S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/24/2017 - 02:31

హైదరాబాద్, అక్టోబర్ 23: హైదరాబాద్‌లో క్యాబ్‌ల బంద్ కొనసాగుతోంది. సోమవారం ఐటీ సెక్టార్, సికిందరాబాద్, హైదరాబాద్‌లలో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఫైనాన్షియర్ల వేధింపులు అరికట్టాలని, ఓలా, ఉబేర్ లాంటి సంస్థల నిబంధనల పట్ల వారు క్యాబ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో గచ్చిబౌలి, ఐటీ కారిడార్ పరిధిలో వేలాది క్యాబ్‌లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

10/24/2017 - 02:31

హైదరాబాద్, అక్టోబర్ 23: నగదు బదిలీ ఆలోచన విరమించుకుని, రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు అందించాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అవినీతిని అరికట్టే నెపంతో సరుకుల సరఫరాకు బదులు నగదు బదిలీ చేయాలని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

10/24/2017 - 02:30

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్ర చలన చిత్ర సంగీత పోటీలు ‘తెలంగాణ స్వర సమరం-2017’ ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు భాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగనున్నాయి. కన్‌సరన్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో సెక్యూర్ గివింగ్ విభాగం నిర్వహిస్తోంది. మూడు కేటగిరిల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

10/24/2017 - 02:30

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో నియమితులై, శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ఎదుట ఎఐటియుసి ధర్నా నిర్వహించింది. ఏఐటియుసి గ్రేటర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డ్రైవర్లు పాల్గొన్నారు.

10/23/2017 - 04:11

నిజామాబాద్, అక్టోబర్ 22: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీసం సీజన్ చివరలోనైనా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశించగా, అలాంటి జాడలేవీ లేకుండానే వానాకాలం సీజన్ దాదాపుగా ముగిసిపోయింది. ఒకవేళ ప్రకృతి కరుణించి ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురిసినా ఏమాత్రం ప్రయోజనం లేని దైన్యస్థితి నెలకొంది.

10/23/2017 - 04:11

మహబూబ్‌నగర్, అక్టోబర్ 22: రైతులు అంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చులకన భావమని, ఈ మహానుభావుడి పరిపాలనలో మూడున్నరేళ్లలో 3500 మంది రైతుల ఆత్మహత్యలకు కెసిఆరే కారణమని రైతు వ్యతిరేకి అయిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికీ సాగనంపే పని ఆసన్నమైందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

10/23/2017 - 04:08

సిద్దిపేట టౌన్, అక్టోబర్ 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానంలో పాలిటిక్స్ పుల్..పాలన నిల్ అని..అప్రజాస్వామిక పరిపాలన కొనసాగిస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో అవినీతి అక్రమాల విషయాలు సిఏం దృష్టికి వచ్చినా స్పందించడం లేదన్నారు.

10/23/2017 - 04:06

మిర్యాలగూడ, అక్టోబర్ 22: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణాజలాలు రాకున్నా త్వరలో గోదావరి జలాలను మళ్లించి సాగర్ ఎడమకాల్వకు రెండు పంటలకు నీరందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

10/23/2017 - 04:03

పాన్‌గల్, అక్టోబర్ 22: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని మందాపూర్ గ్రామ సమీపంలో భీమా కాల్వ ఆదివారం సాయంత్రం నీటి ఉద్ధృతికి కోతకు గురైంది. దీంతో సమీపంలో ఉన్న వీరన్న చెరువులోకి ప్రవహించడంతో చెరువులోని సగానికి పైగా నీళ్లు లోబ్యాంకింగ్ ద్వారా కాల్వలోకి ప్రవహిస్తున్నాయ.

10/22/2017 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 21: గ్రేటర్ పరిధిలోని జూబ్లిహిల్స్ నియోజక వర్గంలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. నియోజక వర్గ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్ డివిజన్ల పరిధిలో శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఓసారి భూమి కదిలినట్టు అనిపించినా బంబుల పేళుల్లతో ఇలా జరిగి ఉంటుందని స్థానికులు భావించారు.

Pages