S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరచేతిలో పుష్కర సమాచారం

విజయవాడ, ఏప్రిల్ 30: ఆగస్టు నెలలో నిర్వహించే కృష్ణా పుష్కరాలకు 100 రోజుల సమయం ఉందని కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందించేందుకు టెలిఫోన్ నెట్‌వర్క్ ప్రొవైడర్స్ కంపెనీల వెండర్లు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశమందిరంలో ట్రిబుల్ ఐటి అధికారుల సమక్షంలో మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్, సబ్ కలెక్టర్ జి సృజన, డిడిఓ అనంతకృష్ణ ఆధ్వర్యంలో వెండర్లతో సమావేశమయ్యారు.

పారదర్శకతతో రాజధాని రైతులకు ప్లాట్లు

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల కేటాయింపునకు పారదర్శకతతో కూడిన నియమ నిబంధనలు రూపొందించారు. అందుకనుగుణంగా చేపట్టే ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు రైతులు సహకరించాలని సిఆర్‌డిఎ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు దరఖాస్తు చేసుకోవచ్చునని, రైతులు తమ ఆప్షన్ల నమోదుకు 9.18ఎ లేదా 9.18బి దరఖాస్తులను వినియోగించుకొని కాంపిటెంట్ అథారిటీల సహకారంతో పూర్తి చేసే కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో నిర్వహించనున్నారు.

చోరీ కేసుల్లో నిందితురాలి అరెస్టు

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 30: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితురాలిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అమె వద్ద నుంచి సుమారు మూడు లక్షలకుపైగా విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామానికి చెందిన మూడావత్ రాణి (20) ఇంటర్ వరకు చదువుకుంది. గత ఏడాది ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని ప్రస్తుతం నిడమానూరులో నివాసముంటోంది. అయితే నేరబాట పట్టిన సదరు యువతి ఇళ్లల్లో వ్యక్తుల వద్దకు వచ్చి తాగేందుకు నీళ్లు కావాలని అడిగి వారిని ఏమార్చి లోనికి ప్రవేశించి చోరీలకు పాల్పడుతుంటుంది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, పురుషుల మధ్య స్లైడింగ్ డోర్‌లు

విజయవాడ, ఏప్రిల్ 30: తెలంగాణ తరహాలో ఎపిఎస్ ఆర్టీసీ కూడా సాధారణ బస్సులలో మహిళలకు కేటాయించబడిన రిజర్వుడ్ సీట్లు వైపు పురుషులెవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా స్లైడింగ్ డోర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో రాష్ట్రం మొత్తంపై 700 బస్సులలో వీటిని అమర్చుతున్నారు. ఒక్కో డోర్‌ను స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేసేందుకు 20 వేలు చొప్పున కోటి 40 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు. విజయవాడ సిటీలో 350 సిటీ బస్సులు ఉండగా శనివారం పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు 20 బస్సులను లాంఛనంగా ప్రారంభించారు.

చైనా సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం

విజయవాడ, ఏప్రిల్ 30: ఆర్థిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం అందిపుచ్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చైనాకు చెందిన సుయోజో ప్రావియన్స్‌తో ఒక అవగాహన ఒప్పందానికి రావడం జరిగిందని అందులో భాగంగా ఎవిల్ ఇంటర్నేషనల్ సంస్థతో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్య సంస్థలతో అవగాహన సమావేశానికి నిర్వహిస్తున్నామని కలెక్టర్ బాబు ఎ తెలిపారు.

‘డిజిటల్ ఎవిడెన్స్’తో నేరస్తులకు శిక్షలు వేయంచాలి

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 30: నేర నిరూపణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సాంకేతిక పరిఙ్ఞనంతో కూడిన సాక్ష్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తద్వారా నేరస్తులకు శిక్ష పడే శాతం పెరుగుతుందన్నారు. ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్ సహకారంతో రాష్ట్రంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నగరంలో నిర్వహించిన ఒకరోజు రాష్టస్థ్రాయి అవగాహన సదస్సును ఆయన శనివారం జ్యోతిప్రజ్వళన చేసి ప్రారంభించారు.

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి

విజయవాడ, ఏప్రిల్ 30: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్ది రోగులకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ వైద్యాధికారులను ఆదేశించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కాన్ఫరెన్సు హాలులో కమిటీ ఛైర్మన్, కలెక్టర్ బాబు ఎ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని వౌలిక వసతులను కల్పించి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దాలన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికార్ల తీరుపై కోర్టుకు..

గుడివాడ, ఏప్రిల్ 30: గత ఏడాదికాలంగా గుడివాడ పట్టణంలో ప్లాస్టిక్‌ను నిరోధించాలని, ఆక్రమణలను తొలగించాలని, అనుమతి లేని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్న భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు వైవి మురళీకృష్ణ ఎలాంటి స్పందనా రాకపోవడంతో స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి కె ప్రభాకరరావు ఎదుట హాజరైన మురళీకృష్ణ తన వాదనను వినిపించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, భూగర్భ జలాలను పరిరక్షించాలని, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

వేసవి పనులకు తగ్గట్టు గిట్టుబాటు కూలి ఇవ్వండి * ఉపాధి హామీ కూలీల రాస్తారోకో

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 30: ఉపాధి హామీ పనుల్లో తమకు చెల్లించే కూలి గిట్టుబాటు కావడం లేదని, రోజువారీ కూలి చెల్లించాలని చిల్లకల్లుకు చెందిన ఉపాధి హామీ కూలీలు పనులు మానేసి పలుగులు, పారలు పట్టుకొని శనివారం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమకు అప్పగించిన చెరువు తవ్వకాల పనుల్లో ఏమాత్రం కూలి గిట్టుబాటు కావడం లేదని, కొలతలు సైతం సక్రమంగా ఉండటం లేదని వారు ఆరోపించారు. మండు వేసవిలో తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదని, అధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకొని తగిన కూలి నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

మంచినీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు

నూజివీడు, ఏప్రిల్ 30: నూజివీడు పురపాలక సంఘం పరిధిలోని అన్ని ప్రాంతాలకు మంచినీరు నిత్యం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఛైర్‌పర్సన్ బసవ రేవతి తెలిపారు. శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలకు కనీసం గంట సేపు కుళాయిల ద్వారా నీరు సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రాంతాల వారీగా నీరు సరఫరా చేసే సమయాలను విడుదల చేశారు. బోర్ల ద్వారా వచ్చే నీటితో పాటు కృష్ణా జలాలను కూడా అందిస్తున్నామని చెప్పారు. పైపులైన్లు లేని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నట్లు తెలిపారు.

Pages