S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/02/2017 - 02:03

హైదరాబాద్, ఆగస్టు 1: బిసి వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం సచివాలయంలో శాలివాహన సంఘ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసిలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా పథకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా బిసిలు ఎదగాలని అన్నారు.

08/02/2017 - 00:15

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ రెండురోజుల సమ్మెను మంగళవారం రాత్రి విరమించుకున్నారు. ప్రధానమైన దవాఖానాల్లో వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన రక్షణ కల్పిస్తామని వైద్యవిద్య డైరెక్టర్ రమేష్‌రెడ్డి ఇచ్చిన హామీతో సమ్మె ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

08/02/2017 - 00:13

హైదరాబాద్, ఆగస్టు 1: దేశంలో వినియోగదారుల చట్టంలో సమూల మార్పులు రానున్నాయి. ఇంత కాలం దేశంలో నిస్తేజంగా ఉన్న చట్టాలకు కేంద్రప్రభుత్వం కోరలు ఇవ్వనుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రస్తుత సమావేశాల్లోనే వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పులకు పార్లమెంటు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బిల్లులోని అంశాలను కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

08/01/2017 - 02:59

కరీంనగర్, జూలై 31: ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్న తెరాస సర్కారు తీరు సిగ్గుచేటని, దశాబ్దాల తరబడి తెలంగాణలో అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాలు, దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీ ఆకాంక్షలను తెరాస ప్రభుత్వం తుంచేస్తోందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

08/01/2017 - 02:55

నల్లగొండ, జూలై 31: వర్షాభావ పరిస్థితులతో కృష్ణానదికి వరదలు కరువై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయ. దీంతో తాగునీటి కోసం సాగర్ జలాశయంపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ ప్రజలకు గడ్డుకాలం సమీపించింది. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం ముందెన్నడూ లేని రీతిలో 500.70 అడుగులకు పడిపోవడంతో నీటి కరవు రోజురోజుకు జటిలమవుతోంది.

08/01/2017 - 02:53

బోయినిపల్లి, జూలై 31: సిరిసిల్ల రాజన్న జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల మండలం రగుడుకు చెందిన బూర శ్రీనివాస్ అనే యువకుడు కొదురుపాక నుండి బోయినిపల్లి వైపు బైక్‌పై వెళ్తున్నాడు.

08/01/2017 - 02:52

హైదరాబాద్, జూలై 31: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజినరేగా) పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో ‘అంబుడ్స్‌మన్’ను నియమించాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు, ఎంజినరేగా నియమావళికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబుడ్స్‌మన్‌లను ఎంపిక చేసేందుకు రాష్టస్థ్రాయిలో ఒక కమిటీని నియమించారు.

08/01/2017 - 02:52

హైదరాబాద్, జూలై 31: కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని తెరాస నాయకుడు, టిఎస్‌ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దళితుల పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదని, ఇసుక క్వారీల విషయంలో కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఆయన విమర్శించారు.

08/01/2017 - 02:28

హైదరాబాద్, జూలై 31: డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు సోమవారం యువ నటుడు తనీష్ హాజరయ్యాడు. డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్‌తో సంబంధాలున్నాయన్న ఆధారాలతో తనీష్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ మేరకు ఆయనను నాలుగు గంటలపాటు విచారణ జరిపినట్టు సిట్ అధికారులు తెలిపారు. తనీష్‌తోపాటు ముగ్గురిని విచారించినట్టు సిట్ అధికారులు తెలిపారు.

08/01/2017 - 02:26

హైదరాబాద్, జూలై 31: జాతీయ జల విధానంలో భాగంగా తాగునీటి పథకాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జలాశయాల్లో కనీస నీటి మట్టాలను నిర్థారించాలని సాగునీటి అధికారులను ఆయన సోమవారం ఆదేశించారు. మిషన్ భగీరథకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నట్టు చెప్పారు.

Pages