S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2018 - 02:50

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఎమ్సెట్‌పై గట్టి ధీమాను జెఎన్‌టియు, ఉన్నత విద్యా మండలి వ్యక్తం చేస్తున్నా విద్యార్థుల్లో మాత్రం అనుమానాలు నివృత్తి కావడం లేదు. ఈసారి ఎమ్సెట్‌తో సహా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నారు.

03/03/2018 - 02:40

హైదరాబాద్, మార్చి 2: దేశంలో 50శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబాటును అనుభవిస్తున్నాయని బీసీ కుల సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జేఏసీగా ఆవిర్భవించి సమస్యల సాధన కోసం పోరాడుదామని తీర్మాణించారు.

03/03/2018 - 02:39

హైదరాబాద్, మార్చి 2: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గెజిటెడ్ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 6, 7 తేదీల్లో నిర్వహించనున్న వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

03/03/2018 - 02:35

హైదరాబాద్, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సిఎం కెసిఆర్ ఉద్దేశపూర్వకంగా కించపర్చలేదని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత స్పష్టం చేసారు. రైతుల కష్టాలపై కేంద్రానికి స్పందన లేదన్న ఆవేదనతో సిఎం కెసిఆర్ కాస్త కటువుగా మాట్లాడిన విషయం వాస్తవమే అయినప్పటికీ ప్రధానిని కించపర్చే ఉద్దేశం లేదన్నారు.

03/03/2018 - 02:33

హైదరాబాద్, మార్చి 2: పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు మార్గదర్శకం చేయాడినికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో శనివారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

03/03/2018 - 02:31

హైదరాబాద్, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంటే ముఖ్యమంత్రి మాత్రం చాలా అనుచితంగా, అసభ్యంగా, అవమానపరిచే రీతిలో చేసిన కారుకూతలు చేస్తున్నారని బిజెపి జాతీయ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.

03/03/2018 - 02:29

హైదరాబాద్, మార్చి 2 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ టిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తే బాగుంటందని టి.టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నాడు ఎన్టీఆర్ ఆశీర్వాదం పొందిన ముఖ్య నేతలంతా ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోనే ఎక్కు వ సంఖ్యలో ఉన్నారని ఆయన శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

03/03/2018 - 02:26

హైదరాబాద్, మార్చి 2: నగరంలో రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు ఆరు ఆడియో పాటలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నందున ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వీలుగా ప్రచారం తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

03/03/2018 - 02:26

హైదరాబాద్, మార్చి 2: నిరుద్యోగ సమస్యపై గాంధేయ మార్గంలో ప్రభుత్వపై పోరాడేందుకు టీ జేఏసీ కార్యచరణ సిద్దం చేసుకుంది. ఇందులో నియామకాల అవశ్యకతను తెలియజేందుకు రెండు లక్షల పోస్టుకార్డులను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని నిర్ణయించింది.

03/03/2018 - 02:25

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేద్దామా? అని టి.కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల బలబలాల ప్రకారం పోటీ చేసి గెలుపొందడం చాలా కష్టమని తెలిసినా, కనీసం ఫిరాయింపుదారులైన తమ ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేసేందుకైనా ఉపయోగపడుతుంది కదా? అని కొంత మంది నాయకులు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వద్ద ప్రస్తావించారు.

Pages