S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/29/2017 - 00:09

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన పేలుళ్ల గు రించి గురువారం రాజ్యసభలో జరిగిన ‘మాటల యుద్ధం’ వాస్తవాలను మరింతగా నిగ్గుతేల్చడానికి దోహదం చేయవచ్చు. ఈ ‘మాటల యుద్ధం’ గురించి మాధ్యమాలలో పెద్దగా ప్రచారం కాకపోవడం విచిత్రమైన వ్యవహారం. ఈ పేలుళ్లను పాకిస్తాన్ ప్రేరిత ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘సిమి’ అన్న బీభత్ససంస్థలు జరిపించినట్టు కొత్త సమాచారం వెలువడడం ఈ మాటల యుద్ధానికి కారణం.

07/28/2017 - 00:43

బిహార్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రహసనంలో ప్రధాన ‘ఇతివృత్తం’ అవకాశవాదం! దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు ఎంతోకొంత ‘అవకాశవాదం’ ప్రాతిపదిక మాత్రమే అభినయిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రదర్శితమవుతున్న బహిరంగ నాటకంలోని ఆకర్షణీయమైన అద్భుతం! బుధవారం, గురువారం వడివడిగా సంభవించిన పరిణామాలు ‘ఉత్కంఠ’కు జనాన్ని గురి చేయలేదు..

07/27/2017 - 00:41

వందేమాతరం’ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మదరాసు హైకోర్టు నిర్దేశించడం జాతీయ నిష్ఠను పెంపొందించడానికి దోహదం చేయగల శుభ పరిణామం. అన్ని పాఠశాలలలోను, ప్ర భుత్వ కార్యాలయాలలోను, ప్రభుత్వేతర సంస్థలలోను, పరిశ్రమల కార్యాలయాలలోను విధిగా ఈ జాతీయ సంకీర్తన-నేషనల్ సాంగ్-ను నియతంగా పాడాలని హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆదేశించడం మరో చారిత్రక పరిణామం.

07/24/2017 - 23:56

పదవీ విరమణ చేస్తున్న రాష్టప్రతి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ ప్రామాణిక జాతీయ నాయకుడు. ఈ ‘ప్రామాణిక’ కార్య పద్ధతి ఆయన సుదీర్ఘ కాలం పాటు నిర్వహించిన రాజకీయ, రాజ్యాంగ పదవుల ద్వారా ప్రస్ఫుటించింది. 1970వ దశకం నుంచి జాతీయ రాజకీయాలలో, కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ భూమిక నిర్వహించిన ప్రణవ్ ‘అసమర్ధత’, ‘అవినీతి’ అన్న ఆరోపణలకు మాత్రం గురికాలేదు.

07/23/2017 - 23:37

ఆహారం విష రసాయనాలతో సంకరం అయిపోతోందన్నది ప్రజలు పట్టించుకుంటున్న వ్యవహారం. పర్యావరణం, ప్రకృతి ‘ప్లాస్టిక్’తో సంకరమైపోతోందన్నది ప్రజలు పెద్దగా పట్టించుకోని వ్యవహారం! కూరగాయలను ఉప్పునీటితో కడిగి శుభ్రం చేసుకుంటే తప్ప వాటిని వండరాదన్నది పెరిగిన ధ్యాస. ఆ కూరగాయలను తీసుకుని వచ్చిన ‘ప్లాస్టిక్’ సంచులను మాత్రం చెత్తకుండీలో పారేస్తున్నాము!

07/22/2017 - 00:07

చలనచిత్ర రంగానికి చెందిన పూరీ జగన్నాథ్ అనే ప్రముఖ దర్శకుడిని ప్రభుత్వ ‘మాదక ని రోధక’ కార్యాచరణ దళం అధికారులు బుధవారం హైదరాబాద్‌లో సుదీర్ఘంగా ప్రశ్నించడం ‘ప్రతీక’ మాత్రమే! గురువారం చిత్ర గ్రాహకుడు- కెమెరామన్- శ్యామ్ కె.నాయుడు అనే మరో ప్రముఖుడు కూడ ఈ మాదక నిరోధక ప్రశ్నల పరంపరకు గురి అయ్యాడట! సుబ్బరాజు అనే నటుడిని శుక్రవారం ఈ ప్రత్యేక ‘కార్యాచరణ దళం’ వారు విచారించారట.

07/21/2017 - 00:27

రాష్టప్రతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక కావడం మరో చారిత్రక మహా సంఘటన.. ఈ చరిత్ర రాజ్యాంగ ప్రక్రియ ప్రగతికి సంకేతం, ప్రజాస్వామ్య ప్రస్థాన పరిణతికి సముజ్వల దర్పణం, సామాజిక సుఖ సంతోషాల క్రమానుగత వికాసానికి చిహ్నం. అనాది భారత జాతీయ జీవన గరిమకు ప్రతిబింబం! రాష్టప్రతి దేశ ప్రజలలో ప్రథముడు, రా జ్యాంగ పరిరక్షకుడు, సర్వజన సమాకాంక్షలకు సమున్నత ప్రతినిధి, జాతీయ సర్వాభౌమాధికార వ్యవస్థలో సర్వోన్నతుడు.

07/20/2017 - 03:39

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్-ఏఎమ్‌ఆర్‌సి-వారు విజయవాడ శివారులో అరవై ఎకరాల భూమిని సేకరించకుండా హైదరాబాద్ హైకోర్టు తాత్కాలికంగా నిరోధించడం వర్తమాన ఘట్టం! తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలకు సేకరిస్తున్న భూమి కూడ న్యాయ వివాదాలకు గురి అవుతుండడం నడచిపోతున్న ప్రహసనం!

07/19/2017 - 01:07

వారి సజల నయనాల నుంచి సంతోషం జాలువారుతోంది, వారి హృదయాలు ప్రహర్ష పరిప్లుతమయ్యాయి. నిరాశా నాస్పృహల చీకటి ఆవహించి ఉన్న ఆ ముప్పయి తొమ్మిది కుటుంబాల ప్రాంగణాలలో వేకువ అంకురించింది, విశ్వాసం మళ్లీ వికసిస్తోంది! ఈ ‘విశ్వాసం’ గత మూడేళ్లుగా మోడువారిపోయింది.

07/17/2017 - 23:58

ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి కానుండడం తెలుగు ప్రజలకు ఆనందదాయకమైన పరిణామం! భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు సోమవారం రాత్రి వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఆయన దేశంలోని రెండవ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ఖాయమని స్పష్టమైపోయింది, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉప రాష్టప్రతిని ఎన్నుకుంటారు కనుక..

Pages