S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2018 - 04:06

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.తొలి రోజు సంస్కృతం ప్రశ్నాపత్రం ఎక్కువ మంది రాయగా, తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచి, కన్నడం, మరాఠీలను కొంత మంది ఎంచుకున్నారు. పరీక్షకు జనరల్, వొకేషనల్ అభ్యర్ధులు కలిపి మొత్తం 4,82,360 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,61,516 మంది హాజరయ్యారని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు.

02/28/2018 - 04:10

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం లేఖ రాసారు. ఈ కారిడార్ ఏర్పాటుకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందన్నారు. కారిడార్ ఏర్పాటు వల్ల రాష్ట్రంలోని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

02/28/2018 - 04:08

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో తమ శాఖ (పౌరసరఫరాల) చేపట్టిన సంస్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ శాఖ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు.

02/28/2018 - 04:06

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి కేసీఆర్ తన హోదాను మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని , అది సరికాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేంద్రప్రభుత్వాన్ని , ప్రధానిని ఉద్ధేశించి రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో సిఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

02/28/2018 - 04:05

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా చైతన్య యాత్రపై దొంగ సర్ట్ఫికెట్లతో చెలమణి అవుతున్న మంత్రి లక్ష్మారెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ప్రజా చైతన్య యాత్రకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక మంత్రులు అనవసరపు విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ యాత్రపై అవాక్కులు, చెవాక్కులు పేలితే సహించబోమని హెచ్చరించారు.

02/28/2018 - 04:05

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఉన్నత విద్యలో పెద్ద ఎత్తున ఈ-పాలన సాగుతోందని, విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ విధానం చేపట్టిందని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) సలహాదారు డాక్టర్ బి.ఎస్.మధుకర్ పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యాభివృద్ధి అనే అంశంపై ఇక్ఫాయి, నేక్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సు మంగళవారం నాడు ప్రారంభమైంది.

02/28/2018 - 04:04

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పాలనను సులభతరతం చేయడం, తద్వారా మానవ జీవనాన్ని సులభతరం చేయడమే ఇ పరిపాలన ప్రధాన ధ్యేయమని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన న్యూ ఇండియా ఆవిర్భవించాలంటే ఇది అత్యవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

02/28/2018 - 04:04

హైదరాబాద్, ఫిబ్రవరి 27: జాతీయ స్థాయిలో ఇ పరిపాలనలో మెరుగైన ప్రగతిని సాధించిన వికాస సంస్థలకు మంగళవారం నాడు హైదరాబాద్‌లో పురస్కారాలు అందజేశారు. రెండు రోజుల పాటు హైటెక్స్‌లో జరుగుతున్న ఇ పరిపాలన జాతీయ సదస్సులో ఈ పురస్కారాలను కేంద్ర ప్రజా ఫిర్యాదులు, ఫించన్లు, అంతరిక్ష మంత్రిత్వశాఖల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అందజేశారు.

02/28/2018 - 04:03

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టుల నియామానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కనీసవిద్యార్హత నిర్ణయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారిని రేషన్ డీలర్లుగా నియమిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే పౌరసరఫరాల శాఖ రేషన్ డీలర్ల నియామకానికి చర్యలు తీసుకుంటుంది.

02/28/2018 - 04:01

హైదరాబాద్, ఫిబ్రవరి 27: మిషన్ కాకతీయ నాలుగవ విడతలో భాగంగా వంద చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజురు చేస్తూ నీటిపారుదలశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునరుద్ధరించే ఈ చెరువుల కింద 4602 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పనులకుగాను రూ.23 కోట్ల 12 లక్షలు ఖర్చు అవుతుందని అంచనాలను ప్రతిపాదించింది.

Pages