S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకట్టుకున్న ఎడ్లబండి, ద్విచక్ర వాహనాల ర్యాలీ

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30: పట్టణంలో శనివారం జరిగే వివిధ అభివృద్ది పనులలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి స్వగృహం నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆలె వేంకటేశ్వరరెడ్డిలు బుల్లెట్ వాహనాలు నడుపుతూ ముందుండగా వారిని అనుసరిస్తూ పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహానాల ర్యాలీ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువు వరకు కొనసాగింది.

మున్సిపల్ సమావేశాన్ని కౌన్సిలర్లు బహిష్కరించడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ కన్నీటి పర్యంతం

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 30: మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశాన్ని సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు చైర్ పర్సన్ కావడానికి అప్పట్లో సహకరించిన బిజెపి, టిడిపి కౌన్సిలర్లు ప్రస్తుతం సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో మనస్థాపానికి గురైన మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ ఆమర్ సమావేశం హల్ నుండి వెళ్తూ కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ అధ్యక్షతన ప్రారంభమైన మున్సిపల్ సమావేశానికి కోరంకు అవసరమైన సంఖ్యలో కౌన్సిలర్లు హజరు కాలేదు.

ఖరీఫ్ నుంచి సాగునీరు

పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 30: కెఎల్‌ఐ ప్రాజెక్టులోని 2,3 లిప్టుల ద్వారా వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు సాగునీరు అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. శుక్రవారం రాత్రి జొన్నల బొగుడ లిప్టు వద్ద ప్రాజెక్టుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి అక్కడే మంత్రితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖాధికారులతో కలిసి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం టన్నల్, సర్జ్ఫిల్, పంపుహౌజ్, విద్యుత్ మోటార్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారులు పెంటారెడ్డితో మంత్రి మాట్లాడుతూ జూన్ వరకు రెండు మోటార్లు బిగించి ట్రయల్న్ నిర్వహించాలని ఆదేశించారు.

అభివృద్ధి పనులకు మంత్రుల భూమిపూజ

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30: నాగర్‌కర్నూల్ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడి, నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం భూమిపూజ చేశారు. పట్టణ సమీపంలో అతిపురాతనమైన 800 ఏళ్లనాటి కేసరి సముద్రం చెరవును మిషన్ కాకతీయ పథకం కింద రూ.8.36 కోట్లతో మినీ టాంక్‌బండ్‌గా తీర్చిదిద్దే పనులకు కేసరి సముద్రం చెరువు అలుగు వద్ద మంత్రులు భూమిపూజ చేసి శిలాఫలకంను ఆవిష్కరించారు.

ఘనంగా రామచంద్రజీ జయంతి

కొత్తూరు, ఏప్రిల్ 30: ధ్యాన గురువు రామచంద్రజీ (బాబుజీ) 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రామచంద్ర మిషన్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి 100దేశాల నుండి 30వేల ప్రతినిధులు హాజరయ్యారు. శనివారం కొత్తూరు మండలం చేగూరు గ్రామం సమీపంలోని రామచంద్ర మిషన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కనశాంతివనంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్యాన గురువు రామచంద్రాజీ (బాబుజీ) 117వ జయంతిని ఘనంగా నిర్వహించి, ఈసంధర్భంగా ఈనెల 29వ తేది నుండి మే 1 వరకు యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ యోగా శిక్షణ శిబిరాన్ని ప్రముఖ యోగా గురువు కమలేష్ డి పటేల్ ప్రారంభించారు.

‘వలసలు వచ్చే జిల్లాగా పాలమూరు అభివృద్ధి ఖాయం’

దేవరకద్ర, ఏప్రిల్ 30: పాలమూరు జిల్లాలోని ప్రజలు వలసలు వేళ్లేలా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి ఇక్కడికి వలసలు వచ్చే జిల్లాగా అభివృద్ధి చస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం దేవరకద్ర పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్‌లో ఏర్పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి నరసింహరెడ్డి ప్రమాణ స్వీకరోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూడేళ్లలో పూర్తి చేసి సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

అధికారులపై మంత్రి ఫైర్

అడ్డాకుల, ఏప్రిల్ 30: మిషన్ కాకతీయ పనులనుపూర్తిస్థాయిలో ముందుకు తీసుకువెళ్లడంతో జిల్లా అధికారులు విఫలమయ్యారని, శనివారం మండల నిజాపూర్‌లో ఇరిగేషన్ అధికారులపై మంత్రి మండిపడ్డారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో 95శాతం పనులు చేపట్టారని, పాలమూరులో కనీసం 50శాతం కూడా ప్రారంభించలేదని, ఈనెల 4వ తేదీన జిల్లాకు వస్తానని, అప్పటి వరకు మిషన్ కాకతీయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, లేకుంటే సంబంధి అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకోసం టి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారులద్వారా ప్రభుత్వానికి చెడ్డపెరు వస్తుందని ఆవేదన చెందారు.

మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు కసరత్తు

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30: తెలంగాణ మరో ప్రత్యామ్నయ రాజకీయ వేదికకు కసరత్తులు మొదలుపెట్టామని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ స్ఫూర్తియాత్ర శనివారం మహబూబ్‌నగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పంచవటి మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరువు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకికరణకై తెలంగాణలో గ్రామస్థాయి జెఏసిని ఉద్యమ జెఏసిగా మల్చడానికి తెలంగాణ స్పూర్తియాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు.

మరిన్ని నిధులతో పెద్ద చెరువు సమగ్రాభివృద్ధి

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30: మహబూబ్‌నగర్ పెద్ద చెరువు అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ పెద్ద చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరిక మేరకు గతంలో చెరువు అభివృద్ధికి రూ.6కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. చెరువును పర్యటక ప్రాంతంగా పట్టణ ప్రజలకు రిక్రియేషన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు.

సంగారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.31.78 కోట్లు

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 30: సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాల్టీ 2016-17 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. 31.78కోట్ల ఆదాయం, 31.61 కోట్ల ఖర్చులు (వ్యయం)తో కూడిన పద్దులను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే రూపొందించిన బడ్జెట్‌లోని పలు అంశాలను సవరించాలని కమీషనర్‌ను కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందన్నారు. పట్టణంలో ఉన్న సెల్ టవర్స్‌కు పన్ను కడుతున్నారా? కడితే ఆ డబ్బులను మున్సిపల్ అధికారులే మింగేస్తున్నారా అని 28వ వార్డు కౌన్సిలర్ బి.మల్లేశం నిలదీశారు.

Pages