S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/07/2017 - 00:44

హైదరాబాద్, నవంబర్ 6: కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి ప్రస్తుతానికి వర్కర్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఎంఐఎం శాసనసభా పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీకి సంపత్‌కుమార్‌కు మధ్య అసక్తికర చర్చ జరిగింది. సంపత్‌కుమార్‌ను ఉద్దేశించి ‘కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి పొజిషన్ ఏంటీ...పార్టీ లీడరా? వర్కరా?’ అని అక్బరుద్ధీన్ ప్రశ్నించారు.

11/07/2017 - 00:43

హైదరాబాద్, నవంబర్ 6: రాష్ట్రంలోని దేవాలయ భూములతో పాటు వక్ఫ్‌భూములు, దర్గాలకు చెందిన భూములను కాపాడాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. భూరికార్డుల ప్రక్షాళన అంశంపై శాసనసభలో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో 12 వేల దేవాలయాలు ఉన్నాయని, అలాగే రిజిస్టర్ కాని దేవాలయాలు మరో 20 వేల వరకు ఉన్నాయన్నారు.

11/06/2017 - 04:19

హైదరాబాద్, నవంబర్ 5: ‘ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు..’ అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తమకు కావాల్సింది చెప్పి, ఆ తర్వాత ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేసి, సభను వాయిదా వేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

11/06/2017 - 04:12

హైదరాబాద్/ఘట్‌కేసర్, నవంబర్ 5: ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు.

11/06/2017 - 04:10

మహబూబాబాద్, నవంబర్ 5: ఆకలితో అలమటించే జనం అధికంగా ఉన్న దేశంగా ప్రపంచంలో భారత్ మొదటిస్థానంలో ఉందని.. సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని, ఆకలి భారతదేశం.. అప్పుల తెలంగాణ ఇవే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన ప్రగతి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మానుకోటలో ఆదివారం రాత్రి జరిగిన సీపీఐ పోరుబాట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

11/06/2017 - 04:08

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై కెసిఆర్ ప్రభుత్వాం త్వరలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో పేదల ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములను ఆ వర్గాలకే దక్కే విధంగా చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించి విధి విధానాలను మంత్రులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తోంది.

11/06/2017 - 04:07

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్ (నాంపల్లి) లోని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది.

11/06/2017 - 03:44

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాల్లో వడ్డీ డబ్బు రూ.4500 కోట్లు వెంటనే జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కౌలురైతులందరికీ కార్డులు, రుణాలు మంజూరు చేయాలని, రైతులకు ఉన్న రూ.35 వేల కోట్ల అప్పులు రద్దుచేయాలని కూడా డిమాండ్ చేసింది.

11/06/2017 - 03:44

హైదరాబాద్, నవంబర్ 5: నిలోఫర్ ఆసుపత్రిలో ఇటీవల ఓ చిన్నారి కిడ్నాప్, మృతి సంఘటన మరువక ముందే కాచిగూడలో మరో సంఘటన చోటుచేసుకుంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మూడు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోవడం కలకలం రేపుతోంది. బబ్లూ, సన్నూ సింగ్ దంపతులు బర్కత్‌పుర క్రౌన్ కేఫ్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై నివాసముంటూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

11/06/2017 - 03:43

న్యూఢిల్లీ, నవంబర్ 5: తెలుగు భాషాభివృద్ధిలో, సాహిత్యంలో తెలంగాణ ప్రజల, కవుల, పండితుల పాత్ర విశిష్టమైనదని ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. డిసెంబరు 15 నుంచి 19 తేదీ వరకు హైదరాబాద్‌లో ప్రపం చ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Pages