S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/25/2017 - 02:30

హైదరాబాద్, అక్టోబర్ 24: కరీంనగర్ నగరాభివృద్థి సంస్థకు శాతవాహన అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీగా ప్రభుత్వం నామకరణ చేసింది.

10/25/2017 - 02:29

హైదరాబాద్, అక్టోబర్ 24: వైద్య, ఆరోగ్య శాఖలో 205 పోస్టులతో పాటు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో 88 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న 205 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు పేరుతో మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

10/24/2017 - 04:24

హైదరాబాద్, అక్టోబర్ 23: ఈ ఏడాది నవంబర్ 8 నుంచి వారం రోజుల పాటు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఉత్సవానికి బాలివుడ్, హాలివుడ్‌తో పాటు ప్రపంచంలోని చిత్ర రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరు కానున్నారు. గోల్డెన్ ఎలిఫెంట్ పేరుతో అతి పెద్ద ఉత్సవంగా నిర్వహించే 20వ బాలల చలన చిత్రోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం ఆతిధ్యం ఇస్తోంది.

10/24/2017 - 04:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: సామాజిక తత్వవేత్త, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు రచించిన ‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకాన్ని తెలంగాణ భవన్ గురజాడ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ సహాయ కమిషనర్ జి.రామ్మెహన్, ఆంధ్రభవన్ పరిపాలన అధికారి లింగరాజు పుస్తకాన్ని అవిష్కరించారు. రామ్మోహన్ మాట్లాడుతూ బిఎస్ రాములు తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీల పాత్ర పోషించారని అన్నారు.

10/24/2017 - 04:21

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య రంగంలో లక్ష్యాల సాధనకు సహకారం అందించేందుకు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ యూనివర్సిటీకి సంబంధించిన సచిన్ బల్సారీ , తరుణ్ కన్నాలు తెలంగాణ వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డితో సమావేశమయ్యారు. వేర్వేరు దేశాల్లో వైద్య ఆరోగ్య రంగాల్లో హార్వర్డ్ యూనివర్సిటీ సహకారం అందిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

10/24/2017 - 04:21

హైదరాబాద్, అక్టోబర్ 23: అమరుల స్ఫూర్తి యాత్రను ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంతగా నిర్వహిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని టిజాక్ సోమవారం నాడు హైకోర్టును కోరింది. అవసరమైతే ఇందుకు సంబంధించి అండర్‌టేకింగ్ ఇస్తామని కూడా టిజాక్ నేతలు పేర్కొన్నారు.

10/24/2017 - 04:20

హైదరాబాద్, అక్టోబర్ 23: తమ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ్ధర్ బాబును రాజకీయంగా అణగదొక్కేందుకు టిఆర్‌ఎస్ కుట్ర చేసిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. అందుకే గంజాయి కేసు పెట్టి వేధించాలని చూస్తున్నదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనిని తాము ఎదుర్కొంటామని, శ్రీ్ధర్ బాబుకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

10/24/2017 - 04:20

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రాన్ని టిబి రహిత రాష్ట్రంగా 2023 కల్లా మారుస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీవ్యాధుల దవాఖానాలోని టిబి శిక్షణ కేంద్రంలో సోమవారం జ్యోతివెలిగించి టిబి రోగులకు ప్రతిరోజూ మందుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో రోజు విడిచి రోజు మందులు ఇచ్చేవారు.

10/24/2017 - 04:18

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణలో ఐటీ రంగం శరవేగంగా దూసుకెళ్తోందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్ అన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఐటీ రంగంలో తెలంగాణ ఘననీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఐటీ నిపుణులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నారని, ఇటీవల ప్రపంచాన్ని వణికించిన పెట్యార్యాన్సమ్ వేర్ అనేక మాల్వేర్లను హైదరాబాద్ ఐటీ సంస్థలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయన్నారు.

10/24/2017 - 02:34

హైదరాబాద్, అక్టోబర్ 23: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫింగర్ ప్రింట్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం ముదావహమని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. సోమవారం ఫింగర్ ప్రింట్ బ్యూరో సిఐడి విభాగం నూతన ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. నేరాల గుర్తింపు, నేరస్థులను పట్టుకోవడంలో ఫింగర్ ప్రింట్ విభాగం ఎంతో ఉపకరిస్తుందని, కొత్తగా అన్ని హంగులతో ఏర్పాటు చేసిన శిక్షణ ల్యాబ్‌లో నైపుణ్యత కలిగిన సిబ్బంది ఉందన్నారు.

Pages