S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/19/2017 - 23:33

హైదరాబాద్, నవంబర్ 19: హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ నిర్బంధంపై నగర పోలీస్ కమిషనర్ వివి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఆయన ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌ను సందర్శించారు. రౌడీ షీటర్ తన్నూను మూడు రోజులుగా నిర్బంధించడంపై విచారించారు. రౌడీషీటర్ గాయాలు చూపుతూ తల్లికి పంపిన వీడియోపై ఆరా తీశారు.

11/19/2017 - 23:33

హైదరాబాద్/ ఉప్పల్, నవంబర్ 19: ఓ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు భార్యలు ఉండగా మరో యువతితో సాగిస్తున్న రాసలీలను మొదటి భార్య, కొడుకు బట్టబయలు చేశారు. అక్రమంగా సహజీవనం చేస్తున్న అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతేకాకుండా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న యువతిని, హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రంను పోలీసులకు అప్పగించారు.

11/19/2017 - 23:30

హైదరాబాద్, నవంబర్ 19: వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్ సరఫరా విజయవంతమైంది. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరాను అందించిన విషయం తెలిసిందే. మొదట ఐదారు రోజుల పాటు విద్యుత్ సరఫరా చేసి పరిస్థితిని అధ్యయనం చేయాలని అధికారులు భావించారు.

11/19/2017 - 23:30

హైదరాబాద్, నవంబర్ 19: మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వారం రోజుల్లో మద్యం తాగిన వారిపై 545 చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసి జైలుకు పంపినా పద్దతి మారకుండా..మళ్లీ తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు కోర్టు తీర్పు వెలువరించింది.

11/19/2017 - 23:29

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ పోలీసు అకాడమి దేశంలో తొలిసారిగా పోలీసు శిక్షణ సిలబస్‌లో బాలలపై లైంగిక దాడులు, వాటిని అరికట్టడంపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అంశాలను చేర్చింది. అలాగే రకరకాల నేరాలు పెరుగుతున్ననేపథ్యంలో దర్యాప్తులో కొత్త మెళకువలను ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలకు శిక్షణలో నేర్పించనున్నారు. దీనికి సంబంధించి పోలీసు అకాడమి అన్ని సన్నాహాలు చేస్తోంది.

11/19/2017 - 04:12

హుజూర్‌నగర్, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను గత మూడున్నర సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం దగా చేసిందని స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి చీఫ్ కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

11/19/2017 - 04:10

జహీరాబాద్, నవంబర్ 18: ప్రజాసంక్షేమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆడపిల్ల పుట్టింది మొదలు, చదువు, పెళ్లి, విదేశీ చదువులకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా అత్యధికంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జహీరాబాద్‌లో ఇస్తున్నామన్నారు.

11/19/2017 - 04:07

నార్కట్‌పల్లి, నవంబర్ 18: పల్లెల మధ్య నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని చేపట్టి పట్టణాలకు దీటుగా పల్లెలకు కూడా మెరుగైన రహదారి సౌక ర్యం కల్పించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

11/19/2017 - 03:57

వరంగల్, నవంబర్ 18: తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, చేనేత శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు.

11/19/2017 - 04:14

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణ తీరు, వివిధ అంశాలపై సభ్యులు చర్చించిన విధానం చూస్తుంటే సభ లోపల, వెలుపల కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావువ్యూహం, రాజకీయ చతురత ముందు ప్రతిపక్ష పార్టీలు చిత్తయినట్లు కనపడుతున్నాయి. రాష్ట్రంలో, టిఆర్‌ఎస్ పార్టీలో కెసిఆర్‌కు సమీప భవిష్యత్తులో ఎదిరించే నాయకుడు లేరని మరోసారి సుస్పష్టమైంది.

Pages