S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/31/2018 - 22:57

నల్లగొండ, జనవరి 31: నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ రాష్ట్రానికే ఆదర్శనీయమైన రీతిలో నేటి నుంచి పాఠకులకు పది రూపాయలకే మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు, పుస్తక ప్రియులకు, పోటీ పరీక్షల విద్యార్థులకు చౌకగా పది రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించనుండటం ఇతర గ్రంథాలయాలకు స్ఫూర్తిగా నిలువబోతోంది.

01/31/2018 - 22:56

హైదరాబాద్, జనవరి 31: తమ పార్టీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ టిఆర్‌ఎస్‌లో చేరనందుకే హత్య చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యేనని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఈ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించామని ఆయన తెలిపారు. కాల్ డేటా ఇవ్వబోమని సిఎం అనుయాయలు చెబుతున్నారని అన్నారు.

01/31/2018 - 22:55

నల్లగొండ, జనవరి 31: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హత్య కేసును సిబిఐతో విచారణ జరిపించాలంటూ లక్ష్మి వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం లక్ష్మి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్‌రావును ఆదేశించింది.

01/31/2018 - 22:54

హైదరాబాద్, జనవరి 31: గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న కార్మికులను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. కువైట్ దేశంలో తెలంగాణ వాసులు సుమారు 50 వేల మంది నానా యాతన పడుతున్నారని, దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆయన తెలిపారు.

01/31/2018 - 22:54

నిజామాబాద్, జనవరి 31: ఏజెంట్ల మోసాలకు గురై కువైట్‌లో చిక్కుబడిపోయిన వారంతా స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు అక్కడి రాయబార కార్యాలయం వద్ద బారులుతీరుతున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కువైట్‌లో అక్రమంగా ఉంటున్న వారు వారివారి స్వస్థలాలకు తరలివెళ్లేందుకు వీలు కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటనను జారీ చేసింది. జనవరి 29 నుండి ప్రస్తుత ఫిబ్రవరి మాసం 22వ తేదీ వరకు వెళ్లేందుకు అనుమతించింది.

01/31/2018 - 22:52

మేడారం, జనవరి 31: మేడారం జనజాతరకు ఈ ఏడాది విహాంగ వీక్షణంతో కొత్తరూపు సంతరించుకుంది. వరంగల్ నుండి మేడారం జాతరకు విచ్చేందుకు గత రెండు జాతరల నుండి హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వరంగల్ నుండి మేడారానికి వెళ్లి, తిరిగి వరంగల్‌కు రావడానికి ఒక్కింటికీ 13,999రూపాయలుగా ధరను నిర్ణయించారు.

01/31/2018 - 22:52

మేడారం, జనవరి 31: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ...

01/31/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 30: శాంతి భద్రతల విషయంలో రాజీపడకుండా, చట్టం ప్రకారం విధులు నిర్వహించాలని ఆర్మ్‌డ్ పోలీసు కానిస్టేబుల్స్‌కు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ గోషామహల్‌లో 9 నెలల పాటు పోలీసు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకుని పూర్తి స్థాయి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేందుకు 405 మంది ఆర్మ్‌డ్ పోలీసు కానిస్టేబుల్స్‌కు దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు.

01/31/2018 - 03:35

హైదరాబాద్, జనవరి 30: మేడారం జాతరకు జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మేడారం జాతరలో వైద్య సౌకర్యాలను కల్పించేందుకు బిజెపి డాక్టర్స్ సెల్ తరఫున నాలుగు అంబులెన్స్‌లు పంపించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

01/31/2018 - 03:35

హైదరాబాద్, జనవరి 30: ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంగళవారం మంత్రిని సచివాలయంలో కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. వివిధ సమస్యలను పేర్కొంటూ మంత్రికి ఒక వినతిపత్రం అందచేశారు.

Pages