S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/08/2017 - 03:55

హైదరాబాద్, నవంబర్ 7: కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో అనేక లోపాలున్నట్టు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైందని ఆయన అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

11/08/2017 - 03:54

హైదరాబాద్, నవంబర్ 7: ఉన్నత విద్యలో భారీ సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రానున్న 20 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నత విద్యావసరాలపై ఇప్పటికే ముసాయిదాలను తయారుచేసిన ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమైంది.

11/08/2017 - 03:54

హైదరాబాద్, నవంబర్ 7: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన భూములు తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగైదు గ్రామాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు.

11/08/2017 - 03:53

హైదరాబాద్, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగతి నిరోధకులు, ప్రజలు బాగుపడటం వారికి ఇష్టం లేదని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి ఫార్మాసిటీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

11/08/2017 - 01:09

హైదరాబాద్, నవంబర్ 7: పెద్ద నోట్ల రద్దు బుధవారంతో (8న) ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్-డే నిర్వహించనున్నది. ఈ మేరకు టి.పిసిసి అధ్వర్యంలో బుధవారం నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఊరేగింపు, సభ నిర్వహించనున్నది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్‌సి కుంతియా, ఎఐసిసి ఎస్‌సి విభాగం జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె.

11/08/2017 - 01:08

హైదరాబాద్, నవంబర్ 7: రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం మంగళవారం ఏడుబిల్లులను ప్రతిపాదించింది. ప్రమాదకరమైన కార్యకలాపాల నివారణాబిల్లు, విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లులు రెండు, భూమి హక్కులు పట్టేదార్ పాస్‌పుస్తకాల సవరణ బిల్లు, రహదారి అభివృద్ధి కార్పోరేషన్ సవరణ బిల్లు, దుకాణాలు, వాణిజ్యసముదాయాల సవరణ బిల్లు, గేమింగ్ సవరణ బిల్లులను శాసనసభలో మంత్రులు ప్రతిపాదించారు. వీటిపై బుధవారం నుండి చర్చ జరుగుతుంది.

11/08/2017 - 01:08

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 7: ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించాల్సిన అసెంబ్లీని ప్రభుత్వం ప్రచార వేదికగా వాడుకుంటుందని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. జనాబాలో సగానికిపైగా ఉన్న బిసిల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. బిసిలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారని, బిసిల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని అన్నారు.

11/07/2017 - 04:38

సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం తో కార్చిచ్చు రాజుకుంటూనే ఉంది.

11/07/2017 - 04:36

ఉట్నూరు, నవంబర్ 6: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి గిరిజనులు సోమవా రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ముందు బైఠాయించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం 19 కిలోమీటర్ల మేరకు మహాపాదయాత్ర చేపట్టి ఉట్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.

11/07/2017 - 04:34

కరీంనగర్ టౌన్, నవంబర్ 6: రాష్ట్రంలోనూతనంగా ఏర్పా టు చేయనున్న జోనల్ వ్యవస్థపై ప్రభుత్వమే స్పష్టత నివ్వాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్ర ల్ యూనియన్ అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి అన్నారు.

Pages