S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/17/2019 - 23:37

బర్మింగ్‌హామ్, ఫిబ్రవరి 17: ఇథియోపియాకు చెందిన టీనేజర్ 1,500 మీటర్ల ఇండోర్ గ్రాండ్ ప్రిక్స్‌లో సరికొత్త రికార్డును తిరగరాశాడు. శామ్యూల్ టెఫెరా అనే 22 ఏళ్ల యువకుడు ఇక్కడ జరిగిన 1,500 మీటర్ల ఇండోర్ గ్రాండ్ ప్రీలో కేవలం 3 నిమిషాల 31.04 సెకన్లలో లక్ష్యం ఛేదించి సరికొత్త రికార్డును సృష్టించాడు.

02/17/2019 - 23:37

క్రిస్ట్‌చర్చ్, ఫిబ్రవరి 17: క్రికెటర్ క్రీడా నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినందుకుగాను న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహమ్మదుల్లాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫైన్ విధించింది.

02/17/2019 - 05:55

గువాహటి: జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌గా సైనా నెహ్వాల్ మరోసారి నిలిచింది. శనివారం గువాహటిలో జరిగిన ఫైనల్‌లో పీవీ సింధుపై వరుస సెట్లలో 21-18, 21-15తో విజ యం సాధించింది. ఆట మొదటి నుంచి సైనా దూకుడుగా ఆడడంతో 30 నిమిషాల్లోనే పోరు ముగిసింది. గతేడాది కూడా జాతీయ టోర్నీ విజేతగా సైనా, సింధూపై రెండోసారి వరుసగా విజయం సాధించింది.

02/16/2019 - 23:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ల పిల్లల చదువుకు సాయం అందిం చేందుకు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. అలాగే హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్టార్ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ కూడా ‘అమరవీరుల కుటుంబాలకు అందరం అండగా నిలబడదాం. ఇది మన బాధ్యత.

02/16/2019 - 23:42

నాగపూర్, ఫిబ్రవరి 16: ఇరానీ కప్‌లో భాగంగా నాగపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుపై విదర్భ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజయం సాధించింది. ఐదో రోజు శనివారం ఓవర్ నైట్ స్కోరు 37 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన విదర్భకు ఓపెనర్ సంజయ్ రాఘునాథ్‌తో పాటు అథర్వా తైదే మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

02/16/2019 - 23:40

ముంబయ, ఫిబ్రవరి 16: ఈ ఏడాది ప్రపంచ కప్‌కు మరో మూడు నెలల సమయం ఉండడం తో మాజీ క్రికెటర్లు వారి కలల జట్టును ప్రకటిస్తు న్నారు. గతంలో మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తన కలల జట్టును ప్రకటించగా, తాజాగా లెజెం డరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రకటించాడు.

02/15/2019 - 21:51

ముంబయ, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియా ఈ నెల 24 నుంచి మార్చి 13 వరకు జరిగే టీ20, వనే్డ సిరీస్‌లకు భారత జట్టును శుక్రవారం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ ఏడాది మే నుంచి మొదలు కానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్ మేనేజ్‌మెంట్ జట్టును ఎంపిక చేసింది.

02/15/2019 - 21:48

నాగపూర్, ఫిబ్రవరి 15: ఇరానీ కప్‌లో భాగంగా నాగపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు రంజీ చాంపియన్ విదర్భ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు శుక్రవారం ఆటలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి (180) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. 4 సిక్స్‌లు, 19 ఫోర్లతో నాటౌట్‌గా నిలిచాడు.

02/15/2019 - 21:46

గౌహతి, ఫిబ్రవరి 15: సినీయర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో మాజీ సైనా నెహ్వాల్‌తో పాటు పరుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ సైనా క్వార్టర్ ఫైనల్‌లో ముంబ యకి చెందని నేహా పండిత్‌తో 21-10 21-10 తేడాతో సులభంగా విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌లో సైనా వైష్ణవితో తలపడనుంది. వైష్ణవి గతేడాది ఉబెర్ కప్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే.

02/14/2019 - 23:54

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ మరే మ్యాచ్‌కూ ఉండదేమో! ఈ రెండు దేశాలు ఆడుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఆటగాళ్ల దగ్గర్నుంచీ అభిమానుల దాకా ఒకటే నరాలు తెగే ఉత్కంఠత! ఈ ప్రభావం మ్యాచ్ ఫలితం తర్వాత చాలా రోజుల వరకూ ఎక్కడోచోట కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఘటనలు ఇప్పటివరకెన్నో.. అయతే..

Pages