S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2018 - 04:15

హైదరాబాద్, ఫిబ్రవరి 28: బస్సు యాత్ర సందర్భంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం తీవ్రస్థాయిలో మండిపడింది. రౌడీ సమన్వయ సమితులుగా రైతు సమన్వయ సమితులను కాంగ్రెస్ నేతలు అభివర్ణించడాన్ని టిఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది.

03/01/2018 - 04:19

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, పౌర సేవల అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఇ-గవర్నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమీకృత సేవలు పొందడానికి రూపొందించిన ‘టి యాప్ ఫోలియో’ను బుధవారం మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ‘ఎనీ టైమ్, ఎనీ వేర్’ నినాదంతో ఈ యాప్ పనిస్తుందన్నారు.

03/01/2018 - 04:14

హైదరాబాద్, ఫిబ్రవరి 28: మహిళలపై జరుగుతున్న వేధింపులు, నేరాలను నిరోధించేందుకు మహిళా పోలీసులు ముందుండాలని, అందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునీకరణ, బలోపేతానికి ఎన్నో చర్యలు తీసుకుంటోందని అన్నారు.

03/01/2018 - 04:13

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ పోలీస్ శాఖకు లభించిన నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ట్రోపిని శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి అంజనీకుమార్ స్వీకరించారు. బుధవారం చెన్నైలో ముగిసిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో ఈ ట్రోపిని ఆయన అందుకున్నారు.

03/01/2018 - 04:12

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారిపట్టించి, అవినీతికి పాల్పడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా టిఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు.

03/01/2018 - 04:11

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహానిర్యాణంపై రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, అధికారులు, ధార్మికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని తెలిపారు. కంచిపీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పీఠం నేతృత్వంలో ఆయన విద్యాభివృద్ధికి సైతం ఎంతో కృషి చేశారని అన్నారు.

03/01/2018 - 04:11

హైదరాబాద్, ఫిబ్రవరి 28: వృత్తిపరమైన వత్తిడిని ఎదుర్కొంటూనే, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మృతి చెందిన పలువురు జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్టు సంక్షేమ నిధి చెక్కుల ప్రదానం జరిగింది.

03/01/2018 - 04:09

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. నిరుద్యోగ జెఎసి బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

03/01/2018 - 04:08

కొడంగల్/వికారాబాద్, ఫిబ్రవరి 28: నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చేందుకు చేపట్టిన కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రతో సీఎం కేసీఆర్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయని కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. అధికార పార్టీ నాయకుల తీరుకు నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరించారు.

03/01/2018 - 04:07

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఖమ్మం జిల్లాలో రైతులపై కేసులు వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ విలేఖర్లసమావేశంలో మాట్లాడుతూ కేంద్రం కందుల కొనుగోళ్లను ఈ రోజుతో నిలుపు చేస్తోందన్నారు. దీని వల్ల రాష్ట్రంలో కందుల రైతులు ఆర్థికంగా ఇక్కట్లను ఎదుర్కొనకుండా వారి నుంచి ఉత్పత్తులను రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

Pages