S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/13/2017 - 01:56

బార్సిలోనా, జనవరి 12: కోపా డెల్ రే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచి, జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఒకానొక దశలో ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీగా నిలవగా, చివరి క్షణాల్లో మెస్సీ తనకు లభించిన ఫ్రీ కిక్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

01/13/2017 - 01:54

మెల్బోర్న్, జనవరి 12: భారత ఆటగాడు యుకీ భంబ్రీ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ డ్రాకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న క్వాలిఫయింగ్ ఈవెంట్ రెండో రౌండ్‌లో అతను సెర్బియాకు చెందిన మెజా క్రిస్టిన్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించాడు. మూడో రౌండ్‌లోనూ నెగ్గితే, అతను మెయిన్ డ్రాకు క్వాలిఫై అవుతాడు.

01/13/2017 - 01:54

డబ్ల్యుటిఎ అపియా ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ ఫైనల్ చేరిన బార్బరా స్ట్రయకోవా (చెక్ రిపబ్లిక్), సానియా మీర్జా (్భరత్). సెమీ ఫైనల్‌లో వీరు
6-1, 6-2 తేడాతో వనియా కింగ్ (అమెరికా), యర్లోస్లావా ష్వెడోవా జోడీని ఓడించి, అనస్తాసియా పవ్లిచెన్కోవా, టిమియా బబోస్‌తో టైటిల్ పోరును ఖాయం చేసుకున్నారు

01/13/2017 - 01:51

న్యూఢిల్లీ, జనవరి 12: భారత డేవిస్ కప్ జట్టుకు తన సోదరుడు ఆనంద్ అమృత్‌రాజ్‌ను నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై భారత మాజీ టెన్నిస్ స్టార్ విజయ్ ఆమృత్‌రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి భారత టెన్నిస్ చరిత్రలో ఆనంద్ కెప్టెన్సీని అత్యుత్తమ భాగంగా పేర్కోవచ్చని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు.

01/13/2017 - 01:49

న్యూఢిల్లీ, జనవరి 12: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసనకు గురైన అజయ్ షిర్కేపై కోర్టు కేసు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్‌లో వనే్డ, టి-20 సిరీస్‌లు ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి మెయిల్‌ను పంపిన షిర్కే చిక్కుల్లో పడ్డాడు.

01/12/2017 - 08:27

పుణె, జనవరి 11: టీమిండియాకు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహిస్తానని తాను ఎప్పుడు అనుకోలేదని, ఇలాంటి రోజు తన జీవితంలో వస్తుందని కూడా తాను ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడైన విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.

01/12/2017 - 08:25

ఆక్లాండ్, జనవరి 11: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరుగుతున్న ఎఎస్‌బి క్లాసిక్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతని కొత్త భాగస్వామి ఆండ్రీ సా (బ్రెజిల్) శుభారంభాన్ని సాధించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో వీరు టాప్ సీడ్స్‌గా బరిలోకి దిగిన ట్రీట్ హుయి, మాక్స్ మిర్నీ జోడీకి షాక్ ఇచ్చి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

01/12/2017 - 08:24

ముంబయి, జనవరి 11: భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు గురువారం ఇక్కడ ఇండియా-ఏతో రెండవ సన్నాహక మ్యాచ్‌లో ఆడనుంది. పుణెలో ఆదివారం తొలి అంతర్జాతీయ వనే్డతో ప్రారంభమయ్యే ఆరు మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల సిరీస్‌లో (మూడు వనే్డలు, మరో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లలో) విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాతో తలపడటానికి ముందు ఇంగ్లాండ్ జట్టు ఆడుతున్న చివరి సన్నాహక మ్యాచ్ ఇదే.

01/12/2017 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 11: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే మ్యాచ్‌లకు అవాంతరాలేవీ ఉండబోవని రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి హామీలను పొందాలని బిసిసిఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ)కి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు లోధా కమిటీ గురువారం బిసిసిఐ సిఇఓకి ఆదేశాలను జారీ చేసింది.

01/12/2017 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 11: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే మ్యాచ్‌లకు అవాంతరాలేవీ ఉండబోవని రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి హామీలను పొందాలని బిసిసిఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ)కి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు లోధా కమిటీ గురువారం బిసిసిఐ సిఇఓకి ఆదేశాలను జారీ చేసింది.

Pages