S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/05/2017 - 01:01

భారత్-ఇజ్రాయెల్ మధ్య సరికొత్త రీతిలో ఆర్థిక బంధాన్ని, శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాల్లో సరికొత్త అనుబంధాన్ని పెంపొందించే లక్ష్యంతో మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకూ ఇటు ధనిక దేశాల్లోనూ, అటు వర్థమాన దేశాల్లోనూ ఎన్నో సార్లు ఆయన పర్యటించినప్పటికీ ఇజ్రాయెల్ పర్యటనకు ఎనలేని ప్రాముఖ్యత ఉండటానికి కారణం ఇరు దేశాల మధ్య బలంగా కొనసాగుతున్న దీర్ఘకాల బంధమే!

07/04/2017 - 01:02

మూడేళ్ల క్రితం కేంద్రంలో పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్‌డిఏ సర్కార్ ఆర్థిక సంస్కరణలకు ఎప్పటికప్పుడు పదునుపెడుతూనే వస్తోంది. సమయం వచ్చినప్పుడు సంస్కరణల చిట్టావిప్పుతూ సరికొత్త దారులు తీస్తూనే ఉంది.

07/03/2017 - 00:50

ఆలస్యంగానైనా మన ప్రభుత్వం స్పందించిన తీరు మన రక్షణ నిష్ఠకు నిదర్శనం. మన దేశపు సరిహద్దులు భూటాన్, టిబెట్‌తో కలిసే చోట చైనా సాగిస్తున్న చొరబాటును తిప్పికొట్టగలమని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం స్పష్టం చేయడం హర్షణీయం, సరిహద్దు భద్రతాదళాల నైతిక బలాన్ని పెంచగల పరిణామం!

07/01/2017 - 00:50

వస్తు సేవల పన్ను- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- వ్యవస్థీకృతం కావడం సర్వ సమగ్ర ఆర్థిక సమీకృతికి సరికొత్త మాధ్యమం. దేశమంతటా ఒకే విధమైన పన్నులు విధించడానికి రాజ్యాంగ పరమైన వ్యవస్థ ఏర్పడడం ఈ ‘సమీకృతి’. అసమంజస ఆర్థిక లాభ నిరోధక సూత్రం- డాక్టరిన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌జస్ట్ ఎన్‌రిచ్‌మెంట్- నిరంతరం అమలు జరగాలన్నది ప్రజాస్వామ్య వౌలిక ఆదర్శాలలో ఒకటి!

06/30/2017 - 00:24

జునాయిద్ అనే యువకుని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నట్టు ప్రచారం అవుతోంది! ఒకరు మరొకరిని లేదా కొందరు మరి కొందరిని హత్య చేయడం అమానుష ప్రవృత్తికి, పాశవిక చిత్తవృత్తికి నిదర్శనం. చంపడం క్రూరమృగాల లక్షణం. గత వారం ‘్ఢల్లీ-మధుర’ పాసెంజర్ రైలులో వెడుతుండిన జునాయిద్‌ను కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపివేయడడం దారుణమైన ఘోరం.

06/29/2017 - 00:27

ఇంత జరిగినట్టు ప్రచారం అవుతున్నప్పటికీ మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వౌనం వహించి ఉండడం అంతుపట్టని వ్యవహా రం. దురాక్రమణ సాగిస్తున్న చైనా ప్రభుత్వం మాత్రం పైశాచిక స్వరంతో అబద్ధాలను ప్రచారం చేస్తోంది, మన దేశంపై అభాండాలను వేస్తోంది. వాస్తవాలను ప్రచారం చేయడం కంటే చైనా వారి అబద్ధాలకు మన దేశంలోని కొన్ని పత్రికలు అధికప్రాధాన్యం ఇస్తుండడం జనానికి అర్థం కాని వ్యతిరేక పరిణామం.

06/28/2017 - 02:04

ఎండ, వాన కలసివచ్చినట్టయింది, ఎండ కా స్తుండగానే వాన కురవడం.. తిలకించే వారికి ఒక తీయని అనుభూతి! ఎవరు ఎండ? ఎవరు వాన? అన్నది ప్రధానం కాదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఆ దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకోవడం గ్రీష్మతాపం, హర్షవర్షం ఒకే చోట సంగమించిన విలక్షణ దృశ్యం! ఇదీ ప్రధానమైన పరిణామం..

06/27/2017 - 00:12

అణు సరఫరాల కూటమి-న్యూక్లియర్ సప్లయ్యర్స్ గ్రూప్-ఎన్‌ఎస్‌జి-లో మన దేశానికి సభ్యత్వం ఇ వ్వరాదన్న చైనా మాట మరోసారి నెగ్గింది. జూన్ ఇరవై రెండవ, ఇరవై మూడవ తేదీలలో స్విట్జర్‌లాండ్ రాజధాని బెర్న్‌లో జరిగిన ‘ఎన్‌ఎస్‌జి’ సభ్య దేశాల సమావేశంలో మన సభ్యత్వం సంగతి చర్చకు వచ్చిందట! ప్ర స్తుతానికి మనకు సభ్యత్వం ఇవ్వరాదని సమావేశంలో నిర్ణయించారట!

06/26/2017 - 01:00

మద్యపాన ప్రవృత్తిని పెంపొందించడంలో పరిపాలకుల ‘మానవీయ చిత్తవృత్తి’ ప్రస్ఫుటిస్తుండడం వర్తమాన ‘నాగరికం’..ఈ నాగరికానికి సరికొత్త చిహ్నం పంజాబ్ శాసనసభ ‘మద్యపానాన్ని రహదారుల పక్కన యథావిధిగా కొనసాగించడానికి’ వీలైన బిల్లును శుక్రవారం ఆమోదించడం! ఈ ‘బిల్లు’ను నిరసిస్తూ పంజాబ్‌లోని ప్రతిపక్షాలు శాసనసభనుంచి నిష్క్రమించాయి. ఇలా నిష్క్రమించిన ప్రతిపక్షాలు అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిర్వహిస్తున్నాయి!

06/24/2017 - 01:28

కులభూషణ్ జాధవ్ ‘క్షమా యాచన’కు పాల్పడినట్టు పాకిస్తాన్ సైనిక దళాల అధికారులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను ఘోరంగా వక్రీకరించడానికి పన్నిన పన్నాగంలో భాగం!

Pages