S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సోయగాలు ... పెరటి పూదోటలు

పెరట్లో పూదోటలను పెంచడం ముగ్ధ మనోహర అభిరుచికి అద్దం పడుతుంటారు. గృహాల ముంగిట కనిపించే రంగు రంగుల లతలు, పూమొక్కలతో కూడిన పెరటి తోటలు సౌందర్య రసానుభూతిని సృష్టిస్తాయి.

మెంతులతో స్వీట్లు

ఈజిప్టు, మధ్యప్రాచ్యంలో పుట్టి ఆసియాకు వ్యాపించిన మెంతులు రెండువేల ఏల క్రితమే సాగుచేశారు. ఈజిప్టులో మమీల తయారీలో మెంతులను ఉపయోగించేవారట. ఇక భారతీయ వైద్యం, వంటకాలు, సౌందర్య సాధనాల్లో మెంతులకు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇవి కాకుండా మెంతులతో స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు తయారు చేస్తారని తెలుసా. బాలింతలకు వీటితో తయారు చేసిన స్వీట్లు ఇస్తే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయని చెబుతారు. ఇండియా, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ దేశాలు ఇప్పుడు వీటి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఎస్.కె.కె.రవళి

భవిష్య కాలం

లకనం సంధ్య, నాగాయలంక (కృష్ణా)
ప్ర: వివాహం యోగం?
సమా: సింహాచలంలోని శ్రీవరాహ నారసింహ స్వామికి ప్రతి మంగళవారం వడపప్పు బెల్లపు పానకం నివేదన చేసి దీపారాధన చేసి మొక్కు మొక్కండి. జాతకంలోని కుజ-శని దోషాలు నివారణమవుతాయి.
పెద్దలంక అనంతలక్ష్మి, వెంకటగిరి, నెల్లూరు
ప్ర: ఉద్యోగ విషయం చెప్పండి
సమా: మీ ఉద్యోగం విషయంలో మీరే సందిగ్ధంలో వున్నట్టున్నారు. వ్యాపారమా? ఉద్యోగమా అని. ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నిస్తే నైరుతి దిశలో మీకు ఉద్యోగ యోగం వుంది.
ఏ.కోమలకుమారి, పాయకరావుపేట (విశాఖ)
ప్ర: అనారోగ్యం? ఎప్పుడు కోలుకుంటాను?

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ

mataata

నేర్చుకుందాం

క. ఇచ్చునది పాత్రునకు ధన
మచ్చుగ నొరు వేఁడకుండునది యభిముఖులై
వచ్చిన యశార్థుల వృథ
పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్

అమీ..ఆశ!

మోడల్‌గా, నటిగా అందరిచేత ప్రశంసలందుకున్న అందాల తార బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ కళ్లు ఇప్పుడు ‘బాహుబలి’ ప్రభాస్‌పై పడ్డాయట. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సాధించిన అఖండ విజయం ఆమె మనసు కొల్లగొట్టిందట. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంలో ‘బాహుబలి’ పాత్రలో ఉరిమిన ప్రభాస్ ఎందరో యువతులకు రాకుమారుడై పోయాడంటే ఆశ్చర్యం లేదు. ప్రభాస్‌ను ఆరాధిస్తున్న అందాలభామల్లో అమీజాక్సన్ కూడా చేరిపోయింది.

-సమీర్

యమహాపురి 30

అందుకు జగదానందస్వామి దీవెన పొందాడు. ఇపుడు తన సాయం కోరి వచ్చాడు.
జగదానందస్వామి గురించీ, ఆయన దీవెన గురించీ శ్రీకర్‌కి తెలుసు. అది మీడియాలో వినిపించే ఒక మామూలు వార్తగా భావించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడాయన దీవెన తనకు శాసనమయింది.
ఒక్కక్షణం ఆగి, ‘‘మీరేదో చాలా పెద్ద మిషన్ మీదే వచ్చారని అర్థమైంది. మిమ్మల్ని నమ్మి పనివ్వడానికి నేను మామూలు మనిషిని కాను. బాధ్యతగల ప్రభుత్వాధికారిని. మీరు చెప్పేది నిజం కాదనీ, ఇది ఓ నేరస్థుడి ట్రాప్ అనీ నేనంటాను. కాదనడానికి మీ దగ్గిర ఏమైనా ఋజువులున్నాయా?’’ అన్నాడు శ్రీకర్.

వసుంధర

హరివంశం 121

ఇక చిక్కక ఎక్కడకు తప్పించుకుంటాడు అని ఆశపడ్డాడు కాలయవనుడు.
ఇక ఆ గుహ వృత్తాంతం ఎటువంటిదో కాలయవనుడికేం తెలుసు?

పరమాత్మ స్వరూపం

భగవంతుడు జ్యోతిస్వరూపుడు. నిర్వికారుడు. అతడు పరమ బ్రహ్మస్వరూపుడు. తేజస్వి. మహానుభావులంతా అతనే్న ఉపాసిస్తారు. అతని ప్రకాశం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అతడు స్వయం ప్రకాశకుడు. అతనినుండే ప్రకృతి ఉద్భవించింది. ప్రకృతినుండి మహత్తత్వం ప్రకటితమైంది. దాని లోపల సూర్యచంద్రులు ఆశ్రయించుకుని ఉన్నారు. భగవానుడు సావధానుడై సూర్యచంద్రులను, భూమ్యాకాశాలను దర్శిస్తున్నాడు. అతనినుండియే దిక్కులు పుట్టాయి. నదులు ఉద్భవించాయి.

-పట్టిసపు శేషగిరిరావు

Pages