S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/01/2017 - 02:24

హైదరాబాద్, జూలై 31: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనపై కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 28న ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తెల్లవారుఝామున 3గంటల 18 నిమిషాల సమయంలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి నెలకొన్న మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్‌పై జరిగిన కాల్పులు వాస్తవమేనని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు.

08/01/2017 - 02:23

హైదరాబాద్, జూలై 31: వచ్చే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, దానికి అనుగుణంగా గెలుపే లక్ష్యంగా రోడ్‌మ్యాప్ రూపొందించామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. ఆగస్టు చివరి నాటికి బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే పల్లెపల్లెకు బిజెపి- ఇంటింటికీ మోదీ పేరుతో ఆరువేలమంది కార్యకర్తలు 23 వేల పోలింగ్ బూత్‌లలో పర్యటించారని తెలిపారు.

08/01/2017 - 02:21

హైదరాబాద్, జూలై 31: మత్తు పదార్థాల (డ్రగ్స్) కేసులో ఉన్న వారి పేర్లు బయటపెట్టకుండా ఒత్తిడి తెస్తున్న వారెవరో బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు.

08/01/2017 - 02:19

న్యూఢిల్లీ, జూలై 31: పేదల ఇళ్ల నిర్మాణానికి సికింద్రాబాద్ లాలాపేటలోని పదెకరాల రైల్వే స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించేలా చూడాలని కేంద్ర మంత్రి మంత్రి బండారు దత్తాత్రేయకును తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు విజ్ఞప్తి చేశారు. సోమవారంనాడు దత్తాత్రేయను ఆయన కార్యాలయంలో పద్మారావు కలిశారు.

08/01/2017 - 02:19

హైదరాబాద్, జూలై 31: నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో బలహీనంగా ఉన్నాయి. దాంతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) వర్షసూచన ఏదీ చేయలేదు. గత 24 గంటల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడా కొద్దిపాటి వర్షాలు కురిశాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

08/01/2017 - 02:18

హైదరాబాద్, జూలై 31: నామ మాత్రం కమీషన్‌తో రేషన్ డీలర్లు జీవనాన్ని కొనసాగించలేకపోతున్నారని, కమీషన్ పెంచి, ఆదుకోవాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్‌ను డీలర్లు కోరారు. కమీషన్ పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మెను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమీషనర్ ఆనంద్‌పై నమ్మకంతో విరమిస్తున్నట్టు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు తెలిపారు.

08/01/2017 - 02:18

హైదరాబాద్/మర్పల్లి, జూలై 31: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలోని కెజిబివి (కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం) హాస్టల్ వార్డెన్ విద్యార్థులను అవమానించడం, దుర్భాష, దూషణలకు తెగబడ్డారు. దీంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి తోటి విద్యార్థులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలావున్నాయి.

08/01/2017 - 02:17

హైదరాబాద్, జూలై 31: రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు ఆరోగ్య కార్డుల అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన అక్రిడేషన్ లేని వివిధ పత్రికలు, చానెల్స్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారంతా ఆగస్టు 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

08/01/2017 - 01:56

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్‌లో నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. జెఎన్‌టియుకి చెందిన నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యుడిని వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

08/01/2017 - 01:54

హైదరాబాద్, జూలై 31: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ఈ సమావేశంలో రవాణా, వైద్య, ఆరోగ్య, రోడ్లు, భవనాల శాఖ, ఆబ్కారీ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.

Pages