S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సదాశివపేట, ఏప్రిల్ 30: ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన పరమేశ్వర్ గౌడ్ (56), అందోల్ మండలం నేరేడిగుంటకు చెందిన మల్లేశం (26) ఈ ప్రమాదంలో మృతి చెందారు.

పశు సంపదను కాపాడుకోవాలి

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 30: వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని పశు సంపదకు నాణ్యమైన వైద్య సౌకర్యం అందించాలని ట్రైనీ కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య సూచించారు. ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పశు సంపదకు పూర్తి అవగాహానతో వైత్య సేవలందించాలన్నారు. వైద్యాధికారులు రైతుల ఇండ్లకు వెళ్లి పశు ఆరోగ్య సేవలపై అవగాహాన కల్పించి అవసరం మేరకు వైద్య సదుపాయం సమకూర్చాలని సూచించారు.

ప్రమాదాలపై ప్రజాచైతన్యం

జహీరాబాద్, ఏప్రిల్ 30: రోడ్డు దాడుతుంటే..వాహనంపై వెళ్తుంటే..ఇలా కాలినడకన వెళ్లినా వాహనంపై వెళ్లినా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రణాలు కోల్పోవడం పెరిగిపోతున్న ట్రాఫిక్ యుగంలో సర్వసాదారణమైంది. జరుగుతున్న ప్రమాదాలతో కుటుంబ పెద్దను కోల్పోయి వీధిపాలవుతున్న కుటుంబాల దుస్తితి వర్ణనాతీతంగా మారాయి. ఎలాగైనా ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నా పూర్తిస్థాయి ఉపశమనం మాత్రం కలగడంలేదు. ప్రమాదాల నివారణ సమాజంలోని వారందరిపై ఉందన్న భావన ప్రజల్లో కల్పించేందుకు జిల్లా ఎస్పీ.సుమతి వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించారు.

దేశంలో దమ్మున్న సిఎం కెసిఆర్

జిన్నారం, ఏప్రిల్ 30: యావత్‌దేశంలో దమ్మున్న నెంబర్‌వన్ సిఎం కెసిఆర్ అని, తెలంగాణ మొత్తం తాగునీరిచ్చి ఓట్ల అడుగుతానన్న ఒకేఒక్కడని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మండల టిడిపి అధ్యక్షుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డితో పాలు పలువురు టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన కార్యకర్తలు హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర నీతిఅయోగ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

పెద్దశంకరంపేట, ఏప్రిల్ 30: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి సల్పుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయా గ్రామాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు నిదర్శనంగా గతంలో ఎన్నడులేని విధంగా రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత తెరాస ప్రభుతావనిదే అన్నారు. ఏప్రిల్ 15 నుండి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయడం తమ ప్రభుత్వ ఘనత అన్నారు. అలాగే రైతులు పండించిన పంటకు నాణ్యమైన మద్దతు ధర అందిస్తున్నామన్నారు.

ఆసరాకు ఆ నిబంధన ఎత్తివేయాలి

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 30: ఆసరా ఫించన్లకు లైఫ్ సర్ట్ఫికేట్ నిబంధన ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య హెచ్చరించారు. శనివారం స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫించన్లు ఎత్తివేసే కుట్రలో బాగంగానే ప్రభుత్వం లైఫ్ సర్ట్ఫికేట్స్ ఇవ్వాలనే నిబంధన పెడుతుందన్నారు. రాష్ట్రంలో 35.85లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారని వీరందరూ ప్రతి 3నెలలకు ఒకసారి మీసేవ ద్వారా సర్ట్ఫికేట్స్ ఇవ్వాలని నిర్ణయించడమంటే లబ్ధిదారులను అవమాన పర్చడమే అవుతుందన్నారు.

వర్ని ఠాణా ఎదుట బిజెపి ధర్నా

బాన్సువాడ, ఏప్రిల్ 30: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలంలో గల బడాపహాడ్ దర్గా వద్ద ఇటీవల వెలుగు చూసిన హత్యోదంతాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు శనివారం వర్ని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు వర్నిలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వందల మంది కార్యకర్తలు ప్రదర్శనగా చేరుకుని ఠాణా ఎదుట రెండు గంటల పాటు బైఠాయించారు. పోలీసులకు, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి

నిజామాబాద్, ఏప్రిల్ 30: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను మరింతగా పెంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ యోగితారాణా ఐసిడిఎస్, వైద్యారోగ్య శాఖల అధికారులకు సూచించారు. ఇదివరకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 15శాతానికే పరిమితం అవగా, ఏప్రిల్ నెలలో 45శాతానికి పెరిగాయని అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ మే నెలలో ప్రసవాల సంఖ్యను 60శాతానికి చేర్చాలని లక్ష్యం విధించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పిహెచ్‌సిల వైద్యాధికారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, సిడిపిఓలు, ఎస్‌పిహెచ్‌ఓలు, ఐకెపి ఎపిఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వేతనాలు చెల్లించాలి

వినాయక్‌నగర్, ఏప్రిల్ 30: బీడీ యాజమాన్యాలు నలభై రోజుల పాటు కంపెనీలను మూసివేసినందున బీడీ కార్మికులకు సంబంధిత రోజులకు వేతనాలు లెక్కించి పూర్తిస్థాయిలో చెల్లించాలని తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎఎస్.పోశెట్టి డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసులు అందించకుండానే చట్ట విరుద్ధంగా కంపెనీలను మూసి వేయడం వల్ల 7లక్షల మంది బీడీ కార్మికులు పని దినాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు.

విత్తనశుద్ధితో తెగుళ్ల నివారణ

మోర్తాడ్, ఏప్రిల్ 30: రైతులు విత్తన శుద్ధి చేయడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చని, ప్రధానంగా పంటలకు ఆశించే తెగుళ్ల బారి నుండి వాటిని కాపాడుకోవచ్చని రైతు శిక్షణ కేంద్రం డిడిఎ నర్సింహచారి అన్నారు. మోర్తాడ్ మండలం శెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లో శనివారం జరిగిన మన తెలంగాణ - మన వ్యవసాయం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. శుద్ధి చేసిన విత్తనాల వల్ల వాటి వేర్లకు, పంటకు సోకే తెగుళ్లను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని అన్నారు.

Pages