమాంతరంగా ప్రయాణిస్తున్నాయని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచనలతో సమాజంలో ఆధ్యాత్మికత భావాలు పెంపొందించేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. భీమవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచమ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను శనివారం రోశయ్య ప్రారంభించారు. మే 5వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ముందుగా శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పాణింగపల్లి దుర్గా నరసింహ శ్రీనివాసాచార్యులు స్వామివారికి ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు చేశారు.

క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకోవాలి

భీమవరం, ఏప్రిల్ 30: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హితవు పలికారు. స్థానిక త్యాగరాజు భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ - 2016 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పైడికొండల మాట్లాడుతూ చదరంగం మేధాసంబంధమైన క్రీడని అన్నారు. పురాణకాలం నుండి ఈ క్రీడ ఉందన్నారు. మహారాజులు సైతం ఈ క్రీడను ప్రోత్సహించారన్నారు.

కడిగిన ముత్యం యర్రా

భీమవరం, ఏప్రిల్ 30: కడిగిన ముత్యం..మచ్చలేని వ్యక్తిత్వం.. రాజకీయాలకే ఆదర్శం మన యర్రా నారాయణస్వామి అని పలువురు వక్తలు కొనియాడారు. గ్రామసర్పంచ్ స్థాయి నుండి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా, మంత్రిగా ఉన్నతస్థాయికి చేరుకుని ప్రజలకు తనదైన శైలిలో సేవలందించి ఎందరి చేతో శభాష్ అనిపించుకున్నారన్నారు.

ప్రాజెక్టులకు రూ.7430 కోట్లు కావాలి

ఏలూరు, ఏప్రిల్ 30 : జిల్లాలో సేద్యపు నీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల అమలు కోసం 2016-17 ఆర్ధిక సంవత్సరానికి రూ.7430 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సేద్యపు నీటి ప్రాజెక్టుల పనుల ప్రగతితీరు, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.

ఘనంగా రామరాజు జన్మదిన వేడుకలు

భీమవరం, ఏప్రిల్ 30: టిటిడి మాజీ సభ్యులు, బిజెపి నాయకులు గోకరాజు రామరాజు జన్మదిన వేడుకలు శనివారం భీమవరంలో ఘనంగా జరిగాయి.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రామరాజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేకు కట్‌చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ,, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కాయిత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

‘సుప్రీమ్’హిట్ అవుతుంది

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 30: మే 5న విడుదల కానున్న సుప్రీమ్ చిత్రం సూపర్ హిట్ అవుతుందని చిత్ర హీరో సాయిధరమ్ తేజ అన్నారు. శనివారం సాయిధరమ్ తేజ, నిర్మాత దిల్‌రాజు జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. స్థానిక కరాటం వై జంక్షన్ వద్ద వారికి మెగా ఫ్యామిలీ అభిమానులు మద్దాల ప్రసాద్, చింతల నాని, వలవల తాతాజి, అచ్యుత శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుండి పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావు గెస్ట్‌హౌస్‌కు చేరుకోగానే గురునాధరావు స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం అభిమానులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంది.

ఖనిలో ఆర్టీసీ చైర్మన్‌కు ఘన స్వాగతం

రామగుండం, ఏప్రిల్ 30: తెలంగాణ తొలి ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సోమారపు సత్యనారాయణకు శనివారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణుల నుండి ఘన స్వాఘతం లభించింది. రామగుండం బి ఫవర్ హౌస్ గడ్డ వద్ద సోమారపుకు ఘనంగా స్వాఘతాన్ని పలుకుతూ పార్టీ నేతలు పూల మాలలతో ముంచెత్తారు. అక్కడి నుండి వందలాది ద్విచక్ర వాహనాలు, కార్లతో టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఎన్టీపీసీ మీదుగా గోదావరిఖని ప్రధాన చౌరస్తా దాకా భారీ ర్యాలీగా తరలివచ్చారు. రామగుండం నుండి గోదావరిఖని దాకా సోమారపుకు గులాబి నేతలు బ్రహ్మరథం పట్టారు.

జాతీయ సంస్థల తరహాలో ‘వారధి’ శిక్షణ

కరీంనగర్, ఏప్రిల్ 30: జాతీయ స్థాయి శిక్షణా సంస్థల తరహాలో ‘వారధి’లో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంక్ ప్రొబేషనరీ, క్లర్క్ పరీక్షలు రాసే అభ్యర్థులకు వారధి ద్వారా నిర్వహించే ఉచిత శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరొందిన శిక్షణా సంస్థల నుండి స్టడీ మెటీరియల్‌ను వారధి ద్వారా అందజేస్తామని అన్నారు. వారధిలో శిక్షణ పొందిన యువత ఒక మంచి శిక్షణా సంస్థలో శిక్షణ పొందామనే తృప్తి కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Pages