S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/31/2017 - 00:53

హైదరాబాద్, జూలై 30: దేశంలో మతోన్మాద శక్తులను, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ నియంతృత్వ పాలనను ప్రతిఘటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో ప్రారంభమైన సిపిఐ జిల్లా కార్యదర్శుల వర్కుషాపులో ఆయన ప్రసంగించారు.

07/30/2017 - 06:03

హైదరాబాద్, జూలై 29: ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అభినందన సభకు సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి హాజరుకావడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జానారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టి.పిసిసి సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్థన్ రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు.

07/30/2017 - 06:02

హైదరాబాద్, జూలై 29: నగరంలో కలకలం సృష్టించిన మాజీ మంత్రి ముకేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై నెలకొన్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

07/30/2017 - 06:02

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడి కేంద్రాలకు ‘హాకా’ ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా పిలిచిన టెండర్లతో కిలో కందిపప్పు ధరను 57.15 రూపాయలుగా నిర్ణయించారు. హాకాకు కమిషన్ ఇచ్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ శనివారం ఇక్క డ తెలిపారు.

07/30/2017 - 06:00

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రం లో విద్యారంగాభివృద్ధికి కేంద్రప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని, జాతీయ విద్యాసంస్థలను మంజూరు చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగిన బడి- గుడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

07/30/2017 - 05:56

హైదరాబాద్, జూలై 29: ప్రభుత్వ దవాఖానాలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె దవాఖానాలో కొత్తగా వౌలిక సదుపాయాలను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతోకలిసి శనివారం ప్రారంభించారు.

07/30/2017 - 05:55

హైదరాబాద్, జూలై 29: మన రాష్ట్రా న్ని డ్రగ్స్ రహిత తెలంగాణాగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. శనివారం రామకృష్ణమఠంలో వివేకానంద మాన వ వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రద్ధాయువజన వర్క్‌షాప్‌కు ఆయన హాజరై యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా రు.

07/30/2017 - 05:50

హైదరాబాద్, జూలై 29: తెలంగాణలో ఎస్సై రాత పరీక్షా ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫలితాల విడుదలలో జాప్యం చేయడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనకు దిగితే వారిని అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు.

07/30/2017 - 05:50

హైదరాబాద్, జూలై 29:వచ్చే ఎన్నికల్లో టిర్‌ఎస్ బిజెపి పోటీ చేస్తాయి అనేది ఊహాగానాలు మాత్రమేనని, అలాంటిదేమీ లేదని టిఆర్‌ఎస్ ఎంపి కవిత తెలిపారు. రక్షాబంధన్ వినూత్నంగా చేసుకోవాలని కోరుతూ సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం చేపట్టారు. రాఖీ పండుగ సందర్భంగా అన్నకు రాఖీతో పాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని కోరారు.

07/30/2017 - 05:49

హైదరాబాద్, జూలై 29:కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో చిల్లర రాజకీయా లు చేస్తున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తలసాని శనివా రం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సిరిసిల్ల ఘటనపై కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాం తం చేస్తున్నారని మం డిపడ్డారు. దళితులపై కాంగ్రెస్‌ది మొసలి కన్నీరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages