S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/31/2017 - 02:56

హైదరాబాద్, జూలై 30: డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత పౌరులపై కూడా ఉందని ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్కు వద్ద ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్ వాక్’ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ మత్తు పదార్థాల (డ్రగ్స్)కు అలవాటై జీవితాలను నాశనం చేసుకోరాదని కోరారు.

07/31/2017 - 02:31

చిత్రం.. కెబిఆర్ కనె్వన్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ కుమార్తె రోహిత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు

07/31/2017 - 02:24

హైదరాబాద్, జూలై 30:తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు జాగృతి ప్రకటించింది.

07/31/2017 - 02:23

న్యూఢిల్లీ, జూలై 30: ఎస్సీ వర్గీకరణ విషయంలో కుట్రలు చెయ్యవద్దని యాతాకుల భాస్కర్ మాదిగ నేతృత్వంలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వరుసగా నాల్గవరోజు నిరసన కార్యక్రమం కొనసాగింది.

07/31/2017 - 02:22

హైదరాబాద్, జూలై 30: విద్యుత్తు శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

07/31/2017 - 00:56

హైదరాబాద్, జూలై 30:గణపతి ఉత్సవాలకు ఈసారి నగరంలో లక్ష పర్యావరణ గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.జిహెచ్‌ఎంసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విగ్రహాలను పంపిణీ చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి.

07/31/2017 - 00:56

హైదరాబాద్, జూలై 30: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే 111 మంది రైతు లు ఆత్మహత్య చేసుకున్నారని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. రైతు ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు టి.జెఎసి చేపట్టిన తెలంగాణ అమర వీరుల స్పూర్తి యాత్రలో భాగంగా ఆదివారం మూడ వ విడత యాత్రను ప్రొఫెసర్ కోదండరామ్ నగరంలోని అమర వీరుల స్థూపం వద్ద ప్రారంభించారు.

07/31/2017 - 00:55

హైదరాబాద్, జూలై 30: వచ్చే ఆగస్టు నెలలో వరుణుడు కరుణించకపోతే కరవుబారినపడుతామన్న ఆందోళన ఆంధ్ర, తెలంగాణ ప్రాంత రైతుల్లో తీవ్రమైంది. ఆగస్టు నెలలో వర్షాలు కురిస్తే ఫర్వాలేదు. లేని పక్షంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జూలై నెలలో భారీ వర్షాలతో రైతాంగాన్ని కరుణించిన వరుణుడు వరుసగా పది రోజుల నుంచి ముఖం చాటేయడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైతాంగం కలవరం చెందుతున్నారు.

07/31/2017 - 00:54

హైదరాబాద్, జూలై 30: రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపి సంబంధాలపై రెండు పార్టీల శ్రేణుల్లో డైలా మా ఏర్పడింది. అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించి వెళ్లగానే ఇక దూకుడుగా అధికార పక్షంపై విరుచుకుపడాలి అని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి తగ్గట్టు ఒకటి రెండు రోజులు రెండు పార్టీల నాయకులు పరస్పరం తీవ్రంగా విమర్శించుకుంటారు. చల్లబడిన తరువాత రెండు పార్టీల అధినేతలు ఒకరికొకరు మద్దతు ప్రకటిస్తారు.

07/31/2017 - 00:54

హైదరాబాద్, జూలై 30: సిరిసిల్లలో దళితుల పక్షా న నిలబడి పోరాటం చేసే విషయంలో నిర్వహించాలనుకున్న బహిరంగ సభ అంశం ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. సిరిసిల్లలో సభ నిర్వహించి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉండగా, ఏ విధంగానైనా భగ్నం చేయాలన్న భావనతో పోలీసు లు ఉన్నట్లు తెలుస్తోంది.

Pages