S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/22/2017 - 03:12

హైదరాబాద్, అక్టోబర్ 21: ‘నాకే అధికారం ఉంటే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వాన్ని..’ అని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రేవంత్ రెడ్డితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే అధికారం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీకి ఉందన్నారు.

10/22/2017 - 03:08

హైదరాబాద్, అక్టోబర్ 21: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున పూర్తి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.

10/22/2017 - 03:07

హైదరాబాద్, అక్టోబర్ 21: వచ్చే ఐదేళ్లలో బాలకార్మికులు లేని బంగారు తెలంగాణ రూపకల్పనకు విధివిధానాలను, సమగ్ర కార్యాచరణను రూపొందించినట్టు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ సభావత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నిర్మూలన పునరావాస సవరణ చట్టంలో మరిన్ని నియమనిబంధనలు చేర్చి దానిని తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా అమలుచేస్తామని అన్నారు.

10/22/2017 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ నుండి ఉపాధికోసం తొమ్మిది నెలల కింద కువైట్ వెళ్లిన ఇద్దరిని అక్కడి బడావ్యాపారవేత్త బానిసలుగా మార్చి, బందీ చేయడంతో రాష్ట్ర మంత్రి కెటిఆర్ చొరవతో వారు విముక్తులయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మగ్గిడి శేఖర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కందుల సాయికుమార్ తొమ్మిది నెలల కింద కువైట్ వెళ్లారు.

10/22/2017 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి బకాయిలు వసూలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా అమలు చేయలేనందుకు కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర అగ్నిమాపక శాఖ డిజి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షామీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.

10/22/2017 - 03:03

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రవాశ భారతీయులు తెలంగాణ విద్యార్థులను ప్రోత్సహించాలని, వర్శిటీల్లో తమ కుటుంబ సభ్యుల పేరిట బంగారు పతకాలు నెలకోల్పాలని, అలాగే విద్యార్థుల చదువులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకట రమణ కోరారు.

10/22/2017 - 03:03

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రామప్ప దేవాలయం పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదని, ఈ దేవాలయం స్ధితిపై పత్రికల్లో వచ్చిన వార్తలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌రావుప్రధానన్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిల్ కమిటీ న్యాయమూర్తికి రెఫర్ చేశారు.

10/22/2017 - 03:02

మహాదేవపూర్, అక్టోబర్ 21: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన తల్లి దివంగత విజయలక్ష్మి అస్తికలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంనకు చేరుకున్నారు. ఇక్కడి త్రివేణి సంగమ నదీ ప్రాంతంలో తన తల్లి అస్తికలను ఆయన నిమజ్జనం చేశారు.

10/22/2017 - 00:42

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్‌లోని స్వామి రామానంద తీర్ధ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో తెలంగాణలోని గ్రామీణ యువతకు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఉపాధి కల్పించేందుకు ఎనిమిది కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు డైరెక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు.

10/21/2017 - 04:58

తొగుట, అక్టోబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగం పనుల్లో పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు డిటొనేటర్ పేలుడుకు తునాతునకలై మృత్యువాతకు గురైన సంఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ శివారులో జరిగింది. కార్మికులు నివాస ప్రాంతమైన షెడ్ సమీపంలో పేలుడు సంభవించటం వల్ల మృతుని శరీర బాగాలు షెడ్‌పై ఇతర చోట్ల పడిపోయాయి.

Pages