S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/01/2017 - 01:53

హైదరాబాద్, జూలై 31: జెఎన్‌టియు హెచ్‌లో ఇంజనీరింగ్ ఫస్టియర్ పరీక్షల్లో దాదాపు 60 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో వారందరికీ సప్లిమెంటరీ రాసుకునే అవకాశాన్ని కల్పించినట్టు జెఎన్‌టియు హెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య తెలిపారు. ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ విద్యార్ధులు ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

08/01/2017 - 01:52

హైదరాబాద్, జూలై 31: ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం 2709 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సేకరించిన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా అడవులు పెంచడానికి యుద్ధ ప్రాతిపదికన భూమి సేకరించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

08/01/2017 - 01:51

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ డిజిపి కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దొంగతో అక్రమ సంబంధం అంటగట్టారంటూ తొమ్మిది నెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న సదరు మహిళ ఫినాయిలు తాగి సోమవారం సాయంత్రం డిజిపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ ఖమ్మం జిల్లావాసిగా గుర్తించారు.

07/31/2017 - 03:21

గజ్వేల్, జూలై 30: అన్నదాతల ఆత్మహత్యలు రాష్ట్రానికి అరిష్టమని, అవగాహన లేని ప్రాజెక్టుల నిర్మాణంతో పేద రైతులు బుక్కెడు బువ్వ కోల్పోతారని రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్రలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

07/31/2017 - 03:19

హైదరాబాద్, జూలై 30: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ, రైల్వే బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్వే మెగా జాబ్ మేళా (మనకోసం)కు విశేష స్పందన లభించింది. ఆదివారం సికిందరాబాద్‌లోని రైల్వే డిగ్రీ కళాశాల ఆవరణలో రైల్వేశాఖకు చెందిన వారి పిల్లల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.

07/31/2017 - 03:17

సంగారెడ్డి, జూలై 30: తరతరాలుగా పంటలను పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న విలువైన భూములు పంటలు పండించుకోవడానికి అనుకూలంగా లేవనే సాకుతూ రిజర్వాయర్ నిర్మాణానికి భూములు అప్పగించాలనడం విడ్డూరంగా ఉందని సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన రైతు బి.క్రిష్ణ ఆవేదన వ్యక్తం చేసారు.

07/31/2017 - 03:16

వరంగల్, జూలై 30: వరంగల్ నగరాన్ని రెండు ముక్కలుగా చేసే ప్రయత్నానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నగరాన్ని రెండు ముక్కలుగా చేసి సమీప మండలాలను కలిపి వరగంల్, హన్మకొండ జిల్లాలుగా మార్చే ఆలోచనకు ప్రభుత్వం మళ్లీ పదును పెడుతోంది. ఫలితంగా నగరంలోని ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి నాన్‌లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడుతోంది.

07/31/2017 - 03:15

సంగారెడ్డి, జూలై 30: తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర ఒకటి, రెండు విడతల కార్యక్రమానికి లభించిన ప్రజా మద్దతును చూసి ఓర్వలేక మూడవ విడత కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురిచేసిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. అనుమతి కోసం పోలీసుల వద్దకు వెళితే ఏకంగా మూడు గంటల పాటు నాటకీయ పరిణామాలతో రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేసారని ధ్వజమెత్తారు.

07/31/2017 - 03:00

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ రాష్ట్రాన్ని ‘మనుషులు, పిల్లల అక్రమ రవాణారహిత, వ్యభిచార రహిత రాష్ట్రం’గా మారుస్తున్నామని పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనురాగ్ శర్మ తెలిపారు.

07/31/2017 - 02:58

హైదరాబాద్, జూలై 30: సిరిసిల్లలో దళితులు, గిరిజనులు, బిసిలపై జరిగిన అమానుష దాడి సభ్య సమాజం తల దించుకునేలా ఉందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆవేదన చెందారు. దళితులపై జరిగిన దాడి, నిర్భందాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో సోమవారం కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు మీరా కుమార్ ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

Pages