S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/20/2017 - 22:51

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్నతస్థాయి ఖాళీలను భర్తీ చేసేందుకు 12 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. ఇందుకోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి) సోమవారం సమవేశమై ప్రమోషన్లను ఖరారు చేసింది. వైద్య ఆరోగ్య, అటవీశాఖ, జైళ్ల శాఖల్లో ప్రమోషన్ల అంశంపై ఈ సందర్భంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు.

11/20/2017 - 22:50

హైదరాబాద్, నవంబర్ 20: వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కీలకభూమిక పోషిస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ డి. రాజిరెడ్డి పేర్కొన్నారు.

11/20/2017 - 22:50

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్‌లో డ్రగ్ వ్యాపారులు కొత్త రకం మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా అనేక కొత్త రకాలతో డ్రగ్స్‌ను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా నగరంలో ఓ డ్రగ్స్ ముఠా పట్టుబడింది.

11/20/2017 - 22:49

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కెసిఆర్ కిట్స్ పథకంలో అందిస్తున్న వివిధ వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు, నాణ్యత లేని వస్తువులను ఏదైన సంస్థ సరఫరా చేస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెండు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.

11/20/2017 - 22:49

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణలో ఇంటర్ వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చదువుకునేలా చట్ట సవరణ చేయాలని ఉన్నతాధికార కమిటీ సూచించింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

11/20/2017 - 22:48

హైదరాబాద్, నవంబర్ 20: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రాక సందర్భంగా పాతబస్తీ కళకళలాడుతోంది. భాగ్యనగంలో ప్రత్యేక ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. హైటెక్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈనెల 28,29 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో వీరు పాల్గొననున్నారు.

11/20/2017 - 04:32

హైదరాబాద్, నవంబర్ 19: దేశాభివృద్ధిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు అమోఘం, అత్యంత కీలకమైనవని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరా గాంధీ శత జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తొలుత నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు పూల దండ వేసి నివాళి అర్పించారు.

11/20/2017 - 04:27

హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో లోపాలు ఉంటే కోర్టుకు వెళ్ళక తప్పదని టి.జెఎసి చైర్మన్ ఎం. కోదండరామ్ తెలిపారు. ఆదివారం అడ్వకేట్ జెఎసి అధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అమోఘమని అన్నారు.

11/20/2017 - 04:06

వీపనగండ్ల, నవంబర్ 19: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాల్లో 103 స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిగిలిన సీట్లలో ప్రతిపక్షాలు ఎంఐఎం దక్కించుకుంటుందని అన్నారు.

11/20/2017 - 04:04

మహబూబ్‌నగర్, నవంబర్ 19: రాజకీయ చైతన్యంతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఈ విషయాన్ని బీసీలలోని అన్ని కులాలకు సంబంధించిన నాయకులు గ్రహించాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.

Pages