S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ దెబ్బతో నలుగురు మృతి

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 30: పెద్దపల్లి మండంలో శనివారం ఒకే రోజు ఇద్దరు వృద్ధులు వడదెబ్బతో మరణించారు. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కలబోయిన వీరమ్మ(70), కనగర్తి గ్రామానికి చెందిన ఎడెల్లి గట్టయ్య (60) అనే వృద్ధులు వడదెబ్బతో మరణించినట్టు గ్రామస్తులు తెలిపారు. వీరు ఇంట్లోనే ఉన్నప్పటికీ వడగాలులకు అస్వస్థతకు గరై మరణించినట్టు వారు పేర్కోన్నారు.
వెల్గటూరులో ఇద్దరు మేకల కాపరుల మృతి

మేత కరవై.. ‘కోత’కు తరులుతున్న..

జగిత్యాల టౌన్, ఏప్రిల్ 30: ప్రకృతి వైపరిత్యాలు,కరువు రక్కసి కరాళనృత్యం చేస్తుంటే పశువులకు కడుపునిండా తిండి పెట్టేందుకు పశుగ్రాసం లభించక, వరిగడ్డి ధరలు ఆకాశానికి అంటడంతో ‘మేత’ కరువై పశువులను ‘కోత’(కబేళాల)కు తరలిస్తున్నారు. మండుటెండలు, ప్రకృతి వైపరిత్యాలు, కరువు కాటుతో పశుగ్రాసం, నీటికొరత ఏర్పడింది. భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లోని నీరు పాతాళానికి చేరగా నీటిపై ఆధారపడివేసిన పంటలు ఎండిపోయి కొంత ప్రకృతి వైపరిత్యాలతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఇలాగే ప్రజలకు తాగునీరు కరువవుతుండగా, పశువులకు తాగు నీరు దొరకని పరిస్థితి నెలకొంది.

జెఎన్టీయుహెచ్ అభివృద్ధికి పూర్తి సహకారం

సెంటినరికాలనీ, ఏఫ్రిల్30: తెలంగాణ రాష్ఠ్రంలో ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందనీ రాష్ట్ర డిప్యూటీ సి ఎం, ఉన్నతావిద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం సెంటినరికాలనీలో మంథని జె ఎన్టీయుహెచ్ కళాశాలలో సమ్రయ-2016 వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి యాజమాన్యం 50 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులు సౌకర్యార్థం ఈ కళాశాలల వౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తాననీ అన్నారు. రూ.90 కోట్లతో ఈ కళాశాలలో వివిధ అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్యాకల్టీ సరిగ్గా ఉండాలనీ సూచించారు.

మంచినీళ్ళ కోసం... కాంగ్రెస్ మహిళల ధర్నా

కరీంనగర్‌టౌన్, ఎప్రిల్ 30: ప్రజలకు తాగు నీరు సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహిళా కాంగ్రెస్ జిల్లా అద్యక్షురాలు చేర్ల పద్మ ఆద్వర్యంలో శనివారం నగర శివారులోని చింతకుంట రహదారిపై స్థానిక మహిళలతో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద హాజరై మాట్లాడుతూ తాగు నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ప్లీనరీలు పెడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని పార్టీ ఫిరాయింపుల కోసం కరువుపై సీ ఎం కేసి ఆర్‌కు ఆలోచన లేదని విమర్శించారు.

కొనుగోలు కేంద్రంలో.. ముంచెత్తిన ధాన్యం

జగిత్యాల రూరల్, ఏప్రిల్ 30:జగిత్యాల సింగిల్ విండో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ధాన్యాగారంగా మారింది. రబీ సీజన్ వరి ధాన్యంను మార్కెటుకు తరలించిన రైతుల ధాన్యంతో నిండిపోయింది. ఈఏడాది పలు గ్రామాల్లో ఐకేపి కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల దాదాపు35 గ్రామ పంచాయితీ రైతులకు ఈకేంద్రమే విక్రయ కేంద్రమైంది. దీంతోనే రైతుల ధాన్యం కుప్పలు తెప్పలుగా విండో కొనుగోలు కేంద్రంకు రావడంతోనే మార్కెట్ అవరణ అంత వరి రాశులతో కన్పిస్తుంది. ఇప్పటికి 209 మంది రైతులకు చెందిన 7వేల 6వందల 74 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

నేడు ముఖ్యమంత్రి రాక

కరీంనగర్, ఏప్రిల్ 30: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి రాత్రి 8గంటల వరకు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని, రాత్రి ఇక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 6గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం 6:35గంటల వరకు చేరుకుని గోదావరి నదిలో సిఎం సతీసమేతంగా పవిత్ర స్నానాలాచరించి కాళేశ్వర-ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా సిద్దేశ్వరాలయం

వరంగల్, ఏప్రిల్ 30: వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ, ఇంకుడు గుంతల కార్యక్రమం పోటాపోటీగా జరుగుతున్నాయి. చెరువుల పూడికతీతలో ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, మరో వైపు పోలీసులు సైతం పాల్గొంటున్నారు. అదే విధంగా ఇంకుడుగుంతల కార్యక్రమం కూడా ఊపందుకుంది. ఎయేడు ఎండలు ఎంత దంచికొడుతున్నాయో, అదే స్థాయలో వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. అదే జరిగితే ఇంకుడు గుంతలు, మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ రావడమే కాకుండా ఇంకుడు గుంతలతో జలాశయాలు మెరుగుపడుతాయి. శనివారం వరంగల్ నగర కమిషనరేట్ అధ్వర్యంలో హన్మకొండలోని సిద్దేశ్వరగుండంలో మిషన్‌కాకతీయ పనులు జోరుగా కొనసాగాయి.

మంచినీటి ఎద్దడిపై మంత్రి చందూలాల్ సమీక్ష

ములుగుటౌన్, ఏప్రిల్ 30 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంచినీటి కొరతను తీర్చేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. ములుగులోని ఆర్‌డిఒ కార్యాలయంలో శనివారం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో నీటి కొరత ఉన్నట్లయితే అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను ప్రజలు నిర్మించుకునేలా చూడాలన్నారు. అవసరమైన చోట నీటివనరులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేయాలని అన్నారు.

మల్లూరుకు రండి!

మంగపేట, ఏప్రిల్ 30: మే 20 నుండి 26 వరకు జరగనున్న శ్రీహేమాచల (మల్లూరు) లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబందించిన గోడ పత్రికను రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ శనివారం ములుగులో ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు మల్లూరు రావాల్సిందిగా ఈ సందర్బంగా ఆలయ మేనేజర్ ఉడతనేని రామారావు మంత్రి చందులాల్‌ను ఆహ్వానించారు. మల్లూరు లక్ష్మీ నరసింహుని నాభిప్రసాదాన్ని ఈ సందర్బంగా మంత్రి చందులాల్‌కు ఆలయ అర్చకులు అందచేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఉడతనేని రామారావు, అర్చకులు ఏదునూతల ఈశ్వర చంద్ శర్మ, టిఆర్‌ఎస్ ములగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ పాల్గొన్నారు.

ఇంకుడు గుంతలపై విస్తృత ప్రచారం

వరంగల్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం నగరంలోని వడ్డెపల్లి పింగిళి డిగ్రీ కళాశాలలో ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే తరాలకు నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలని, అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో కూడా ఇంకుడు గుంతలు ఉండాలన్నారు.

Pages