S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/08/2017 - 22:35

నల్లగొండ, నవంబర్ 8: అనాధ చిన్నారు లు ఆశ్రయం పొందిన ప్రభుత్వ శిశుగృహం ఆ చిన్నారుల పాలిట మృత్యుకుహరమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని నిధులు.. అధికారులు, ఆయాల పర్యవేక్షణ లోపం, సరైన వైద్య చికిత్సలు లేకపోవడం చిన్నారుల ఉసురు తీస్తోంది. 41మంది చిన్నారులు ఆశ్రయం పొందిన నల్లగొండ శిశుగృహలో గత మూడు నెలల్లో దాదాపుగా పది మంది ఆడ పిల్లలు మృత్యువాత పడడం సంఛలనం రేపుతోంది.

11/08/2017 - 22:33

హైదరాబాద్, నవంబర్ 8: సుప్రసిద్ధ అలంపురం జోగలాంబ దేవాలయానికి అనువంశికేతర ట్రస్టు సభ్యులను నియమిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు.

11/08/2017 - 04:48

తుంగతుర్తి, నవంబర్ 7: భూరికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం దళారుల కంట్లో నలుసుగా మారింది. ఇంతకాలం తాము సాగించిన అక్రమాల తంతు నేడు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో దళారీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులే ఒక దశలో నివ్వెరబోతున్నారు.

11/08/2017 - 04:47

ఆదిలాబాద్, నవంబర్ 7: ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ సంరక్షణ అధికారి (సిఎఫ్‌వో) సంజయ్‌కుమార్ గుప్తా (48) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం వేకువజామున గుండెనొప్పితో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ పరీక్షలు నిర్వహించిన డ్యూటీ డాక్టర్లు ఎసిడిటి ఉందని చెప్పి మాత్రలు ఇచ్చి పంపించారు.

11/08/2017 - 04:30

హైదరాబాద్, నవంబర్ 7: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శాసనసభలో బిజెపి సభ్యులు నిల్చుని నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, ఆ క్రమంలో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు.

11/08/2017 - 04:29

హైదరాబాద్, నవంబర్ 7: శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 17 వరకు, మండలి సమావేశాలను ఈ నెల 22 వరకు కొనసాగించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం వేర్వేరుగా బిఎసిలు సమావేశమై సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనే అంశంపై చర్చించాయి.

11/08/2017 - 04:28

హైదరాబాద్, నవంబర్ 7: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో తాత్సారం తగదంటూ నినదించారు.

11/08/2017 - 04:26

హైదరాబాద్, నవంబర్ 7: రోజురోజుకి ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నందున, త్వరలోనే అన్ని ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి వెల్లడించారు. కెసిఆర్ కిట్ కార్యక్రమం అమలుపై మంగళవారం శాసన మండలిలో లఘు చర్చ జరిగింది.

11/08/2017 - 04:26

హైదరాబాద్/ఉప్పల్, నవంబర్ 7: డల్లాస్ పట్టణం తరహాలో పక్కా ప్రణాళికలతో హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

11/08/2017 - 03:56

హైదరాబాద్, నవంబర్ 7: రాజధానిలోని సరూర్‌నగర్ ప్రాంతంలో విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన భూమి రికార్డులను సమర్పించాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Pages