S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/09/2017 - 00:31

స్మిత్, జనవరి 8: భారత్‌లో టెస్టు సిరీస్ అనుకున్నంత సులభం కాదని, తాము చాలా కష్టపడాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మూడవ, చివరి టెస్టులో విజయం సాధించి, ప్రత్యర్థిని ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

01/09/2017 - 00:29

లండన్, జనవరి 8: సాకర్ కోచ్‌గా మరో పదేళ్లు కెరీర్‌ను కొనసాగిస్తానని చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ మేనేజర్ ఆంటానియో కొనే్ట స్పష్టం చేశాడు. అయితే, ఈ విషయాన్ని తన భార్య ఎలిసాబెతాకు తెలియనివ్వకండి అంటూ పాత్రికేయులతో జోక్ చేశాడు.

01/09/2017 - 00:29

శ్రీకాకుళం, జనవరి 8: నిరంతరం శ్రమించి, లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేసినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత మాజీ రెజ్లర్ కరణం మల్లేశ్వరి అన్నది. అన్ని స్థాయల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

01/09/2017 - 00:27

దుబాయ్, జనవరి 8: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ మొదటి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదివారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో అశ్విన్ 887 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, జడేజా 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

01/09/2017 - 00:26

చిత్రం..కతార్ ఓపెన్ ఫైనల్‌ల్లో ఆండీ ముర్రేను 6-3, 5-7, 6-4 తేడాతో ఓడించి ట్రోఫీని గెల్చుకున్న జొకోవిచ్

01/09/2017 - 00:24

వౌంట్ మోన్గానుయ్, జనవరి 8: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం నాటి చివరి మ్యాచ్‌లో ఈ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. విజయానికి కివీస్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వ0్ఫలమైన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 167 పరుగులు చేయగలిగింది.

01/08/2017 - 08:16

బెంగళూరు, జనవరి 7: ఒకప్పుడు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ ఒక్కటయ్యారు. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా, చివరికి వరకూ పోరాడిన బిసిసిఐ దేశంలో క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది.

01/08/2017 - 08:15

ముంబయ: భారత క్రికెట్ జాతీయ చీఫ్ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్న జతిన్ పరాంజపే, గగన్ ఖోడాలకు ఉద్వాసన పలకడం ఖా యమైంది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో జాతీయ సెలక్టర్లకు కనీస అర్హత కూడా ఉంది. కనీసం రెండు టెస్టుల్లో ఆడిన వారికి మాత్రమే కమిటీ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని లోధా కమిటీ స్పష్టం చేసింది. అయతే, ఈ సిఫార్సును పట్టించుకోకుండా ఐదుగురు సెలక్టర్లను బిసిసిఐ ఎంపిక చేసింది.

01/08/2017 - 08:15

ముంబయి, డిసెంబర్ 7: కెప్టెన్సీ నుంచి వైదొలగినప్పటికీ, జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు చెక్ పెడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. వృషభ్ పంత్ ఎంపిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అంటున్నారు. వనే్డల్లో ధోనీ సామర్థ్యంపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు టి-20 జట్టులో పంత్‌ను తీసుకోవడం పరోక్షంగా ధోనీకి హెచ్చరికలు జారీ చేయడమేనని అంటున్నారు. పంత్ సమర్థుడైన కీపర్.

01/08/2017 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 7: వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 2014లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు, టెస్టు సిరీస్ జరుగుతుండగానే ధోనీ ఆ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించాడు. దీనితో సెలక్టర్లు కోహ్లీని టెస్టుల్లో కెప్టెన్‌గా నియమించారు.

Pages