S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/28/2018 - 04:00

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే వినూత్న పథకానికి తెరతీసినట్టయిందని కర్నాటక ప్రెస్ అకాడమీ చైర్మన్ సిద్ధరాజు పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు 30 మందితో కూడిన కన్నడ జర్నలిస్టుల బృందం ఒకటి హైదరాబాద్ వచ్చింది.

02/27/2018 - 04:28

హైదరాబాద్, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడ నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు.

02/27/2018 - 04:26

హైదరాబాద్, ఫిబ్రవరి 26: మీకో దండం...కాలేజీలు నడపలేం అంటూ వృత్తి, సాంకేతిక విద్యా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. అనుబంధ గుర్తింపు పేరిట అనవసరపు నిబంధనలతో జెఎన్‌టియుహెచ్ వేధిస్తోందని, దానివల్ల అనుబంధ గుర్తింపు పొదండం చాలా కష్టమవుతోందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

02/27/2018 - 04:26

హైదరాబాద్, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ మొదటి నుంచీ తెలంగాణకు శత్రువేనని విద్యుత్‌శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు దొందూ దొందేనని మంత్రి ధ్వజమెత్తారు.

02/27/2018 - 04:25

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి రాష్ట్రంలోని సర్పంచ్‌లకు తెలియచేసేందుకు ప్రత్యేకంగా ‘సర్పంచ్‌ల సమ్మేళనం’ పేరుతో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. 31 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి మూడుచోట్ల ఒక్కోరోజు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసింది.

02/27/2018 - 04:22

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణలో యుజి, పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వివిధ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి సోమవారం నాడు ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి ఈసెట్, పీజీ ఈసెట్, పిఈసెట్ ప్రవేశపరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.
మే 9 నుండి ఈసెట్, 2న నోటిఫికేషన్

02/27/2018 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 26: మండల సాయి సరకుల నిలువ కేంద్రం నుండి రేషన్ సరకులను వివిధ గ్రామాలకు తరలించే రవాణాలారీల కదలికలపై పౌరసరఫరాల శాఖ ‘డేగ’ కన్ను వేసింది. ఈ లారీలు నిలువ కేంద్రాల నుండి సరకులను నేరుగా డీలర్ల దుకాణాల వద్దకే పోతున్నాయా, ఇతర ప్రాంతాలకు పోతున్నాయా అన్న విషయాన్ని చూసేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిలారీని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తున్నారు.

02/27/2018 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 26: హైదరాబాద్‌లోని టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. స్కాలర్ షిష్‌ల కోసం గత ఆరు రోజులుగా కళాశాల ఎదుట విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై ఉన్నత విద్యామండలి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేసారు.

02/27/2018 - 04:20

హైదరాబాద్, ఫిబ్రవరి 26: సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రాంతీయ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడం లేదన్న కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి వారిని చట్టప్రకారం శిక్షించనున్నామని అందులో పేర్కొన్నారు.

02/27/2018 - 04:20

హైదరాబాద్, ఫిబ్రవరి 26: నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం ఎలా చేశారో ఇప్పుడూ అదే పునరావృత్తమయ్యిందని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. ఇటువంటి పాలనకు చరమగీతం పాడే సామర్థ్యం ఒక్క టిడిపికి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలకు చేపట్టిన శిక్షణా తరగతుల్లో భాగంగా సోమవారం 6వ బ్యాచ్ శిక్షణా తరగతులను రమణ ప్రారంభించారు.

Pages