S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2018 - 02:24

హైదరాబాద్, మార్చి 12: వేసవి కాలంలో రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రతను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారి పెరగడం, వేసవి కాలం ప్రారంభం కావడంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రకృతి విపత్తు యాజమాన్య శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

03/03/2018 - 02:22

హైదరాబాద్, మార్చి 2 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం శుక్రవారం నాడు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సెకండ్ లాంగ్వేజి పేపర్లు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచి, కన్నడం, మరాఠీ-2 పరీక్షలు జరిగాయి. సెకండియర్ పరీక్షలకు 4,39,422 మందికి హాల్ టిక్కెట్లు జారీ చేయగా, అందులో 4,21,333 మంది మాత్రమే హాజరయ్యారు. 18,089 మంది గైర్హాజరయ్యారు.

03/03/2018 - 02:22

హైదరాబాద్, మార్చి 2: సంస్కారంపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్‌శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులకు సంస్కారం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని మంత్రి ప్రశ్నించారు. సిఎం కెసిఆర్‌ను దుర్భాషలాడే వారిని జానారెడ్డి వారించకపోవడం సంస్కారం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

03/02/2018 - 04:51

హైదరాబాద్, మార్చి 1: కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ నాలుగో వర్థంతి కార్యక్రమం పార్టీ కార్యాలయంలో గురువారం నాడు జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అంతా బంగారు లక్ష్మణ్‌కు ఘన నివాళులు అర్పించారు.

03/02/2018 - 04:50

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వంను గద్దె ఎప్పుడు దిగుతుందా ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని సిఎల్‌పి నేత జానారెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ నేతలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దారుణమని, అహంభావ పూరితంగా మాట్లాడడం తగదన్నారు.

03/02/2018 - 04:48

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బురద రాజకీయాలకు తెరలేపారని, రైతాంగలోకం ముఖ్యమంత్రి రంగులు మార్చే మనస్తత్వానికి విస్తుపోయారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఆదిలాబాద్ జిల్లాను ఆయన పర్యటించలేదని ఆరోపించారు. గురువారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి తీరును తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన సిఎంకే ఒక లేఖ రాశారు.

03/02/2018 - 04:48

హైదరాబాద్, మార్చి 1: సైన్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సత్యపాల్‌సింగ్‌ను ఆ పదవి నుండి తొలగించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు నాగా నారాయణ , మోతుకూరు సంయుక్త సహా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం తప్పు అని అందుకు సంబంధించిన పాఠాలను సిలబస్ నుండి తొలగించాలని ఇటీవల ఒక కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు.

03/02/2018 - 04:46

హైదరాబాద్, మార్చి 1: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు 2వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో సెకండియర్ పరీక్షలకు 5,07,911 మంది హాజరవుతున్నారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. 2వ తేదీన పరీక్ష ముందుగా నిర్ణయించిన ప్రకారం యథాతథంగా జరుగుతుందని ఆయన చెప్పారు.

03/02/2018 - 04:45

హైదరాబాద్, మార్చి 1: హైదరాబాద్ హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచిని ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు న్యాయవాదులు గురువారం ఇక్కడ కోర్టు విధులకు గైర్హాజరై ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపి హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనుంజయ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జల్లి కనకయ్య నాయకత్వం వహించారు.

03/02/2018 - 04:44

హైదరాబాద్, మార్చి 1: పాశ్చత్య ఆలోచనలు భారత్ సమస్యలకు పరిష్కారం చూపలేవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహసర్ కార్యవాహ దత్తాత్రేయ హూసబళే అన్నారు.

Pages