S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/21/2019 - 02:47

న్యూఢిల్లీ, జనవరి 20: భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా సింగపూర్‌లో జరుగుతున్న 25,000 డాలర్ల మహిళల సింగిల్స్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఈ ఏడాది తొలిసారిగా టైటిల్‌ను దక్కించుకుంది. తన కెరీర్‌లో ఇప్పటికే ఏడుసార్లు వివిధ టైటిళ్లను కైవసం చేసుకున్న అంకిత రైనా ఆదివారం జరిగిన పోటీలో టాప్ సీడ్ అరంట్‌క్సా రస్‌పై విజయం సాధించింది.

01/21/2019 - 02:45

ఆక్లాండ్, జనవరి 20: కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియా టూర్‌ను అత్యంత అద్భుతంగా ముగించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తమ ఈనెల 23 నుంచి న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్ తలపడనుంది. ఆదివారం ఆక్లాండ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అభిమానులు, భారత మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.

01/21/2019 - 02:44

న్యూఢిల్లీ, జనవరి 20: వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడినా అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడిగా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు.

01/20/2019 - 04:19

మెల్‌బోర్న్, జనవరి 19: ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ మహిళల విభాగంలో శనివారం జరిగిన మూడోరౌండ్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్ నవొమి ఒసాకా, అమెరికా స్టార్, వరల్డ్ నెంబర్ 16 క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, వరల్డ్ నెంబర్ వన్ సిమోనా హాలెప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నారు.

01/20/2019 - 04:15

న్యూఢిల్లీ, జనవరి 19: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొన్న యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ మహిళలను కించపరుస్తూ ఒక టీవీ చానెల్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన నేపథ్యంలో బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా వారికి ఇపుడు మద్దతు ప్రకటించేలా మాట్లాడాడు.

01/20/2019 - 04:13

మెల్‌బోర్న్, జనవరి 19: టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ సాధించని ఘనతను అందుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం దిగ్గజ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌ను కలుసుకున్నాడు. మెల్‌బోర్న్‌లో గత ఆరు రోజులుగా ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే.

01/20/2019 - 04:11

మెల్‌బోర్న్, జనవరి 19: శ్రీలంకతో వచ్చే గురువారం నుంచి జరిగే రెండు టెస్టు సిరీస్‌లలో ఆస్ట్రేలియా జట్టు ఫాస్ట్ బౌలర్ జొష్ హాజెల్‌వుడ్ అడే అవకాశం లేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న హజల్‌వుడ్ జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడు. అయితే, వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో హజల్‌వుడ్ స్థానంలో జే రిచర్డ్‌సన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

01/20/2019 - 04:11

సెయింట్ జాన్స్, జనవరి 19: వెస్టిండీస్ క్రికెట్ నూతన ప్రధాన కోచ్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ పైబస్ ఎంపికపై విమర్శలు చెలరేగుతున్నాయి. రిచర్డ్ పైబస్ 2013 నుంచి 2016 వరకు వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌లో ఈనెల 23 నుంచి జరిగే టెస్టు సిరీస్‌తోపాటు వరల్డ్ కప్ తర్వాత జూలై, ఆగస్టులో భారత్‌లో వెస్టిండీస్ పలు మ్యాచ్‌లలో ఆడనుంది.

01/20/2019 - 04:10

కౌలాలంపూర్, జనవరి 19: మలేషియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్, 28 ఏళ్ల సైనా నెహ్వాల్ పోరు ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్ చేతులో 16-21, 13-21 తేడాతో పరాజయం పాలైంది. 2001 సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా 2017 సీజన్‌లో టైటిల్ అందుకుంది.

01/18/2019 - 20:45

మెల్‌బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా విజయం పరిపూర్ణంగా ముగించింది. మెల్‌బోర్న్ మైదానంలో శుక్రవారం జరిగిన మూడు వన్డేల్లో చివరిది, మూడోది అయిన కీలక మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో విజృంభించడంతో, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన అద్భుత విజయాన్ని అందుకోవడం ద్వారా ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Pages